పంటల సమగ్ర సస్యరక్షణలో వృక్షసంబంధ రసాయనాల ద్వారా, తక్కువ ఖర్చుతో, సహజ వనరులను వినియోగించి, వాతావరణ కాలుష్యం లేకుండా, చీడపీడలను అదుపుచేయవచ్చును. అందుబాటులో ఉన్న వివిధ ఆచరణ సాధ్యమైన ఎన్‌పిఎం పద్ధతులను ఉపయోగించి, ప్రకృతి సమతుల్యాన్ని కాపాడే సహజ సస్యరక్షణ పద్ధతులను అవలంభించి, అవసరమైనపుడు వివిధ సస్యరక్షణ కషాయాలనుపయోగించి ఇప్పటికే రైతులు అనేక పంటలలో సత్పలితాలు పొందుతున్నారు. ఆచరణ యోగ్యమైన ఎన్‌పిఎం పద్ధతులను ప్రతి యేటా ఉపయోగిస్తూ, క్రమేణా ‘‘కషాయాల’’ వినియోగాన్ని కూడా క్రమబద్ధం చేసిన ‘రైతు అనుభవాలు’ ఖమ్మం జిల్లా, పాల్వంచ మండలం, పునుకుల గ్రామంలో కానవస్తున్నాయి. వివిధ పంటలలో ఉపయోగించే సస్యరక్షణ కషాయాల తయారీ మరియు వినియోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలను, సూచనలను ఈ క్రింది పేరాలలో వివరించటం జరిగింది. 

1. పొగాకు కషాయం :

2. పచ్చిమిర్చి – వెల్లుల్లి ద్రావణం :

3. పశువుల పేడ – మూత్రం ద్రావణం :

4. వావిలాకు కషాయం :

5. వేప కషాయం :

6. వేప నూనె :

     ఉ॥ పశువుల పేడ-మూత్రం ద్రావణం

కావున రైతాంగం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ, సహజవనరులను వినియోగించుకొంటూ, తద్వారా దిగుబడులు తగ్గకుండా, నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

పురుగులు:

ఆకుచుట్టు పురుగు:

కంది పెరిగే దశలో ఆకుచుట్టు పురుగు ఆశిస్తుంది. ఈ పురుగు ఆకులను చుట్టగా చుట్టుకుని ఆకులను తింటుంది. ఈ పురుగు ఉధృతి అక్టోబర్‌ – నవంబర్‌ మాసాలలో ఎక్కువగా ఉంటుంది.  నివారణ: 5 శాతం వేప కషాయం లేదా నీమాస్త్రం వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పంటపై పిచికారీ చేయాలి.

కాయ తొలుచు పురుగు: (శనగపచ్చ పురుగు)

నివారణ:

వరి చేనులో చేపల పెంపకం – ఆంధ్రప్రదేశ్ సేంద్రియ వ్యవసాయ విధానం నుండి….

ఒక ఎకరం పొలంలో 60 సెంట్లు వరి, 20 సెంట్లు చేపల చెరువు, 20 సెంట్లు గట్టుగా తయారు చేసుకోవాలి. తేమను ఎక్కువ కాలామ్ నిలువ వుంచే నల్ల రేగడి భూములలో ఇలా చేయుటకు అనుకూలం ఉదజని సూచిక 6.8 నుండి 7.8 మధ్య ఉండాలి. ఒక ఎకరం పొలంలో ముందుగా 20 సెంట్ల చేప చెరువును 2 మీటర్ల వెడ్పు, 1 మీటరు లోతు వుండేలా నాలుగు వైపులా తవ్వాలి. చెరువును దీర్ఘ చతురస్రాకారంలోగానీ, కుదరకపోతే చతురస్రాకారంలోగానీ తవ్వాలి. కానీ అడ్డదిడ్డంగా ఏ ఆకారం లేకుండా చెరువును త్రవ్వరాదు. త్రవ్వగా వచ్చిన మట్టిని గట్టుగా వేసుకోవాలి. గట్లు కూడా నాలుగువైపులా 2 మీటర్లు వెడెల్ప్ ఉండేలా చేయాలి. ఎకరం పొలం లో మధ్యలో 60 సెంట్లలో దమ్ము చేయించి వరిని నాటుకోవాలి. వరిచేలో వివిధ రకాలైన వ్యవసాయ పనులు చేసుకొనుటకు వరి పొలంలోకి వెళ్ళుటకు వెనుక భాగంలో దారి వదలాలి. నాట్లు వేసిన 20 రోజుల తరువాత 50 నుండి 100 గ్రాముల బరువు గల చేప ప్లిల్లలను చెరువులో వేయాలి. దీనికి చేపలలో రకాలైన శీలావతి 200, బొచ్చి 200, మోసు 200 వేసుకోవాలి. చేపల చెరువులో చేప మేత నిమిత్తం తౌడు, పశువుల పేడ, అజొల్లా చేపల చెరువులో వేసుకోవాలి. దీనివనల మొక్కకు నత్రజని అందుతుంది. అజొల్లా వాతావరణంలో వున్న నత్రజనిని గ్రహించి వరి మొక్కలకు అందిస్తుంది. 5 కిలోల తౌడు రోజు విడిచి రోజు చేపల చెరువుకి మొత్తం 1000 కిలోలు వేయాలి. పశువుల ఎరువు 200 కిలోలు వేయాలి. అజొల్లా చేపలకు మేతగా కూడా ఉపయోగపడుతుంది.

