సీతాఫలం కృత్రిమ రసాయనాలకు ప్రత్యామ్నాయంగా సస్యరక్షణ కోసం వృక్షసంబంధ కీటకనాశనుల తయారీలో సీతాఫలం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సీతాఫలం వర్షాకాలం సమయంలో తియ్యని పండ్లనిచ్చే చిన్న వృక్షం. సస్య రక్షణలో సీతాఫలం ఆకులను, విత్తనాలను ఉపయోగించవచ్చు. వీటిలో గల ఆల్కలాయిడ్స్ పురుగుల నియంత్రణలో ఉపయోగపడతాయి. 5 కిలోల సీతాఫల ఆకులను 10 లీటర్ల నీటిలో వేసి …
మురిపిండ మురిపిండ మొక్కలో ఉన్న ‘కన్నాబినాల్’ అనే రసాయనం కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా మరియు క్రిమిసంహారకంగా పనిచేస్తుంది. మురిపిండ ఆకులను పంచపత్ర కషాయం తయారీలో వుపయోగించవచ్చు. ఈ కషాయాన్ని రైతులు తమంతటతామే పొలం వద్ద తయారు చేసుకోవచ్చు. మురిపిండ ఆకుల కషాయానికి స్పర్శ చర్య మరియు ఉదర చర్య ఉంటాయి. అందువలన ఈ కషాయం ఒకశక్తివంతమైన …
లాంటాన ఈ మొక్క ఆకులను వ్యవసాయంలో సస్యరక్షణ కోసం వుపయోగించవచ్చు. ఈ మొక్క ఆకులలో, ఫలాలలో టెర్పనాయిడ్స్, సైటోస్టీరాల్, కెమారనింగ్ యాసిడ్, లాంటానోన్ వంటి అనేక రకాలైన రసాయనాలు ఉంటాయి. లాంటానా మొక్క ఆకులలో ఉన్న అనేక రసాయనాలు ఎంతో శక్తివంతమైనవి. లాంటానా ఆకుల కషాయం పంటలలో వచ్చే రసంపీల్చే పురుగులను, ఆకుముడత మరియు ఆకులను …
మందార మందార ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలలో సహజ సిద్ధంగా పెరుగుతుంది. ఇండ్లలో, ఉద్యాన వనాలలో పెంచబడుతుంది. ఈ మొక్క పత్రాలలో మరియు పువ్వులలో ఆంథోసయనిన్స్ మరియు ఫ్లావనాయిడ్స్ సయానిడిన్, గ్లూకోసైడ్స్, రిబోఫ్లానిన్, ఏస్కార్బిక్ యాసిడ్ వంటి అనేక రసాయన పదార్థాలుంటాయి. మందార మొక్క ఆకులు, మరియు పువ్వులలో వున్న రసాయనాలు కీటక నియంత్రణలో ముఖ్యంగా మామిడి, …
బోగన్ విల్లియా ఇది ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాలలో సహజ సిద్ధంగా పెరుగుతుంది. వుద్యానవనాలలో, పార్కులలో, కాలేజీల ఆవరణలో మరియు ఇండ్ల దగ్గరా పెంచబడుతుంది. ఈ మొక్క ఆకులను (పత్రాలు) వ్యవసాయంలో సస్యరక్షణ కోసం వుపయోగించవచ్చు. వీటిని వైద్య పరంగా కూడా ముఖ్యంగా దగ్గు నివారణ మందులలో ఆదివాసీలు ఉపయోగిస్తారు. ఈ మొక్కలో బీటాసైనిక్, పింటాల్, ఫ్లావనాయిడ్స్, …
కుంకుడు కుంకుడు చెట్లు సుమారు 8-10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. పత్రాలు కణుపునకు రెండు చొప్పున దీర్ఘ అండాకారంలో వుంటాయి. ఫలాలు గుండ్రంగా వుండి, ఎండినపుడు తేనెరంగులో గానీ లేత నలుపు రంగులో గానీ వుంటాయి. కుంకుడు చెట్టు ఆంధ్రప్రదేశ్ అంతటా వుంటుంది. ఈ మొక్క ఫలాలలో ‘సాపోనిన్స్’ వంటి నురుగు పుట్టించే పదార్థాలు …
కుక్కతులసి ఈ మొక్క పంట పొలాలలోనూ, బీడు భూములలోను, గ్రామాలలో కంచెల వెంబడి కలుపు మొక్కగా పెరుగుతుంది. ఈ మొక్కను వైద్యపరంగా దగ్గు నివారణ కొరకు ఉపయోగిస్తారు. కుక్కతులసి మొక్క ఆకులలో వున్న రసాయనాలు చాలా శక్తివంతమైనవి. అందువల్ల కుక్కతులసి ఆకుల కషాయం పంటలపై పిచికారీ చేస్తే కషాయంలో వుండే రసాయనాలు (ముఖ్యంగా యూజినాల్) కీటకాలకు …
సరస్వతి ఆకు ఈ మొక్కలో వల్లారిన్, బ్రహ్మిక్ ఏసిడ్, సెంటిల్లోజ్, ఏసియాటిక్ ఏసిడ్, హైడ్రోకాటిలిన్, సెంటిలోసైడ్, సైటోస్టిరాల్ వంటి శక్తివంతమైన రసాయనా లుంటాయి. ఈ మొక్క రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే మానసిక వ్యాధులు నివారణ అవుతాయి. తెలివి తేటలు పెరుగుతాయి. ఈ మొక్క రసం చర్మానికి రక్షణ కల్పిస్తుంది. జ్వరాల నివారణలో ఉపయోగపడుతుంది. ఈ …
కొడిశపాల కొడిశపాల సుమారు 2-3 మీటర్ల ఎత్తు వరకూ పెరిగే చిన్న వృక్షం. మన రాష్ట్రంలో ముఖ్యంగా ఏజన్సీ ప్రాంతాలలోనూ, గ్రామ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న చిట్టడవులలోనూ, తేలిక నేలలలో ఈ వృక్షం కనపడుతోంది. ఆకులను తెంపితే పాలు కారతాయి. పత్రాలు కణుపుకు రెండు చొప్పున అండాకారంలో ఉంటాయి. ఈ మొక్కలో అనేక రకాల రసాయనాలు …
జిల్లేడు జిల్లేడు మొక్కలు ఆంధ్రప్రదేశ్ అంతటా పొలాలలోనూ, బీడు భూములలోనూ, రోడ్ల వెంబడీ కలువు మొక్కగా పెరుగుతాయి. ఈ మొక్క పత్రాలు, పుష్పాలు, వేరు, పాలను ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. గొంగళి పురుగులను నివారించుటకు పొలం చుట్టూ లోతైన మడక చాలును ఏర్పాటు చేసి, అందులో ”జిల్లేడు” ఆకులను పరచి, వాటికి ఆశించిన పురుగులను …
