కార్మిక మంత్రిత్వశాఖ 17 సెప్టెంబర్ 2019న, మంత్రిత్వశాఖ వెబ్సైటులో ప్రచురించిన కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఫైల్ నెం. జెడ్-13025/13/2015-ఎల్.ఆర్.సి మీద అక్టోబర్ 24, 25 తేదీలలో జాతీయ స్థాయిలో వివిధ కార్మిక సంఘాలు స్వచ్ఛంద సంస్థలు, సంఘటిత, అసంఘటిత, గృహ ఆధార కార్మికుల ప్రతినిధులతో చర్చను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చర్చ ముఖ్య …
జన్యుమార్పిడి పంటల గురించి దేశంలో తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపధ్యంలో ప్రముఖ భారతీయ శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి పంటలకు అనుమతిని ఆపాలని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు నవంబర్ 20న రాసిన లేఖలో కోరారు. సుప్రీంకోర్టు సాంకేతిక నిపుణుల కమిటీ నివేదికలో ఇచ్చిన సూచనలను భారత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని, సాంకేతిక కమిటీలోని మెజారిటీ సభ్యులు సూచించినట్లు …
”తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్” అన్నాడు మహాకవి గురజాడ.. దేశంలో ఆహార పంటల ఉత్పత్తి పెరిగిందనీ, ప్రభుత్వాల దగ్గర ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయనీ ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దేశంలో కరువు కాటకాలు, ఆహార కొరతను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం దగ్గర బియ్యం బఫర్ స్టాక్ 13.58 మిలియన్ టన్నులు ఉండాల్సి వుండగా, …
అత్యధిక ఇంధనాలను వాడి ఫ్యాక్టరీలలో తయారు చేసే రసాయన ఎరువులు, విష పూరిత రసాయన కీటక నాశనులు ఇప్పటికే పర్యావరణంపై, అన్ని జీవ జాతుల ఆరోగ్యంపై చూపిస్తున్న దుష్ప్రభావాలను మనం అనుభవిస్తున్నాం. రసాయన ఎరువులను రైతులకు అందించడానికి దేశ బడ్జెట్లో అత్యధిక నిధులను కేటాయించడాన్ని కూడా మనం చూస్తున్నాం. పైగా ఈ రసాయన ఎరువుల ధరలు …
మంచి విత్తనాలే మంచి దిగుబడులిస్తాయి – డా॥ జి.రాజశేఖర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం అధిక దిగుబడులు సాధించడానికి అవసరమైన వుత్పాదకాన్నింటిలోకీ విత్తనం అతి ముఖ్యమైనది. వ్యాస మహర్షి తండ్రి ఋషి పరాశరుడు ‘‘అత్యధిక దిగుబడులకు మూలం విత్తనం’’ అని అన్నారు. విత్తన స్వచ్ఛత కొనసాగించాలంటే విత్తనాలను మూడు సంవత్సరాలకు ఒకసారి నాణ్యమైన, జన్యు శుద్ధి కలిగిన …
మామిడి రకాలు నీలం : ఆలస్యంగా కోతకు వచ్చే ఈ రకం దక్షిణ ఆంధ్రలోనూ, తమిళనాడులోనూ ఎక్కువగా పెంచబడుతోంది. చెట్టు మధ్యస్థం, పండు మధ్యమం. తోు మరీ మంద ముండదు. కండ నార లేదు. పసుపు పచ్చ రంగు. నాణ్యత ఎక్కువ, ఏటేటా దట్టంగా ఆలస్యంగా నమ్మకంగా కాస్తుంది. కాయ బాగా నిలువ ఉంటుంది. టెంక …
నాణ్యమైన బెండసాగుకు సూచనలు మన రాష్ట్రంలో సాగుచేస్తున్న కూరగాయల పంటల్లో టమాట, వంగతో పాటు బెండ కూడా ప్రధానమైన పంట. ఈ పంటను పట్టణాలు, నగర పరిసరాల్లో సాగు చేసుకుంటే లాభదాయకం. బెండలో మనకు కావలసిన పోషకాలే కాకుండా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణసంబంధిత వ్యాధులకు, మూత్ర సంబంధిత వ్యాధులకు ఔషధంగా బెండను …
మెట్టభూముల్లో పండ్ల తోటల సాగు మన రాష్ట్రంలో అధికశాతం వ్యవసాయ పొలాలు, వర్షాధారంపై ఆధారపడి ఉన్నాయి. అందువల్ల ఆహారోత్పత్తి ఒక నిర్ణీతస్థాయిలో ఉండటం లేదు. అంతేకాకుండా చాలా వరకు మెట్ట ప్రాంతాల్లో పై పొర కొట్టుకుపోయి నేల నిస్సారమవుతుంది. దానికితోడు గత కొద్ది కాలంగా మన రాష్ట్రంలో ఏర్పడే వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతు ఎక్కువగా …
ఖరీఫ్‌లో కూరగాయల సాగు ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలవడంతో రైతులు తమ పంటలను వేసుకోవడానికి సిద్ధమౌతున్నారు. కూరగాయల పంటను పండించే రైతులు సరైన పద్ధతులు పాటిస్తే మంచి ఫలితాలు పొందగరు. ఖరీఫ్‌లో వేసుకోవడానికి టమాట, వంగ, మిరప, బెండ, చిక్కుడు, గోరుచిక్కుడు, ఆకుకూరలు, తీగజాతి కూరగాయలు దాదాపు అన్ని కూరగాయలూ అనువైనవే. తీగజాతి కూరగాయలు, చిక్కుడు, గోరుచిక్కుడు, …
వరిలో ఆకు చుట్టు పురుగు పురుగు ఆశించు కాలం: మార్చి – నవంబర్ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొక్కలను సరియైన దూరంగా నాటాలి. పురుగు గుడ్లను, ఫ్యూపాలను నాశనం చేయడానికి పంట కోత పూర్తి కాగానే భూమిని దున్నుకోవాలి. 8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి. నివారణ …