వరిలో కోత కోయుటకు 7 నుండి 10 రోజుల ముందు నీటిని తీసివేసి వరిపంట కోయాలి. చేపులు చెరువుల్లోనూ, వరి చేల్లోనూ తిరుగుతుంటాయి. చేపలు వరిచేలో తిరుగుతూంటే వరిచేలో నష్టపరిచే పురుగులను తిని రైతుకు మేలు చేస్తాయి. వరి కోత సమయంలో నీటిని తీసివేసినప్పుడు చేపలు చెరువులోకి వెళ్లిపోతాయి. వరి పంటలో కంకి చిన్నగా ఉన్నా గింజ పూర్తిగా తోడుకొని నాణ్యమైన పంట వస్తుంది.

గట్లమీద వివిధ రకాల మిశ్రమ పంటల సాగు:

చెరువుల చుట్టూ 2 మీటర్ల వెడెల్ప్ గట్టు వుంటుంది. కాబట్టి ఈ గట్టమీద వివిధ రకాల మిశ్రమ పంటలు సాగుచేసి ఎక్కువ లాభం గడిరచవచ్చు. ఈ గట్లపై పలు రకాల కూరగాయల మొక్కలు, ఆకుకూర మొక్కలు, పండ్ల మొక్కలు పెంచుకోవచ్చు. గట్లపై కూర, అరటి, బొప్పాయి, మునగ తదితర మొక్కలు, ఆకుకూరలు, బీర, అనప, వంగ, బెండ, ఆకుకూరలు వేసుకోవచ్చు. తీగజాతి కూరగాయాలలో పందిరి వేసుకుంటే మంచిది. గట్లమీద వున్న కొబ్బరిచెట్ల ద్వారా కూడా రైతులకు ఆదాయం వస్తుంది. గట్లమీద ఎరపంటలైన బంతి, ఇతర పూల మొక్కలు పెంచుకోవచ్చు. గట్లమీద వానపాముల వర్మిబెడ్‌నుగానీ, లేదా నాడెప్‌ కంపోస్ట్‌ను గానీ పెట్టుకుంటే రైతు సొంతంగా ఎరువు తయారు చేసుకోవచ్చు. వరిచేలో, చేపల చెరువులో గట్లమీదున్న వివిధ రకాల మొక్కలకు వర్మి కంపోస్ట్‌ను, నాడెప్‌ కంపోస్ట్‌ను వేసుకోవచ్చు. ఈ నాడెప్‌ కంపోస్ట్‌ను, వర్మి కంపోస్ట్‌ను కిలో 3 నుంచి 5 రూపాయ వరకు ఇతర రైతులకు విక్రయించుకొని లాభం పొందవచ్చు. తద్వారా ఖర్చు తగ్గుతుంది. గట్లమీద వేసిన అరటి గెల ఒక్కింటికి రూ. 200 చొప్పున రూ. 30 వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. గట్లమీద వేసి కూరగాయల, ఆకుకూరలు, పూల మొక్కల ద్వారా వేసిన 30 రోజుల నుండి ఆదాయం వస్తుంది. కరివేపాకు కూడా వేస్తే మంచి లాభమ్ వస్తాయి. గట్లమీద రోజూ ఉపయోగించే పాలకూర, తోటకూర, గోంగూర, చుక్కకూర, బచ్చలికూర, కొత్తిమీర, మిరప పంటు సాగు చేయవచ్చు.

గట్లపై కోళ్ళు, పశువులు :

గట్లమీద వివిధ రకాల పంటలతో పాటు కోళ్ళు, మేకలు, గొర్రొలు, బాతులు, పశువులను కూడా పెంచి ఆదాయం పొందవచ్చు. తేనెటీగల పెంపకం ద్వారా పరపరాగ సంపర్కం జరిగి దిగుబడి పెరుగుతుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పురుగు మందులు వాడకం ఇతర కారణావల్ల తేనెటీగల సంతతి తగ్గిపోయింది. కావున గట్లమీద తేనెటీగల పెంపకం లాభదాయకం, గట్లపై కలపనిచ్చే మొక్కులు టేకు, యూకలిప్టస్‌ కూడా పెంచవచ్చు. నీడ వున్నచోట పసుపు, అల్లం , అనాస పంటలను సాగు చేయవచ్చు. గట్టుమీద నుండి చేపల చెరువు మీదుగా కోళ్ళు, బాతులు నివాసముండేలాగ షెడ్యును కట్టి వాటి పెంట చెరువులో పడేలా చేయాలి. తద్వారా చేపలకు మంచి ఆహారం దొరికి బరువు పెరుగుతుంది. ఈ ప్రదర్శనలో 20 బాతులు, 20 కోళ్ళు పెంచి ఆదాయం పొందవచ్చు. గట్టుపై ఒక గేదెనుగానీ, ఆవునుగానీ పెంచుకోవచ్చు. వచ్చే పేడ వర్మి కంపోస్ట్‌ తయారీకి ఉపయోగపడుతుంది. అలాగే జీవామృతం ఘన జీవామృతరు కూడా చేసుకోవచ్చు.

చెరువులో వరిసాగు, ఖరీఫ్‌లో జులై నెలో, రబీలో డిసెంబర్‌ నెలో నాట్లు అయిపోవాలి. ఆస్యంగా నాట్లు వేస్తే కాండం తొుచు పురుగు (మొవ్వు పురుగు) ఎక్కువగా ఆశించే అవకాశముంది.

చెరువులో వరి సాగు చేయునపుడు వెడజ్లుట, లేదా డ్రమ్‌ సీడర్‌తో నాటు వేస్తే 60 సెంట్లకు గాను రూ. 2400 ఆదా చేయవచ్చు. నారుమడి, నాట్లు ఖర్చు ఆదా అవుతుంది.

చేప చెరువులో ఎక్కువ డిమాండ్‌ వున్న కొర్రమీను కూడా వేయవచ్చు. ఈ వరిలో చేప పెంపకం కాువ ద్వారా నీటి పారుద సౌకర్యం వున్న రైతుకు అనుకూం. మెట్లప్రాంత రైతుకు, బోర్ల కింద సాగు చేసేవారికి అనుకూం కాదు.

2వ సంవత్సరం నుండి ఆదాయం పెరుగుతూ వస్తుంది. కావున రైతు మూడు సంవత్సరాు వరుసగా చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రైతు చేతికి నిరంతరం ఏదో ఒక ఆదాయం వస్తుంది. కొత్తగా చేసే రైతుకు ఎకరం నుండి రెండున్నర ఎకరాకు అనుకూం. ఒక చిన్న కుటుంబం ఈ వరిలో చేప పెంపకం అము చేసి ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చు.

నత్రజని ఎరువుకు ప్రత్యామ్నాయంగా అజొల్లా వాడకం వన తెగుళ్ళు, పురగు ూధృతి తగ్గుతుంది.

ఖరీఫ్‌లో వరి రకాు: ముంపును తట్టుకొని దిగుబడినిచ్చే పి.ఎల్‌.ఎ.1100 (బాడ్వా మసూరి), స్వర్ణ సబ్‌1 రకాు మంచి ఫలితానిస్తాయి.

సస్యరక్షణ:

15 రోజుకొకసారి 3 సార్లు రబీలో 60 సెంట్లకు 600 మీ.లీటర్ల వేపనూనె పిచికారీ చేయాలి.

సూడోమోనస్‌ ఫ్లోరొసెన్స్‌ బాక్టీరియా 60 సెంట్లకు 300 గ్రాముల చొప్పున 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయడం వలన పాముపొడ తెగులు, ఇతర తెగుళ్ళు అదుపులో ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ సేంద్రియ వ్యవసాయ విధానం నుండి….

