భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రధానంగా రెండు రూపాల్లో వ్యక్తమవుతుంటుంది. ఒకటి – 5 సంవత్సరాల కొకసారి జరిగే ఎన్నికలు. రెండు – ప్రతి సంవత్సరం ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌. భారత ఎన్నికల వ్యవస్థ ఎలా రూపొందిందో, ఎంతగా దిగజారిందో మనం చూస్తున్నాం. ఓటింగ్‌ సరళి, ఓట్ల కోసం అనుసరిస్తున్న పద్ధతులు, ఎన్నికవుతున్న ప్రజా ప్రతినిధుల నైతికత, స్థాయి, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పార్టీల వైఫల్యం – మొత్తంగా ఒక ప్రజాస్వామిక ప్రక్రియ ఎంత ప్రవాహనంగా మారిందో అందరం గమనిస్తున్నదే. 

ఇక బడ్జెట్ల విషయానికి వస్తే, రాష్ట్రాలలో ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న బడ్జెట్లకు నిర్ధిష్ట ప్రాతిపదిక ఏమీ ూండడం లేదు. బడ్జెట్‌ పరిమాణాన్ని అనంతంగా పెంచుకుంటూ పోతున్నారు. కానీ ప్రతి సంవత్సరం ఆ బడ్జెట్‌ అమలు తీరు నాసిరకంగా ూంటున్నది. ప్రభుత్వం వేసుకుంటున్న రెవెన్యూ (ఆదాయం) అంచనాలు తప్పిపోతున్నాయి. ప్రణాళిక కేటాయింపులు (ప్రగతి పద్దు) భారీగా వుంటున్నా, నిధుల విడుదల, ఖర్చు ప్రతి సంవత్సరం తగ్గిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడం, అసలు, వడ్డీలు, ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో చెల్లించాల్సి రావడం వల్ల, అంతిమంగా కీలక రంగాలకు నిధుల కొరత ఏర్పడుతున్నది. ప్రధానరంగాలకు కేటాయింపులు భారీగా చేస్తున్నట్లు కనిపించినా, సంవత్సరం చివరిలో సవరించిన అంచనాలు చూస్తే అసలు విషయం బోధపడుతుంది. కేటాయింపులకు, ప్రభుత్వం వాస్తవంగా చేసే ఖర్చులకు పొంతన ూండడం లేదు. పైగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం వరకే ఒక క్రమపద్ధతి పాటిస్తున్నది తప్ప, అంతకు మించి బడ్జెట్‌కు ఎటువంటి చట్టబద్ధత ూండడం లేదు. కేటాయించిన నిధులు విడుదల చేయకపోయినా, ఖర్చు చేయకపోయినా, నిధులను దారి మళ్లించినా అడిగే పరిస్థితి లేదు. పైగా రాష్ట్ర బడ్జెట్‌లను విశ్లేషించి, ‘కాగ్‌’ సంస్థ నివేదికలను వెలువరిస్తే తప్ప, బడ్జెట్‌ల పరంగా నిజంగా ఏం జరుగుతోందో ప్రజలకు తెలియడం లేదు. గత 5 సంవత్సరాల తెలంగాణా రాష్ట్ర బడ్జెట్‌లను విశ్లేషిస్తే, ఇదే విషయం స్పష్టమవుతుంది. చాలా సందర్భాలలో, కేటాయింపులలో చేసిన ఖర్చు సగం కూడా లేదు. ఎస్సీ, ఎస్టీ, సబ్‌ప్లాన్‌ నిధులు 50 శాతం కూడా ఖర్చు చేయడం లేదు. పైగా నిధుల కోతకు గురవుతున్న రంగాలలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఇతర సామాజిక, సంక్షేమ రంగాలు వుంటున్నాయి. 

ఈ నేపధ్యంలో 2020-21 సంవత్సర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్ధమవుతున్నది. 2019-20 బడ్జెట్‌ నుండే, వాస్తవిక బడ్జెట్‌ పేరుతో అనేక రంగాలకు కోతలు పడ్డాయి. ఈ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులకు కూడా నిధులు విడుదల కావడం లేదు. 

