ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024లో రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ‘అన్నదాత సుఖీభవ పథకం’ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ప్రధానంగా రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించడం, రైతుల పెట్టుబడి ఖర్చులను తగ్గించడం, పంటల విక్రయానికి సులభతరం చేసే విధానాలు అమలు చేయడం ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడికి కావలసిన మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది.

Annadata SukhibhavaAnnadata Sukhibhava Scheme Details 2024

పథకం లక్ష్యాలు:

  1. రైతుల ఆర్థిక భద్రతను మెరుగుపరచడం.
  2. రైతులు నష్టపోకుండా, పంటల వేసవాటికి అవసరమైన పెట్టుబడి సాయం అందించడం.
  3. వ్యవసాయ ఉత్పత్తులను మెరుగుపరచి, దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ శక్తి పెంచడం.
  4. రైతుల రుణభారాన్ని తగ్గించడం.
  5. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వ భాగస్వామ్యాన్ని పెంచడం.

అర్హత:

  1. రైతుల సంఖ్యా నమోదు: అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత పొందడానికి, రైతులు 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులు ఉండాలి.
  2. భూమి వివరాలు: ఈ పథకం కింద రైతులకు వారి భూమి వివరాల ఆధారంగా ఆర్థిక సాయం అందించబడుతుంది. భూమి వివరాలను రైతు భవిష్యత్ ఆధారంగా నమోదు చేయాలి.
  3. ఆధార్ లింక్: పథకంలో పొందిన సాయం నేరుగా బ్యాంకు ఖాతాలలో జమ అవుతుంది కాబట్టి, రైతులు తమ ఆధార్ కార్డు నంబరును బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవాలి.

అనుసరణా విధానం:

  1. సాయం మొత్తం: ప్రతి రైతు కుటుంబానికి రూ. 20,000 వరకు ఆర్థిక సాయం అందజేస్తారు.
  2. నేరుగా బ్యాంకు జమ: రైతులకు ఈ సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ మొత్తం రెండు విడతలుగా విడుదల చేయబడుతుంది.
  3. పంటల జాబితా: రైతులు ఆర్ధిక సాయాన్ని సాధించడానికి అర్హత పొందిన పంటల జాబితాను ప్రభుత్వం విడుదల చేస్తుంది.
Annadata Sukhibhava Scheme Details 2024

అన్నదాత సుఖీభవ పథకం అమలు విధానం:

  1. గ్రామ సచివాలయాలు: గ్రామ సచివాలయాల్లో ఈ పథకం కింద రైతుల వివరాలు నమోదు చేసుకోవచ్చు. పంట పండించే రైతులు, పట్టా రైతులు ఈ పథకానికి అర్హులు.
  2. విచారణ మరియు నిర్ధారణ: రైతులు నమోదు చేసుకున్న వివరాలను అధికారులు పరిశీలిస్తారు, భూమి యొక్క చట్టపరమైన డాక్యుమెంట్లను నిర్ధారిస్తారు.
  3. అకౌంట్ జమ: ఒకసారి నమోదు పూర్తి అయితే, రైతుల ఖాతాల్లో నేరుగా సాయం డబ్బు జమ అవుతుంది.

పథకానికి సంబంధించిన ముఖ్య విషయాలు:

  1. రైతు కుటుంబాలకు ఆర్థిక రక్షణ: ఈ పథకం కింద ప్రభుత్వం రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయంగా ఆర్థిక సాయం అందిస్తుంది.
  2. ఆధార్ అనుసంధానం: సాయం అందుకోవాలంటే రైతు యొక్క ఆధార్ మరియు బ్యాంకు ఖాతా తప్పనిసరిగా అనుసంధానించాలి.
  3. సాంకేతిక పర్యవేక్షణ: పథకానికి సంబంధించిన సమాచారం మరియు డబ్బు జమ పరిస్థితిని రైతులు ఆన్లైన్లో చూడవచ్చు.

పథకంలో చేర్చిన మరిన్ని సదుపాయాలు:

  1. ఇన్సూరెన్స్ సదుపాయం: రైతుల భవిష్యత్ భద్రత కోసం ఈ పథకం కింద రైతులకోసం ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉంది. పంటలు నష్టపోతే, ఆ నష్టానికి గాను రైతులకు రక్షణ ఇన్సూరెన్స్ ద్వారా అందించబడుతుంది.
  2. టెక్నాలజీ ఆధారంగా సేవలు: స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా రైతులకు సకాలంలో సమాచారాన్ని అందించడం, ఆన్‌లైన్ ద్వారా సాయం అనుసరించటం.

పథకంలో తీసుకోవలసిన చర్యలు:

  1. పథకం వివరాలను తెలుసుకోవడం: రైతులు తమ పాఠశాలలు లేదా గ్రామ సచివాలయాలలోని అధికారుల ద్వారా పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలి.
  2. నమోదు ప్రక్రియ: రైతులు తమ ఆధార్ మరియు భూమి వివరాలతో గ్రామ సచివాలయాలను సంప్రదించాలి.
  3. సాయం పొందడం: పథకంలో అర్హత పొందిన రైతులు వారి ఖాతాలో డబ్బు జమ విషయాన్ని సాంకేతికత ద్వారా నిర్ధారించుకోవచ్చు.

ప్రభుత్వం తీసుకున్న మరిన్ని చర్యలు:

  1. కనీస మద్దతు ధర: ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధరను ఇచ్చే విధానాన్ని కూడా అమలు చేస్తోంది.
  2. పంటల బీమా పథకం: రైతుల భద్రత కోసం పంటల బీమా పథకం ద్వారా పంట నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంది.
  3. ఇతర సహాయాలు: ప్రభుత్వం రైతులకు బీమా, బీమా సబ్సిడీలు, రుణ మాఫీ వంటి అదనపు సదుపాయాలను అందిస్తోంది.

Annadata Sukhibhava Scheme Details 2024Annadata Sukhibhava

ఫలితాలు మరియు లబ్ధి:

  1. రైతుల ఆర్థిక భద్రత: ఈ పథకం ద్వారా రైతులు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించగలరు.
  2. ఉత్పత్తి పెంపుదల: పెట్టుబడి ఖర్చులను తగ్గించడం వల్ల రైతుల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.
  3. పంటల నాణ్యత: వ్యవసాయ రంగం నాణ్యమైన పంటలను ఉత్పత్తి చేయడం వల్ల దేశీయంగా మరియు అంతర్జాతీయంగా పోటీ సామర్థ్యం పెరుగుతుంది.

సాంకేతిక పరిజ్ఞానం:


అన్నదాత సుఖీభవ పథకం సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రధానంగా ఆధారపడి పని చేస్తుంది. రైతులు తమ పేరు నమోదు చేసిన తర్వాత, సకాలంలో సాయం పొందడాన్ని ప్రభుత్వం నిఘా చేస్తుంది. ఈ పథకంలో ఎలాంటి అవినీతి, సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం కోసం, ప్రతి దశలో డిజిటల్ పర్యవేక్షణ ఉంటుంది.

మొత్తం వివరణ:
ఈ పథకం కింద రైతులు ప్రతి ఏడాది కనీసం రూ. 20,000 వరకు పెట్టుబడికి కావలసిన సాయం పొందవచ్చు.

పంటల సమగ్ర సస్యరక్షణలో వృక్షసంబంధ రసాయనాల ద్వారా, తక్కువ ఖర్చుతో, సహజ వనరులను వినియోగించి, వాతావరణ కాలుష్యం లేకుండా, చీడపీడలను అదుపుచేయవచ్చును. అందుబాటులో ఉన్న వివిధ ఆచరణ సాధ్యమైన ఎన్‌పిఎం పద్ధతులను ఉపయోగించి, ప్రకృతి సమతుల్యాన్ని కాపాడే సహజ సస్యరక్షణ పద్ధతులను అవలంభించి, అవసరమైనపుడు వివిధ సస్యరక్షణ కషాయాలనుపయోగించి ఇప్పటికే రైతులు అనేక పంటలలో సత్పలితాలు పొందుతున్నారు. ఆచరణ యోగ్యమైన ఎన్‌పిఎం పద్ధతులను ప్రతి యేటా ఉపయోగిస్తూ, క్రమేణా ‘‘కషాయాల’’ వినియోగాన్ని కూడా క్రమబద్ధం చేసిన ‘రైతు అనుభవాలు’ ఖమ్మం జిల్లా, పాల్వంచ మండలం, పునుకుల గ్రామంలో కానవస్తున్నాయి. వివిధ పంటలలో ఉపయోగించే సస్యరక్షణ కషాయాల తయారీ మరియు వినియోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలను, సూచనలను ఈ క్రింది పేరాలలో వివరించటం జరిగింది. 

1. పొగాకు కషాయం :

2. పచ్చిమిర్చి – వెల్లుల్లి ద్రావణం :

3. పశువుల పేడ – మూత్రం ద్రావణం :

4. వావిలాకు కషాయం :

5. వేప కషాయం :

6. వేప నూనె :

     ఉ॥ పశువుల పేడ-మూత్రం ద్రావణం

కావున రైతాంగం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ, సహజవనరులను వినియోగించుకొంటూ, తద్వారా దిగుబడులు తగ్గకుండా, నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రపంచం మీద డైబ్బై శాతం నీరే వుండి అందులో ఒక్క శాతం మాత్రమే మంచినీరుగా వుపయోగపడుతున్నపుడు దాన్ని ధ్వంసం చేసుకున్న జాతిని ఏమనాలి అసలు. మన కుంటలు, వాగులు, వంకలు, వర్రెలు, బావులు, చెరువులు, నదులు ఒక్కొక్కటిగా ఎట్లా ధ్వంసమైపోయాయి. జీవనదులు జీవం లేకుండా ఇసుక పర్రెలుగా ఎందుకు మిగిలిపోయాయి. వానాకాలంలో నీరు వరదలై పొంగుతుంటే కాపాడుకోవడానికి నగరంలో నిజాం కాలంలో హైదరాబాద్‌ నగరంలో 3000 పైగా వున్న చిన్న పెద్ద కుంటలు ఒక్కటి కూడా ఆచూకీ లేకుండా, అందులో అక్రమ నిర్మాణాలు ఎలా వెలిసాయి? పై నుంచి పడ్డ నీరు నిలిచ్చే చోటు దొరకక సముద్రం పాలవుతుంటే, వున్న కొద్ది భూగర్భ జలాలూ అడుగంటుతున్న దుస్థితి. 

మనం చేసిన పాప ఫలితమే కదా ఇదంతా… లేకపోతే ఏమిటి…?

ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 780 మిలియన్ల ప్రజలు స్వచ్ఛమైన నీటికోసం అల్లాడిపోతున్నారు. ఆఫ్రికాలో ఓ తెగ ప్రజలు మంచినీళ్లు దొరకక, వేకువజామునే కిలోమీటర్ల కొద్దీ నడిచి అడవుల్లో ఆకుల మీద కారుతున్న మంచు బిందువులను ఒక్కొక్కటిగా సేకరించి మంచినీరుగా వాడుకుంటారట. ఒకనాడు నదులు పొంగిన జీవగడ్డ భారతావని కూడా ఇవాళ మంచినీటి చుక్క కోసం విలవిలలాడిపోతోంది. అటు చూస్తే ఏళ్ల తరబడి నీటి జాడ కనబడక అనంతపురం జిల్లా ఎడారి దారి పట్టింది. చిత్తూరు జిల్లాలో శిలాజాల లోపలకి వెయ్యి అడుగుల లోతున బోర్లు వేస్తే తప్ప నీటి చుక్క దొరికే అవకాశం లేదు. కృష్ణానది మైళ్లకు మైళ్లు ప్రవహిస్తున్నా పాలమూరు జిల్లా గొంతు తడవడం లేదు. ఫ్లోరిన్‌ నీళ్లు నల్లగొండకు నిద్ర పట్టనీయడం లేదు. పుష్కలంగా నీటి వనరులన్న ప్రాంతాలు రసాయన ఎరువులు, పురుగు విషాలతో విషతుల్యమైపోయాయి. అసలు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ నాలుగు వందల అడుగులకు మించి నీళ్లు రకరకాల రసాయనాలతో విషపూరితమైనవి కాబట్టి వాటిని మంచినీటిగా ఉపయోగించకూడదని చెప్పింది. మరోప్రక్క కలుషితమైన నీటి వల్ల ప్రపంచవ్యాప్తంగా రోజుకు ఆరువేల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే, మనం రెండు గుక్కల        నీళ్లు తాగి గ్లాసు కింద పెట్టే లోపు ఒక చిన్నారి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోతోంది. 

అడవుల్ని కొట్టేసి, కొండల్ని పిండేసి, నదుల్ని ఎండేసి, గాలిని కాలుష్యంతో నింపేసి, తిండిని రసాయనాల్తో కలిపేసి, ఇంకా ఎన్ని దుర్మార్గాలు కళ్లముందే జరుగుతున్నా ఇప్పటి దాకా మౌనంగానే వున్నాం. ఆఖరికి తాగే నీళ్లలో కూడా ఇన్ని రసాయనాలు వున్నాయంటే చుక్క కూడా గొంతు దిగడం లేదు. అలాగని తాగకుండా వుండనూలేము, చిన్న చిన్న పిల్లలు తాగే పాలే కాదు, నీళ్లు కూడా విషమని తెలిసాక ఇక మాట్లాడకుండా ఎలా వుండగలం. 

ఇందుకు మనమేం చేద్దాం…

నీరు లేకపోతే మనకు వర్తమానమూ లేదు, భవిష్యత్‌ అంతకన్నా లేదన్న నిజాన్ని మనమంతా నిర్భయంగా అంగీకరించాలి. నీటిని వ్యాపార వస్తువుగా మార్చిన సమస్త పరిస్థితులను వ్యతిరేకించాలి. ప్రతి నీటి చుక్కను గుండెలకు హత్తుకుని పదిలంగా కాపాడుకోవాలి. వాననీటి సంరక్షణ చేపట్టకపోతే భూగర్భజలాలను పెంచుకోకపోతే మానవజాతి ఈ భూమి మీద నుంచి నిష్క్రమించే రోజు మరెంతో దూరంగా లేదని గ్రహించాలి. 

ఏ రకం వరి పంటకైనా విత్తనం పునాది. విత్తనం పండిరచాలి. నూర్పిడి చేయాలి. సరిjైున పద్ధతిలో శ్రేణికరణ (ప్రాసెసింగ్‌) చేయాలి. తద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు. 

