కౌలు రైతులకు రైతు భరోసా రావటంలో ఉన్న సమస్యల గురించి, వీలైనంత త్వరగా కౌలు రైతు గుర్తింపు కార్డు స్థానంలో వచ్చిన సి.సి.ఆర్.సి. (క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ కార్డ్) ఇవ్వాలని, ప్రతి వాస్తవ సాగు దారునికి రైతు భరోసా అందే విధంగా చూడాలని, రైతు ఆత్మహత్య కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి …
నారుకుళ్ళు తెగులు: నారు మడిలో లేత మొక్కలు గుంపులుగుంపులుగా చనిపోతాయి. నారుకుళ్ళు నివారణ: విత్తనాలను విత్తన శుద్ధి చేసి ఎత్తైన నారుమడులలో నారును పెంచాలి. నారు మొలకెత్తిన తరువాత కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి నారుమడి తడిసేలా పిచికారీ చేయాలి. బాక్టీరియా ఆకుమచ్చ తెగులు మరియు కోనఫోరా కొమ్మకుళ్ళు తెగులు : …
పంజాబ్, హర్యానా పంటపొలాల్లో మళ్ళీ మంటలు ఎగిసి పడుతున్నాయి. ‘నాసా’ శాటిలైట్ చిత్రాలు వీటి విశ్వరూపాన్ని చూపిస్తున్నాయి. వరి కోతల తర్వాత, సెప్టెంబర్ చివరి వారం నుండీ అక్టోబర్ మధ్య వరకూ పొలాల్లో పంట మిగులు గడ్డిని తగలబెట్టి గోధుమ సాగుకు పంట పొలాలను సిద్ధం చేసుకునే ఈ ప్రక్రియ దశాబ్దాలుగా పర్యావరణ సమస్యలను సృష్టిస్తున్నది. …
రైతు పేరు: గంగల మహేశ్వరరెడ్డి తండ్రి పేరు: గంగల పెద్ద భీమారెడ్డి గ్రామము: సింధనూరు మండలం: ఐజ జిల్లా: మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ జిల్లా, ఐజ మండలం, సింధనూరు గ్రామంలో దాదాపు 350 కుటుంబాలు, 1400 మంది ఓటరు జనాభా వున్నారు. అందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారే. గ్రామంలో సాగునీటి కోసం తుంగభద్రా నది …
ఆడపిల్ల పుడితే చులకనగా చూడటం, అవకాశముంటే కడుపులోనే అంతమొందించడం పట్టణాలకే పరిమితమై లేదు. మారుమూల అడవీ ప్రాంతాలకు, గిరిజన తండాలకు కూడా వ్యాపించింది. ఆడపిల్లలను కన్న పాపానికి ఓ గిరిపుత్రిక చిత్రహింసలకు గురయింది. ఆ హింసనుండి బైటపడి, తన భవిష్యత్ జీవితాన్ని తానే తీర్చి దిద్దుకుంది. నేడు అంతర్జాతీయ వేదికలపై అనర్గళంగా మాట్లాడే స్థాయికి ఎదిగింది. …
జీడిమామిడిలో ఎరువుల యాజమాన్యం కూడా ఒక ముఖ్యమైన అంశమే. జీడిమామిడి మొక్కలు ఆరోగ్యంగా, దృఢంగా పెరిగి త్వరగా కాపుకు వచ్చి, మంచి దిగుబడి ఇవ్వటానికి లేత తోటలకు మరియు పెద్ద తోటలనుండి క్రమం తప్పకుండా దిగుబడులు పొందటానికి, సేంద్రియ ఎరువులు వాడటం ఎంతో అవసరం. నాటిన మొదటి సంవత్సరం నుండి జీడిమామిడి చెట్లకు నాణ్యమైన సేంద్రియ …
వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో వుండే తక్కువ తేమ కూరగాయలసాగుకు ప్రతిబంధకమవుతుంది. వీటిని అధిగమించి రైతులు వేసవిలో కూరగాయలను సాగుచేసి లాభాలు పొందాలంటే, వేసవికి అనువైన కూరగాయలను, వాటిలో అధిక వేడిని తట్టుకుని దిగుబడినిచ్చే ప్రత్యేక రకాలను ఎన్నుకోవాలి. వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి, పూత, పిందె …
భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రధానంగా రెండు రూపాల్లో వ్యక్తమవుతుంటుంది. ఒకటి – 5 సంవత్సరాల కొకసారి జరిగే ఎన్నికలు. రెండు – ప్రతి సంవత్సరం ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్. భారత ఎన్నికల వ్యవస్థ ఎలా రూపొందిందో, ఎంతగా దిగజారిందో మనం చూస్తున్నాం. ఓటింగ్ సరళి, ఓట్ల కోసం అనుసరిస్తున్న పద్ధతులు, ఎన్నికవుతున్న ప్రజా ప్రతినిధుల నైతికత, స్థాయి, …
జీవామృతం జీవామృతం తయారీకి అవసరమైన ముడి సరుకులు: ఆవు పేడ 10 కిలోలు ఆవు మూత్రం 10 లీటర్లు నల్ల బెల్లం 2 కిలోలు శనగ పిండి 2 కిలోలు ప్లాస్టిక్ డ్రమ్ము 200 లీటర్లది తయారు చేసే విధానం: పెద్దపాత్రలో 200 లీటర్ల నీరు తీసుకోవాలి. దానికి 10 కిలోల పేడ కలపాలి. కట్టెతో …
అక్టోబర్ చివరి వారంలో కురిసిన వర్షాల వలన బోరు బావులలో నీటి మట్టం పెరిగింది. చెరువులలో నీరు వచ్చి చేరింది. ఫలితంగా ఇంతకు ముందు సంవత్సరం కన్నా ‘రబీ’ పంటల సాగు ఆశాజనకంగా ఉంది. పత్తి మరియు కంది లాంటి దీర్ఘకాలిక పంటలు దాదాపుగా పూర్తి అయినవి. రాష్ట్రంలో రబీలో మొక్కజొన్న, మినుము, వేరుశనగ, సూర్యపువ్వు, …
