Skip to content

Uncategorized

వస

Srikanth Adira June 24, 2020 1 min read

వస

ఈ మొక్క మంచి సువాసన కల్గి ఉంటుంది. తేమ ప్రదేశాలలో పెరిగే బహువార్షికం. ఆకులు దళసరిగా, రెండు వరుసలతో అమరి వుంటాయి. నేలలో ఈ మొక్క దుంప ఉంటుంది. లేత పసుపు రంగు పుష్పాలు ఒక దొప్పలో అమరి ఉంటాయి. ఈ మొక్క గోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతాలలోనూ, ఉత్తర కోస్తా మండలంలోని గిరిజనులచే పెంచబడుతుంది.

వేరును ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఆకులు, వేర్లలో వున్న రసాయనాలకు కీటక నాశని లక్షణాలు వున్నాయని శాస్త్రపరిశోధనలో తేలింది. పురుగులను నియంత్రించడంలో ఈ రసాయనాలు ఎంతగానో వుపయోగ పడతాయి. అదే విధంగా శిలీంధ్ర నాశక గుణాలు కూడా వున్నాయని ఇటీవలి బారిక్‌ (2010) పరిశోధనలు నిరూపిస్తున్నాయి.

విత్తన నిల్వలో ఆశించే పురుగుల నియంత్రణలో 3 గ్రాముల వస చూర్ణాన్ని ఒక కిలో విత్తనానికి కలిపి వుంచడం ద్వారా సుమారు 3 నెలల వరకూ విత్తనాన్ని పురుగుల బారి నుంచి కాపాడుకోవచ్చు. ఈ పద్ధతి వుపయోగించి వరి ధాన్యాన్ని ఆశించే ముక్కు పురుగు, పప్పు ధాన్యాలు (కంది, పెసర, మినుము, శనగ మొ||) ఆశించే పుచ్చు పురుగుల నుండి విత్తనాన్ని రక్షించుకోవచ్చు.

వస దుంపల పొడికి వుండే ఘాటైన వాసనకు పురుగులు వికర్షించబడతాయని పరిశోధనలలో తేలింది.

పశువుల శరీరాన్ని ఆశించే గోమర్లు, పిడుగుల నిర్మూలనలో కూడా వసను వుపయోగించవచ్చునని ఇటీవల పరిశోధనలు సూచిస్తున్నాయి.

Questions and answers

Ask a question

Questions are checked by our team before they appear. Your email is not shown.