Skip to content

Uncategorized

వరిలో గొట్టాల పురుగు – సుస్థిర వ్యవసాయ కేంద్రం

Srikanth Adira June 26, 2020 1 min read

వరిలో గొట్టాల పురుగు

పురుగు ఆశించు కాలం: మార్చి – నవంబర్‌

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • మొక్కలను సరియైన దూరంగా నాటాలి.
  • పురుగు గుడ్లను, ఫ్యూపాలను నాశనం చేయడానికి పంట కోత పూర్తి కాగానే భూమిని దున్నుకోవాలి. 
  • 8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి. 

నివారణ: 

  • పొలంలో వున్న లార్వాలను పంటపై త్రాడులాగి నివారించవచ్చు.
  • చామ, నిమ్మ ఆకులను ముక్కలుగా కత్తిరించి పొలంలో వెదజల్లితే అవి పురుగు వికర్షిణిగా పని చేస్తాయి. 
  • 3-4 రోజులు పొలంలో నిలిచి ఉన్న నీటిని బయటకి పంపించాలి. లేదా నిలిచివున్న నీటిలో తాజా ఆవుపేడ వేయాలి.

Questions and answers

Ask a question

Questions are checked by our team before they appear. Your email is not shown.