మంచి నాణ్యమైన విత్తనం విత్తుకుంటే తక్కువ విత్తనం అవసరం అవుతుంది. త్వరగా మొలక వస్తుంది. అంతా ఒకే విధంగా వుంటుంది. తిరిగి నాటు అవసరం తగ్గుతుంది. త్వరగా ఏపుగా పెరగడం ద్వారా, తెగుళ్ళను, చీడను తట్టుకునే సామర్ధ్యం పెంపొందించుకొంటుంది. కలుపు మొక్కల శాతం తగ్గుతుంది. దిగుబడి 5-20 శాతం వరకు పెరుగుతుంది. 

సుస్థిర వ్యవసాయ కేంద్రం, రైతులకు పైన తెలిపిన విధంగా నాణ్యమైన విత్తనం అందించుటకు విత్తనోత్పత్తి సహకార సంఘాలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలలో 7 సహకార సంఘాలు, విత్తనోత్పత్తి దారుల కంపనీ (ప్రొడ్యూసర్‌ కంపనీ)లతో పని చేస్తున్నది. 

తెలంగాణ రాష్ట్రంలో రెండు సహకార సంఘాలు వున్నాయి. అవి ఎనబావి సేంద్రియ రైతుల పరస్పర సహాయక సహకార సంఘం ములుగు వ్యవసాయదారుల పరస్పర సహయక సహకార సంఘం, మెదక్‌ జిల్లా. ఈ రెండు సంఘాలు ప్రభుత్వం నుండి వచ్చిన సబ్సిడీ సహాయంతో మొబైల్‌ మినీ సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను కొనుగోలు చేశాయి. వరిలో బి.పి.టి.`5204, యం.టి.యు-1010, తెల్లహంస, ఆర్‌.పి.బయో 226, ఐ.ఆర్‌`64, కావ్య మొదలగు రకాలను సాగు చేసి మార్కెట్‌ చేస్తున్నాయి. 

సుస్థిర వ్యవసాయ కేంద్రం, సహకార సంఘాలకు (బ్రీడర్‌ సీడ్‌) మూల విత్తనం సమకూర్చడం, మార్కెటింగ్‌ లైసెన్స్‌ అందించడంలో సహయం చేస్తున్నది. విత్తనోత్పత్తిలో అవసరమైన సాంకేతిక పరమైన విషయాలను శిక్షణద్వారా అందిస్తూ పర్యవేక్షిస్తున్నది. సహకార సంఘాల నిర్వహణలో అవసరమైన నాయకత్వపు శిక్షణలు సహకార సంఘాల డైరెక్టర్లకు సమకూరుస్తున్నది. 

విత్తన మార్కెటింగ్‌, ప్యాకింగ్‌ మొదలగు విషయాలలో సుస్థిర వ్యవసాయ కేంద్రం నిపుణులు, సహకార సంఘం కోసం పని చేస్తున్నారు. 

ప్రస్తుత సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌కు గాను రెండు సహకార  సంఘాల నుండి వచ్చిన విత్తనం 200 బ్యాగులు మార్కెట్‌ చేశారు. తద్వారా వచ్చిన అనుభవంతో వచ్చే సంవత్సరం 10000 బ్యాగుల (30కిలోల) విత్తనం ఉత్పత్తి చేసి మార్కెట్‌ చేయుటకుగాను ఈ సంఘాలు ప్రణాళిక సిద్దం చేసుకొన్నాయి. 

ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌లో వరి పంటలో బి.పి.టి-5204, హెచ్‌.యం.టి., యం.టి.యు.-1010, ఐ.ఆర్‌.-64, డబ్ల్యూ.సి.ఐ.-14, కావ్య, సురేఖ, తెల్ల హంస (రకాలను) సాగు చేస్తున్నారు. ఈ రకాలు వచ్చి రబీ మరియు ఖరీఫ్‌ సీజన్స్‌కు అందుబాటులో వుంటాయి. 

ముఖ్య ఉద్యేశాలు: 

1. వరి

ఎ) పశువుల పేడ + మూత్రం + ఇంగువ ద్రావణం (లేదా)

బి) పుల్లని మజ్జిగ + ఇంగువ ద్రావణం (లేదా)

సి) శోంఠిపాల కషాయం (లేదా)

డి) మారేడు ఆకుల కషాయం

ప్రధాన పొలంలో దుక్కిలో జీవన ఎరువులైన సూడోమోనాస్‌, అజోస్పెర్లిం మొ॥ వాడటం వల్ల కూడా తెగుళ్ళను కొంత వరకు నివారించవచ్చు.

2. మొక్క జొన్న:

3. వేరుశనగ

4. కంది, పెసర, మినుము

5. మిరప

6. కాయగూరలు 

7. పండ్లు

8. మామిడిపై సస్యరక్షణ (కాయపుచ్చు) నివారణ:

భూసారాన్ని మరియు తేమను నేలలో వృద్ధిచేసుకోవటానికి ఒకే విధమయిన పద్ధతులు ఉన్నాయి. అయితే వీటన్నిటికి సమాన ప్రాముఖ్యతను ఇచ్చి పాటించాలి. ఈ పద్ధతుల సహజత్వాన్ని ఆటంకపరిచే, నష్టపరిచే రసాయన ఎరువులను దూరం చెయ్యాలి.