టమాట సాగు

టమాటలో విటమిన్లు ఎ, సి, లతో పాటు ఖనిజ లవణాలు మరియు ముఖ్యంగా కేన్సర్‌ను నిరోధించే లైకోపీన్‌ అనే కారకములు ఉంటాయి. టమాటను సంవత్సరం పొడవునా సాగుచేసుకోవచ్చు.ఐతే రైతులు అధిక ఉత్పత్తి కోసం రసాయనిక ఎరువులు విచ్చాలవిడిగా వాడటం సస్యరక్షణ మందులు విచక్షణ రహితంగాఉపయోగించడం వలన టమాట నాణ్యత, నిల్వ వుండే గుణం దేబ్బతినటమే కాకుండా ఆ రసాయనాల అవశేషాలతో నేల, నీరు, గాలి, ఆహారం కలుషితమై మనిషి ఆరోగ్యం మీదా పర్యావరణం పైనా అనేక తీవ్ర ప్రభావాలు చూపుతున్నాయి. దీనికి తోడు సాగు ఖర్చు ఎక్కువై రైతు పూర్తిగా నష్టపోతున్నారు. కాబట్టి టమాటను సేంద్రియ పద్దతిలో సాగుచేసుకోవాలి.

సాగు వివరాలు – రకాల ఎంపిక

ఈ కాలానికి అనువైన రకాలను ఎంపిక చేసుకోవాలి. వర్షాధారం సాగుకు నీటి ఎద్దడిని తట్టుకొనే రకాలను ఎంపిక చేసుకోవాలి.

పూసా ఎర్లీ ద్వార్ఫ్‌, ఆర్కా సౌరభ్‌, ఆర్కా మేఘాలి, ఆర్కా వికాస్‌, ఆర్కా ఆభా, ఆర్కా అభిజిత్‌, ఆర్కాఆహుతి, ఆర్కా అలౌకిక్‌ మొదలైన రకాలను సాగు చేసుకోవచ్చు.

అనువైన నేలలు:

టమాటను అన్ని రకాల నేలల్లో సాగు చేసినప్పటికీ మురుగు నీరు పోయే వసతి కలిగిన ఎర్ర గరప నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. నీరు నిబడే నేలల్లో టమాటను సాగు చేయకూడదు.నేల ఉదజని సూచిక 6.5 నుండి 7 మద్య ఉంటే మంచిది.

విత్తన మోతాదు:

ఎకరానికి 150-200 గ్రాలము విత్తనం కావాలి. టమాటను ముందుగా నారు పెంచి తర్వాత ప్రధాన పొలంలో నాటుకొంటే అధిక దిగుబడిని యిస్తుంది.

విత్తన ఎంపిక మరియ నారుమడి యాజమాన్యంలో జాగ్రత్తలు

రైతు సాధ్యమైనంతవరకు తమ పంటనుండే విత్తనాన్ని సేకరించుకోవాలి. తప్పని పరిస్థితుల్లో గుర్తింపు పొందిన నమ్మకమైన సంస్థల నుండి తెచ్చుకోవాలి.

విత్తే ముందు కిలో విత్తనానికి 10 గ్రాముల భీజ రక్షతో శుద్ధి చేసి ఒక గంట నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. అలాగే ట్రైకోడెర్మా విరిడి 5 గ్రాముల కిలోకి చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.

భీజరక్ష తయారీ విధానం:

పుట్ట మన్ను 100 గ్రాములు మెత్తని పొడిగా చేసి దానికి 100 గ్రా. కట్టె లేదా పిడక బూడిద,20 గ్రా. పొడి ఇంగువ, 20 గ్రా. పసుపు పొడి కలపాలి. ఈ మిశ్రమానికి 10 మిల్లీ. లీ.ఆవు మూత్రంను కొంచెం కొంచెం వేస్తూ కర్ర సహాయంతో బాగా కలపాలి. ఆతర్వాత నీడలో ఆరబెట్టి పొడిచేసుకొని గాలి చొరబడని సీసాల్లో భద్రపరుచుకోవాలి. ఇది 6 నెలలు వరకు నిల్వ ఉంటుంది. తడి తగలకుండా పొడి ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి.

నారుమడి వేసే స్థలాన్ని ప్రతి సంవత్సరం మార్చాలి.

నారు మడికోసం ఎంపిక చేసిన నేలను 3-4 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో 10 చ. మీ. నారుమడికి 10 గంపు చొప్పున మాగిన పశువుల ఎరువుతోపాటు 1 కిలో వేప పిండి వేయాలి.

