పత్తి పంటలో జాగ్రత్తలు:

ఈ సంవత్సరం పత్తి పంటలో తుపాను ప్రభావం వల్ల పత్తి తీయడం ఆలస్యం అయింది. ప్రస్తుతం పత్తి అన్ని ప్రాంతాలలో చివరిదశలో ఉంది. సాధారణంగా చివరిలో తీసే పత్తి కొంచెం నాసిరకంగా వుండొచ్చు. తేమగా వున్న పత్తిని తీయకూడదు. పత్తి తీసిన తరువాత నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టినట్లైతే రంగుమారి నాణ్యత తగ్గుతుంది. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా కొద్ది కాలం నిల్వ ఉంచుకొని అమ్ముకుంటే మంచి ధర వస్తుంది.

వరి

ఈ మధ్య తెలంగాణా జిల్లాలలో రాత్రి ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయింది. దీని ప్రభావం నారు దిగుబడులపై ఉంటుంది. చలి నుండి నారు మడిని రక్షించడానికి రాత్రిళ్ళు పాలిథీన్ షీట్లతో నారుమడిని కప్పి, ఉదయం తీసివేయాలి.

నీటి యాజమాన్యం:

కంది:

ప్రస్తుత సమయంలో పూత- కాయ దశలో ఉంది. శనగపచ్చ పురుగు రాత్రి పూట పూ మొగ్గలమీద, కాయల మీద విడివిడిగా ఒక్కొక్క గుడ్డు పెడుతుంది. గుడ్డు నుండి వచ్చిన పిల్ల పురుగులు ఆకుపచ్చ రంగులో ఉండి పూతను గోకి తినేస్తాయి. తరువాత కాయలను కూడా ఆశిస్తాయి. ఒకే పురుగు చాలా కాయలకు నష్టం కలిగిస్తుంది.

నివారణ:

మిరప:

ప్రస్తుతం ఆకుముడత ఆశించడానికి వాతావరణం అనుకూలంగా ఉంది. తామర పురుగులు ఆకు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకు అంచులు పైకి ముడుచు కుంటాయి. ఆకులు, పిందె రాగి రంగులోకి మారి పూత పిందె ఎదుగుదల నిలిచిపోతుంది.

నివారణ

కాకర, బీర, మరియు పొట్లలో పండు ఈగ నియంత్రణ కొరకు

కాకర, బీర, పొట్ల కాయలను ”ఈగ” నష్టపరుస్తుంది. ఈగ ఆశించిన కాయలు వంకర తిరిగి, ఈగ ఆశించిన చోట నొక్కు ఏర్పడి తరువాత కాయలు కుళ్ళిపోతాయి. ఈగ తాకిడి వలన నష్టం వాటిల్లిన కూరగాయలను తెంపక అలాగేఉంచడం వల్ల పండు ఈగ సమస్య ఇంకా జటిలం అవుతుంది. ఈగ నివారణ కొరకు లింగాకర్షణ ఎరను ఉపయోగించవచ్చు.

ఉపయోగించే విధానం: