Skip to content

Uncategorized

గాలివాన మొక్క

Srikanth Adira June 24, 2020 1 min read

గాలివాన మొక్క

గాలివాన మొక్క సుమారు 1-2 అడుగులు ఎత్తు వరకు పెరిగే ఏకవార్షిక మొక్క. పత్రాలు కణుపుకు ఒకటి చొప్పున ఏర్పడతాయి. పత్రాలు దాదాపు 3-5 సెంటీ మీటర్ల పొడవు ఉండి, అండాకారంలో ఉండి, అంచులకు దంతాల వంటి నొక్కులుంటాయి. మొక్క భాగాలను గిచ్చితే పాలు వస్తాయి. ఈ మొక్క అన్ని భాగాలు ఘాటైన వాసనతో ఉంటాయి. తెల్లని పుష్పాలు పొడవైన కంకి మాదిరిగా ఏర్పడతాయి. మొక్క పైన సన్నని, తెల్లని నూగు ఉంటుంది. ఫలాలు 5 మిల్లీ మీటర్ల పొడువుగా ఉండే గుళిక. పుష్పాలు, ఫలాలు సెప్టెంబరు – నవంబరు మాసాలలో ఎక్కువగా లభిస్తాయి. ఈ మొక్క పంట పొలాలలోనూ, బీడు భూములలోనూ, తేలికపాటి నేలలలోనూ కలుపు మొక్కగా పెరుగుతుంది.

గాలివాన మొక్కలో వున్న రసాయనాలు చాలా శక్తివంతమైనవి. అందువల్ల ఈ మొక్కను వ్యవసాయంలో సస్యరక్షణ కొరకు రైతులు వినియోగించుకోవచ్చు. గాలివాన మొక్క ఆకుల కషాయానికి పంటలలో వచ్చే బ్యాక్టీరియా తెగుళ్ళను నియంత్రించే లక్షణాలు వున్నాయని డా|| దుబే (2011) పరిశోధనలు నిరూపిస్తున్నాయి. గాలివాన మొక్కకు కూరగాయ పంటలను (వంగ, టమాట, మిరప మొదలైన) ఆశించే ‘నులిపురుగు’ను అదుపు చేసే గుణం వుందని డా|| ఎమ్‌.ఎమ్‌. అలామ్‌ (2006) పరిశోధనలు సూచిస్తున్నాయి. బంతి మొక్కలకు కూడా నులి పురుగులను నియంత్రించే లక్షణం వుందన్న విషయం రైతులకు తెలిసిందే!

ఈ మొక్క ఎక్కువగా వున్న పొలాలలో లుపు కూడా తక్కువగా వుండటం ఈ రచయిత గమనించారు. ఈ మొక్క పంటలలో వచ్చే కలుపు నియంత్రణలో ‘సేంద్రియ లుపు నాశని’గా వినియోగించే అంశంపైన శాస్త్రవేత్తల పరిశోధనలు చాలా అవసరం.

గాలివాన మొక్కను సమూలంగా కంపోస్టు గుంతలలో వేసి బాగా కుళ్ళిన తర్వాత సేంద్రియ ఎరువు (కంపోస్టు)గా వుపయోగించు కోవచ్చు.

Questions and answers

Ask a question

Questions are checked by our team before they appear. Your email is not shown.