నారు మడులను కనీసం 15 సెం. మీ. ఎత్తులో తయారు చేసుకొంటే నారుకుళ్ళు రోగాన్ని నివారించవచ్చు. నారుమడిని 4 మీ. పొడవు, 1 మీ. వెడ్పల్పుతో చేసుకొంటే కలుపు తీసుకోవటానికి, చీడపీడ నివారణ చర్యలు చేపట్టడానికి అనువుగా ఉంటుంది.

విత్తనా శుద్ధి చేసిన విత్తనాన్ని ఎత్తైన నారుమడులో వరుసల్లో పులుచగా విత్తుకొని వరిగడ్డితో కప్పాలి. ఇలా చేయటం వలన నీరు పెట్టినపుడు విత్తనం చెదిరి పోకుండా ఉంటుంది.

ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం నారుమడిని రోజ్‌ తడపాలి. నారుమడిలో.మొక్కల పెరుగుదకు కొంతమంది రైతులు యూరియా వేస్తుంటారు. అలా చేస్తేమొక్కలలో నార శాతం తగ్గి రసం పీల్చీ పురుగులు ఆశించటానికి అనువుగా ఉంటుంది. కాబట్టి నారుమడిలో యూరియా కానీ లేదా ఇతర రసాయనిక ఎరువులను కానీవేయకూడదు.

నారుమడిలో నులి పురుగుల బారి నుండి కాపాడటానికి వేపపిండి, ఆముదం పిండి లేదా కానుగ పిండి వంటివి నేలలో వేసుకోవాలి. అలాగే వేపనూనె, వేపగింజ కషాయం పిచికారి చేసి రసం పీల్చే పురుగులను అరికట్టాలి.

నారుమడిలో వచ్చే తెగుళ్ళను పశువుల పేడ మరియు మూత్రంతో తాయారు చేసిన ద్రావణాన్ని పిచికారి చేసి నివారించుకోవాలి. నారుమొక్కలను ప్రధాన పొలంలో నాటడానికిగాను నారు పీకడానికి 7 నుంచి 10 రోజుల ముందు నుండి క్రమేపి నీటి తడులను తగ్గించాలి. ఇలా చేయటం వలన నాటిన తర్వాత పొలంలో నీటి ఎద్డడిని తట్టుకొంటాయి.

పొలంలో నాటేముందు నారు వేళ్ళను 20 గ్రా. ఇంగువ 1 లీ. నీటికి కలిపిన ద్రావణంలో 15 % నుండి % 20 వరకు ముంచి నాటుకొంటే తెగుళ్ళను తట్టుకోనేశక్తి పెరిగి మొక్కలు ఏపుగా పెరగడానికి వృద్ధి కారకంగా పనిచేస్తుంది.

సుమారు 25 నుండి 30 రోజుల వయసున్న నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి.

ప్రధాన పొలంలో నాటుకొనే పద్ధతి:

నారును నాటుకొనే ముందు పొలాన్ని బాగాదున్ని చదును చేసి 65 సెం.మీ. దూరంతో బోదెలను తయారు చేసుకోవాలి. బోదేలకు ఒక వైపు నారును 45 సెం. మీ. దూరంతో నాటుకోవాలి. నాటిన 25 రోజుల తర్వాత బోదెలపై మట్టిని ఎగద్రోసి మొక్క బోదె మధ్యలో ఉండేటట్లు చేయాలి.

టమాట సాగులో సేంద్రియ ఎరువుల వాడకం:

రసాయనక ఎరువుకు బదులుగా పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్‌, వేరుశనగ పిండి ఆముదం పిండి, కానుగ పిండి, వేపపిండి వంటి వాటిని విరివిగా వాడాలి. పంట మార్పిడి పంటగా లేగ్యూం జాతి పంటలను వేసుకొని నత్రజనిని అందించాలి. పచ్చిరొట్ట, జీవన ఎరువులైన అజిటోబాక్టర్‌, అజోస్పైర్లిలం వాటిని వేసుకొంటే నేలలో ఉపయోగపడే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి మొక్కలకు కావసిన పోషకాలను అందజేస్తాయి.

కలుపు నివారణ: కలుపును నివారించటానికి మొక్క చుట్టూ మరియు చాళ్లమధ్యలో పోలీతీన్‌ లేదా ఎండుగడ్డి, రంపపు పొట్టు మొదలైన వాటిని మల్చింగ్‌ గా వేసుకోవాలి.

మొక్క పెరిగే దశలో కర్రతో ఊతమిస్తే మొక్క నేల మీద పడిపోకుండా కాయలు పాడవకుండా ఉంటాయి.