  1. పంట ఎన్నిక
  2. పచ్చిరొట్ట ఎరువులు
  3. పచ్చిఆకు ఎరువులు
  4. సేంద్రియ ఎరువులు
  5. వానపాముల ఎరువు
  6. జీవన ఎరువులు
  7. మల్చింగ్‌ పద్ధతి

పంటల ఎన్నిక:

పంటల ఎన్నిక కేవలం మార్కెట్‌లో ఉన్న మంచి ధరను ఆధారం చేసుకొని మంచి దిగుబడుల కోసం అధిక పెట్టుబడులు వాడే దిశలో కాకుండా మన భూసారం, తేమ మరియు వాతావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకోవాలి.

తేమ, నీటి తడులను బట్టి : నేలలో తేమను బట్టి, నీటి తడులకు మనవద్ద ఉన్న నీటిని బట్టి ఎన్ని నెలలు పంటకు అందివ్వగలమో తెలుసుకొని పంటను ఎన్నుకోవాలి. అలాంటి పంటలకు ఉండే ”తేమ కొరకు కీలక దశల”పై అవగాహన ఉండాలి.

నేల లోతును బట్టి : కొన్ని పంటలవేర్లు చాలా లోతుకు వెళ్ళి తేమను పీల్చుకుంటాయి. నేలలోపలి పొర గట్టిపొర అయితే వేర్లను పెరగనివ్వవు. అటువంటి పరిస్థితుల్లో పైపైన వేర్లు ఉండే పంటలు వేసుకోవాలి.

పురుగులు తెగుళ్ళ సమస్యలు : పురుగులు తెగుళ్ళ సమస్యలు అధికమవటానికి పంటల విధానం ప్రధాన కారణం కూడా. ఈ సమస్యల ఉధృతి పెరగకుండా నియంత్రించే మొక్కలు ఎన్నుకోవాలి.

పంట మార్పిడి :

  1. ఎక్కువ పోషకాలను పీల్చుకునే మొక్కలతో తక్కువ పోషకాలను పీల్చుకునే వాటితో మార్పిడి చేసుకోవాలి.
  2. పప్పుజాతి మొక్కలను ఇతర పంటలతో మార్పిడి చేసుకోవాలి.
  3. లోతైన వేరు వ్యవస్థగల మొక్కలను పైపైన ఉండే వేరు వ్యవస్థగల మొక్కలతో మార్పిడి చేసుకోవాలి.
  4. పురుగుల, తెగుళ్ళ సమస్యలలో చిక్కుకునే పంటలను వాటిని తట్టుకునే పంటలతో మార్పిడి చేసుకోవాలి.

వేరుశనగలో వచ్చే తిక్క ఆకుమచ్చ తెగులు వాతావరణంలో అత్యల్ప ఉష్ణోగ్రత 21 డిగ్రి సెం.గ్రే. లేదా అంతకంటే ఎక్కువగా ఉండి ఆకులపై తేమ 10 గంటలకంటే ఎక్కువ సేపు ఉన్నట్లయితే విపరీతంగా వస్తుంది.

మిరపలో వచ్చే ఎండుతెగులు వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత, భూమిలో తేమవుండి పొలాల్లో మురుగునీరు పారుదల సరిగాలేని ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది.

వరిలో వచ్చే అగ్గితెగులు కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీ.సెం.గ్రే. కంటే తక్కువ, గాలిలో తేమ 90శాతం కంటే ఎక్కువ, రాత్రిపూట మంచుబిందువులూ వర్షపు జల్లులు ఆకులమీద పడటం…. ఈ మూడు పరిస్థితులు ఒక వారంరోజులపాటు ఉంటే విపరీతంగా ఆశించి నష్టం కలుగజేస్తుంది.

వరిలో వచ్చే పొడతెగులు 28 డిగ్రీ.సెం.గ్రే. పైగా ఉష్ణోగ్రత, గాలిలో ఎక్కువ తేమ, మబ్బులు ఉన్న పరిస్థితులలో ఎక్కువగా విస్తరిస్తుంది. ఈ రోగం చెట్ల నీడల్లో తొందరగా అభివృద్ధి చెందుతుంది.

పొట్టకుళ్ళు తెగులు రాత్రి ఉష్ణోగ్రత 25డిగ్రి.సెం.గ్రే. ఉన్నప్పుడు, గాలిలో అధికంగా తేమ, మంచు, చల్లని వాతావరణం వున్నప్పుడు త్వరగా వ్యాపిస్తుంది.

బ్యాక్టీరియా ఎండుతెగులు 30 డిగ్రి.సెం.గ్రే. లోపు ఉష్ణోగ్రత, గాలిలో ఎక్కువ తేమ, జల్లులు లేదా వర్షం లేదా గాలివాన…. ముఖ్యంగా ఆగస్టు నుండి అక్టోబర్‌ వరకు పడే వర్షాలలో వ్యాప్తి చెందుతుంది.

