తల్లి పురుగు : ముదురు గోధుమ రంగులో ఉండి నల్లని మచ్చలు కలిగి వుంటాయి. వేేగంగా ఎగురుతాయి.

గుడ్లు : లేత పసుపు రంగు గుడ్లను ఒక్కొక్కటిగా ఆకు తొడిమలపైన పూత పిందెల పైన 100కి పైగా పెడతాయి. 

లార్వా : లేత పసుపురంగులో ఉండే పిల్ల పురుగులు పెద్దవై గులాబి రంగులోకి మారతాయి. తల ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. 

కోశస్థదశ : పత్తి కాయలలో లేదా నేలలో నిద్రావస్థలో ఉంటుంది. 

నష్టం : పిల్ల పురుగు పుప్పొడి, పూలు తొలచి తినడం వల్ల గుడ్డి పూలుగా మారతాయి. కాయలలోనికి తొలచి గింజలు తిని పత్తి నాశనం చేయడం వలన సగం పగిలిన గుడ్డి కాయలు ఏర్పడతాయి. ఇది బెండ పంటలో కాయలను నాశనం చేస్తుంది. 

గులాబి రంగు పురుగు ఉధృతికి కారణాలు

  1. రైతాంగం ఎక్కువ కాల పరిమితి కలిగిన అమెరికన్‌ పత్తి సంకర జాతి రకాల మోజులో పడి దేశావాళి రకాలను సాగు చేయడం మానివేయడం
  2. కొన్ని రకాలను వాటి కాల పరిమితిని మించి సాగు చేస్తూ వుండడం, సేంద్రియ ఎరువులను వదిలి రసాయన ఎరువులను ముఖ్యంగా నత్రజని ఎరువులను ఎక్కువగా వేయడం
  3. కార్మి పత్తిని వేయడం, పత్తి పైరును సంవత్సరాల పాటు ఒకే పొలంలో సాగు చేయడం, పత్తి మోళ్ళను తీయకుండా చేనులోనే వుంచడం, పత్తి మోళ్ళను చాలా కాలం వంట చెరుకుగా వాడడం, తదితర కారణాల వలన కొన్ని సంవత్సరాల నుంచి గులాబి రంగు పురుగు ఉదృతి పెరుగుతూ పత్తిలో దిగుబడులు తగ్గుతున్నాయి.

నివారణ :