నీటి యాజమాన్యం:

నాటడానికి ముందు, నాటిన తర్వాత మరల 3 వ రోజు నీరు పెట్టాలి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి. మొక్కలు పెరగడానికి తగినంత నీరు పెట్టి పొలంలో నీరు నిలబడకుండా చూసుకోవాలి. పూత, కాత దశలో నీటి ఎద్దడికి గురికాకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే పూత రాలి దిగుబడి తగ్గుతుంది. నీటి వసతి తక్కువ ఉంటే డ్రిప్‌ పద్ధతిలో సాగు చేసుకోవాలి.

సస్యరక్షణ పద్ధతులు

పురుగు, తెగుళ్ళు ఆశించిన తర్వాత అదుపు చేయడం కాకుండా అవి ఆశించకుండా ఉండేటట్లు యాజమాన్య పద్ధతులు చేపట్టాలి.

వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి.

పంట పూర్తికాగానే మొదళ్ళు నాశనం చేయాలి.

ఒకే పంటను సంవత్సరాల తరబడి అదే పొలంలో సాగు చేయకుండా లేగ్యుం జాతి పంటతో పంట మార్పిడి చేసుకోవాలి. దీనివలన పురుగు ఉద్రుతిని అదుపులో వుంచటమే కాకుండా భూసారాన్ని కూడా కాపాడవచ్చు.

బంతిని పంటను ఎరపంటగా పొలంలో అక్కడక్కడ 1-2 వరుసలో, పొలం చుట్టూ ఒక వరుసలు వేసుకోవాలి. ఈ ఎరపంటపై గుడ్ల సముదాయం, పిల్ల పురుగు కన్పించిన వెంటనే ఏరి నాశనం చేయాలి.

పొలం చుట్టూ జొన్న, మొక్కజొన్న వంటి ఎత్తయిన పంటలను వేసుకొంటే తెల్ల దోమ, తామర పురుగు వంటి రసం పీల్చే పురుగులకు కంచెలాగా పనిచేస్తాయి.

గత సంవత్సరాల అనుభవాలాను బట్టి ఆయా పంటలను ఆశించే పురుగుల ఉధృతి ఏ సమయంలో ఎక్కువుగా ఉంటుందో గమనించి విత్తే కాలాన్ని సరిచేయటం ద్వారా పంటలను పురుగు బారినుండి కాపాడవచ్చు. చీడపీడలను తట్టుకోనే రకాలను సాగు చేసుకోవాలి.

పొలంలో అక్కడక్కడ దీపపు ఎరలను వాడి రెక్క పురుగులను నాశనం చేయాలి.

ఎకరాకు 4-5 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు సంతతిని నిరోధించాలి.

ఆముదం పూసిన పసుపు మరియు పసుపు రంగు డబ్బాను అమర్చి తెల్ల దోమ, తామరపురుగు ఉధృతిని నివారించాలి.

పక్షులు వాలి పురుగులను తినటానికి వీలుగా పక్షి స్థావరాలను పొలంలో అక్కడక్కడ ఏర్పాటు చేయాలి.

మొక్క ఆకులపై కనిపించిన గుడ్ల సముదాయాన్ని, గొంగళి పురుగులను కనపడిన వెంటనే ఏరి నాశనం చేయాలి.

పురుగు ఉధృతి తీవ్రంగా వున్నపుడు వేపనూనె, వేపగింజ కషాయం, వావిలకు కషాయం, వెల్లుల్లి-పచ్చిమిర్చి ద్రావణం వంటి ప్రకృతి సహజమైనవాటిని వాడి పురుగులను నివారించాలి.

తెగుళ్ళ నివారణకు పుల్లని మజ్జిగ ద్రావణం, పశువుల పేడ-మూత్రం ద్రావణం, ఇంగువ ద్రావణం మొదలైన వాటిని వుపయోగించాలి.

కోత మరియు దిగుబడి

టమాట నాటిన 45 రోజులకు పూతకు వచ్చి 20 -25 రోజులకు మొదటి కోతకు వస్తుంది. ప్రతీ 4-5 రోజులకు ఒక సారి కోస్తుండాలి. పంట కాల పరిమితి రకాన్ని బట్టి 4 నుండి 5 నెలలు వుంటుంది. సరైనసాగు పద్ధతులు పాటిస్తే ఎకరానికి దాదాపు 8 నుండి 10 టన్నుల దిగుబడిని పొందవచ్చు.