దీనివలన మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే ప్రతి తెగులు వ్యాప్తికి కొన్ని రకాల వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. ఈ పరిస్థితులు లేకుంటే వ్యాధికారకాలు ఉన్నా, తెగులు వ్యాప్తి చెందదు. కానీ మనం పంటపై ఏదో మచ్చకనిపించగానే అవసరం లేకున్నా తెగుళ్ళ మందులు విపరీతంగా పిచికారి చేస్తున్నాం.

ఉష్ణోగ్రత ప్రభావం:

ఏ కాలంలో, ఏ ప్రాంతంలో తెగులు వ్యాపిస్తుందనేది ఆ ప్రాంత ఉష్ణోగ్రతలమీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కొన్నిరకాల తెగుళ్ళు చలికాలంలో వస్తే, కొన్ని వేసవి కాలంలో వస్తుంటాయి. ఎక్కువగా తెగుళ్ళు వర్షాకాలంలో వస్తుంటాయి. చల్లని ఉష్ణోగ్రతలో వచ్చే తెగుళ్ళు ఎక్కువగా చల్లని ప్రాంతంలో పండించే పంటలలోనే వస్తాయి. అదేవిధంగా నారుకుళ్ళు, ఎండుతెగులు, బ్యాక్టీరియా ఎండుతెగులు, కుళ్ళుతెగులు  ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంటాయి.

1.  ఒక పంటకు ఎండుతెగులు ఆశిస్తే 27 డిగ్రీ సెం.గ్రె. ఉష్ణోగ్రత దగ్గర ఆ పంటలో 12 రోజులకు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. అదే 16 డిగ్రీ. సెం.గ్రె. దగ్గర 58 రోజులకు వ్యాధి లక్షణాలు బయటపడతాయి.

2.   భూమిలో 12-20 డిగ్రీ.సెం.గ్రె. ఉష్ణోగ్రత ఉన్నప్పుడు నారుకుళ్ళు తెగులు శిలీంద్రం మొక్కలలోనికి సులువుగా ప్రవేశిస్తుంది.

తెగుళ్ళమీద తేమ, మంచు ప్రభావం :

సాధారణంగా ఆకుల మీద తేమలేకుంటే ఆ మొక్కల మీద వ్యాధికారమున్నా తెగులు వ్యాప్తిచెందదు. ఎందుకంటే శిలీంధ్రాలు మొక్కలలో ఆకులమీది తేమను ఉపయోగించుకొని మొలకెత్తి ఆకులలోని రంధ్రాల ద్వారా మొక్కలలోని ప్రవేశిస్తాయి. చాలా రకాల తెగుళ్ళ పెరుగుదలకు మంచు తోడ్పడుతుంది. అలాగే నీడ కూడా తెగుళ్ళ వ్యాప్తికి తోడ్పడుతుంది.

ముఖ్యమైన మిరప రకాలు

  1. బార్డ్స్‌ ఐ చిల్లీ (ధని)

ఇది ముఖ్యంగా మిజోరాం, మణిపూర్‌ ప్రాంతాల్లో పండిస్తారు. మిరప రకల్తవర్ణంలో ఉండి ఎక్కువ ఘాటును కలిగి ఉంటుంది. ఇది ముఖ్యంగా అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ నెలల్లో కోతకు వస్తుంది. కలకత్తా మార్కెట్లో విరివిగా దొరుకుతుంది. ఇందులో క్యాప్సిసిన్‌ శాతం 0.58

2.బ్యాడగి 

ఇది ముఖ్యంగా కర్ణాటకలోని దార్వాడ్‌ ప్రాంతంలోను, ఆంధ్రప్రదేశ్‌లోనూ పండిస్తున్నారు. కాయ ఎరుపు రంగులో ఉండి తక్కువ ఘాటును కలిగి వుంటుంది. ముఖ్యంగా ఇది జనవరి నుండి మే ప్రాంతంలో కోతకు వస్తుంది. 

3. గుంటూరు సన్నం (S4 Type)

ఇది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో లభిస్తుంది. దీని తోలు మొద్దుగా ఉండి ఎక్కువ ఘాటుగా ఉంటుంది. డిసెంబర్‌ మాసం నుండి మే వరకు కోతకు వస్తుంది. 

4. హిందూపూర్‌ – ఐ7

ఇది ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపూర్‌ ప్రాంతంలో పండిస్తారు. కాయ ఎరుపురంగులో ఉండి. విపరీతమైన ఘాటు వుంటుంది. డిసెంబర్‌ నుంచి మార్చి వరకు కోతకు వస్తుంది. క్యాప్సిసిన్‌ శాతం 0.24.

