Skip to content

Uncategorized

వరిలో కాండం తొలుపు పురుగు

Srikanth Adira June 24, 2020 1 min read

వరిలో కాండం తొలుపు పురుగు

పురుగు ఆశించు కాలం: ఏప్రిల్‌ – అక్టోబర్‌

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పురుగు గుడ్లను, ఫ్యూపాలను నాశనం చేయడానికి పంట కోత పూర్తి కాగానే భూమిని దున్నుకోవాలి.
8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి.
నివారణ:

ట్రైకోడ్రామా బ్రెసిలియెన్సిస్‌, టెలినోమస్‌ ఫెలిఫెసిమెన్స్‌ కార్డులు వాణిజ్య పరంగా లభిస్తున్నాయి. ఇవి కాండంతొలుచు పురుగుల గుడ్ల సముదాయాన్ని నాశనం చేస్తాయి.
పెద్ద మగ పురుగులను ఫెరమోన్‌ ఎరలను ఉపయోగించి ఆకర్షించి ఎరలు పడేటట్లు చేయవచ్చు.
పసుపు దుంప కషాయాన్ని పిచికారీ చేయాలి.
పొలంలో రెక్కల పురుగులను కాని, పురుగు గుడ్లను కాని గమనించిన వెంటనే 5శాతం వేప కషాయాన్ని పిచికారి చేసి గుడ్లు పెట్టడాన్ని నివారించవచ్చు.

Questions and answers

Ask a question

Questions are checked by our team before they appear. Your email is not shown.