5. జ్వాల

ఇది ముఖ్యంగా గుజరాత్‌లోని ఖేడ, మెహసానా ప్రాంతాల్లో పండిస్తారు. విపరీతమైన ఘాటు, తక్కువ ఎరుపురంగు కలిగి వుంటుంది. చిన్నవిగా వుండి విత్తనాలు కలిసి వుంటాయి. సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ ప్రాంతాల్లో కోతకు వస్తుంది. క్యాప్సిసిన్‌ శాతం 0.4.

6. కంథారి – తెలుపురకం

ఇది ముఖ్యంగా కేరళలోను మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు. కాయ తెలుపురంగులో ఉండి విపరీతమైన ఘాటును కలిగి వుంటుంది. ముఖ్యంగా పెరటి తోటలలో ఎక్కువగా పండిస్తారు. సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతుంది. క్యాప్సిసిన్‌ శాతం 0.504

7. కాశ్మీర్‌ మిర్చి

ఇది ముఖ్యంగా హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ మరియు కాశ్మీర్‌ ప్రాంతాల్లో శీతాకాలంలో పండించే మిర్చి రకం. కాయ పొడవుగా వుండి దొడ్డుగా ఎక్కువ ఎరుపురంగులో వుంటుంది. నవంబర్‌ నుండి ఫిబ్రవరి వరకు కోతకు వస్తుంది. క్యాప్సిసిన్‌ శాతం 0.325.

8. మద్రాస్‌ పరి

ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఎక్కువగా పండిస్తారు. ఎక్కువ ఎరుపురంగులో ఉండి ఘాటుగా ఉంటుంది. మార్చి నుండి మే లోపల కోతకు వస్తుంది. చెన్నై మార్కెట్లో ఎక్కువగా లభిస్తుంది. క్యాప్సిసిన్‌ శాతం 0.206.

9. నాగపూర్‌ మిర్చి

ఇది మహారాష్ట్రలోని నాగపూర్‌ జిల్లాలో ఎక్కువగా పండిస్తారు. ఎరుపురంగులో వుండి ఘాటుగా వుంటుంది. జనవరి నుంచి మార్చి ప్రాంతంలో కోతకు వస్తుంది. మహారాష్ట్రలోని భీమాపూర్‌ ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతుంది. 

10. నల్చెటి

ఇది మహారాష్ట్రలోని నాగపూర్‌ జిల్లాలో ఎక్కువగా పండిస్తారు. ఎరుపురంగులో వుండి విపరీతమైన ఘాటు కలిగి వుంటుంది. జనవరి నుంచి మార్చి ప్రాంతంలో కోతకు వస్తుంది. క్యాప్సిసిన్‌ శాతం 0.12. నాగపూర్‌ మార్కెట్లో దొరుకుతుంది.

11. రామ్‌నాడ్‌ ముండు

ఇది తమిళనాడులోని రామ్‌నాడ్‌ జిల్లాలో ఎక్కువగా పండిస్తారు. ఇది పసుపు వర్ణపు ఎరుపు రంగులో వుండి ఘాటుగా వుంటుంది. మార్చి నుంచి మే ప్రాంతంలో కోతకు వస్తుంది. తమిళనాడులో విరూధ్‌నగర మరియు రామ్‌నాడ్‌ జిల్లాల్లో దొరుకుతుంది. క్యాప్సిసిన్‌ శాతం 0.166.

12. సంగ్లీ సన్నమ్‌ (S4 Type)

ఇది మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లాలో ఎక్కువగా పండిస్తారు. తక్కువ ఎరుపురంగులో వుండి ఘాటుగా వుంటుంది. సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ ప్రాంతంలో కోతకు వస్తుంది. ముంబాయి, కొల్హాపూర్‌ ప్రాంతాల్లో దొరుకుతుంది. క్యాప్సిసిన్‌ శాతం 0.215

13. S9 ముండూ

ఇది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌ జిల్లాలో పండిస్తారు. మిర్చి టమాటో ఎరుపురంగులో వుండి ఒక మోస్తరు ఘాటును కలిగి వుంటుంది. ఫిబ్రవరి నుండి ఏప్రిల్‌ ప్రాంతంలో కోతకు వస్తుంది. అనంతపూర్‌ జిల్లాలో ఎక్కువగా దొరుకుతుంది. 

14. తాడపల్లి పొడవురకం

ఇది ఆంధ్రప్రదేశ్‌లోని తాడపల్లి ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతుంది. తోలు మందంగా వుండి తక్కువ ఘాటు కలిగి ఎరుపురంగులో వుంటుంది. జనవరి నుంచి ఏప్రిల్‌ ప్రాంతంలో కోతకు వస్తుంది. క్యాప్సిసిన్‌ శాతం 0.11.

15. టమాటో మిర్చి

ఇది ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్‌, ఖమ్మం, ఉభయగోదావరి జిల్లాల్లో పండిస్తారు. ముదురు ఎరుపురంగులో వుండి తక్కువ ఘాటును కలిగి వుంటుంది. డిసెంబర్‌ నుంచి మార్చి ప్రాంతంలో కోతకు వస్తుంది. క్యాప్సిసిన్‌ శాతం 0.17.

విత్తనశుద్ధి

ఎంపిక చేసిన విత్తనాలను విత్తేందుకు ముందు రకరకాల పద్ధతుల్లో విత్తనశుద్ధి చేసినచో పంటకాలంలో ఆశించే చీడపీడలను చాలావరకూ నివారించవచ్చు.

ఆవు మూత్రంతో విత్తనశుద్ధి:

విత్తనాల్ని ఆవు మూత్రంతో శుద్ధి చేయడం వల్ల మొక్కలలో రోగాలకు తట్టుకునే శక్తి పెరుగుతుంది. మొదట 500 మిల్లీలీటర్ల ఆవు మూత్రాన్ని ఒక పెద్ద పాత్రలో పోసి ఉంచాలి. అందులో 2.5 లీటర్ల నీరు కలపాలి. ఒక పాలు ఆవు మూత్రానికి ఐదు పాళ్ళ నీటి నిష్పత్తిని (1:5) జాగ్రత్తగా పాటించాలి. మోతాదు ఎక్కువైతే మొక్కల పెరుగుదల, ఉత్పాదకత దెబ్బతింటాయి.

విత్తనాన్ని గుడ్డలో మూట కట్టి, మూటను ఆవు మూత్రం ద్రావణంలో సుమారు అరగంటసేపు నాననివ్వాలి. ఆ తరువాత విత్తనాల్ని ఆరబెట్టి, విత్తాలి.

పశువుల పేడ, మూత్రంతో విత్తనశుద్ధి:

2 లీటర్ల ఆవు మూత్రం, 1 కిలో పశువులపేడ, 1 కిలో మట్టి (గుట్ట లేదా పుట్టమట్టి) కలిపి ద్రావణం తయారు చేసుకుని విత్తన శుద్ధి చేసి నీడలో ఒక గంట ఆరబెట్టి నారుమడిలో విత్తుకోవాలి.      

వస కషాయం:

పురుగుల, రోగాల బెడదను తగ్గించడానికి విత్తనాల్ని వస కషాయంతో కూడా విత్తనశుద్ధి చేయవచ్చు. దీనికి  500 గ్రాముల వస దుంపల పొడి అవసరం. దీన్ని 2.5 లీటర్ల నీటిలో కలపాలి. ఇది ఒక ఎకరా పొలానికి అవసరమైన విత్తనాలకు సరిపోతుంది. విత్తనాల్ని గుడ్డలో మూట కట్టి, మూటను వస కషాయంలో అరగంట సేపు నాననిచ్చి, ఆ తరువాత ఆరబెట్టి విత్తాలి. 

సూడో మోనాస్‌తో విత్తన శుద్ధి:

సూడోమోనాస్‌ అనేది ఒక శిలీంద్రం. ఈ జీవి పదార్థం వరిలో చాలా రోగ కారకాలను నిరోధిస్తుంది. వరి విత్తనాల్ని, విత్తే ముందు సూడోమోనాస్‌తో శుద్ధి చేయవచ్చు.       ఒక లీటర్‌ చల్లార్చిన వరి గంజిలో 250 గ్రాముల సూడోమోనాస్‌ కలిపి ద్రావణం తయారు చేయాలి. ఒక ఎకరాలో విత్తడానికి తగినన్ని మొలకెత్తిన విత్తనాల్ని నేల మీద పరిచి, వాటి మీద సూడోమోనాస్‌ – గంజి ద్రావణాన్ని చిలకరించాలి. ద్రావణం విత్తనా లన్నింటికీ పట్టే విధంగా విత్తనాలను కలపాలి. ఆ తరువాత ఆ విత్తనాలు మడిలో విత్తాలి.

నారుమడి తయారీ

వరి విత్తడానికి ముందు నారుమడి స్థలాన్ని జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. విత్తనానికి తగిన పోషకాలు లభించే విధంగా నారుమడి నేలను సారవంతం చేయాలి. ఈ నేలలో పచ్చిరొట్ట ఎరువు వేసి దున్నాలి.

చేదు గుణాలున్న వేప తదితర ఆకులు పచ్చిరొట్టకు బాగా ఉపయోగ పడతాయి. వేప ఆకు నేలను సారవంతం చేయడమే గాక చీడ పురుగులను కూడా అదుపు చేస్తుంది. మొక్క వేరు నేలలోకి తేలికగా చొచ్చుకుని పోవడానికి పశువుల ఎరువు ఉపయోగ పడుతుంది. పూర్తిగా కుళ్ళిన ఎరువులో మొక్క పెరిగినప్పుడు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. తరువాత కూడా మొత్తం పంట ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. నారుమడి చుట్టూ కాలువ తీయాలి. తడి మట్టి జారిపోకుండా అవసరమైతే నారుమడి చుట్టూ చెక్కలుగానీ, వాసం బద్దలు కానీ, వరి ఎంట్లు కానీ ఉంచాలి.