ప్రతి నెలా జీతాలకే కటకట పడుతున్న స్థితి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వుంది. సాధారణ, అత్యవసర చెల్లింపులకు కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవని వార్తలు వస్తున్నాయి. అన్ని రంగాలలో బకాయిలు పెరిగిపోతున్నాయి. చివరికి కలెక్టర్ల దగ్గర ూండాల్సిన ‘కనీస నిధి’ కూడా విడుదల కావడం లేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 

ఈ ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్ర వ్యవసాయ కుటుంబాలను సంక్షోభం నుండి బయట పడేయాలంటే 2020-21 బడ్జెట్‌ కేటాయింపులలో విచక్షణతో కూడిన శాస్త్రీయ దృక్పథం ూండాలి. అందుకోసం మేము కొన్ని నిర్ధిష్ట ప్రతిపాదనలు పెడుతున్నాం. 

  1. వాస్తవ సాగుదారులుగా వున్న సన్న, చిన్నకారు, క్రింది మధ్యతరగతి, మధ్య తరగతి (10 ఎకరాల లోపు) రైతులకు మాత్రమే రైతుబంధు పథకాన్ని అమలు చేయాలి. వ్యవసాయం చేయని భూ యజమానులకు రైతు బంధు పేరుతో నిధులు దుర్వినియోగం చేయకుండా, ఆయా భూములలో సాగు చేస్తున్న కౌలు రైతులకు మాత్రమే ‘రైతు బంధు’ చెల్లించాలి. షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో ఆదివాసీ పోడు రైతులకు, దేవాదాయ భూములు సాగు చేస్తున్న సన్న, చిన్నకారు, కౌలు రైతులకు ‘రైతు బంధు’ చెల్లించాలి. అందుకోసం తగినన్ని నిధులు బడ్జెట్‌లో కేటాయించి, సకాలంలో విడుదల చేయాలి. 
  2. ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు వాస్తవ సాగుదారులుగా వున్న సన్న, చిన్నకారు రైతుల రుణాలను ఒకే దఫాగా మాఫీ చేయాలి. వ్యవసాయం చేయని భూయజమానుల రుణాలను మాఫీ చేయాల్సిన అవసరం లేదు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనకాడుతున్నందున, కౌంటర్‌ గ్యారంటీగా ప్రభుత్వం, తన బడ్జెట్‌లో  కనీసం 1000 కోట్లు కేటాయించాలి. 
  3. ప్రకృతి వైపరిత్యాలు పెరుగుతున్న దశలో రైతులను ఆదుకోవడానికి పంటల బీమా తప్పనిసరి. కానీ బీమా పథకాలను బ్యాంకులు ఇచ్చే పంట రుణాలకు లింక్‌ చేయడం వల్ల ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం లేకుండా పోతున్నది. కాబట్టి ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరేలా 10 ఎకరాల లోపు రైతుల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి. అందుకు అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించాలి. 
  4. గ్రామీణ ప్రాంతాలలో రైతుల సహకార సంఘాలకు, ూత్పత్తిదారుల కంపనీలకు ప్రోత్సాహం ఇస్తూ, వాటి నిర్వహణకు, వాటి ఆధ్వర్యంలో మౌలిక వసతుల కల్పనకు, యంత్రాలతో కూడిన కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. 
  5. గ్రామ పంచాయితీ స్థాయిలో గ్రామీణ ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలు అందించేందుకు గాను తగినంత మంది సిబ్బందిని గ్రామ సచివాలయంగా ఏర్పాటు చేయాలి. అందుకవసరమైన నిధులను కేటాయించాలి. 
  6. రైతులు పండించే పంటలకు రాష్ట్రంలో ూత్పత్తి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. కేంద్రం ప్రకటించే కనీస మద్ధతు ధరలు వారికి గిట్టుబాటు కావడం లేదు. ఈ నేపధ్యంలో పంటల ూత్పత్తి ఖర్చులు తగ్గేలా, సుస్థిర, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. రాష్ట్ర స్థాయిలో ూత్పత్తి ఖర్చులకు అనుగుణంగా ధరలు చెల్లించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించి రైతులకు బోనస్‌గా చెల్లించాలి. 
  7. భూమిపై పట్టా హక్కులు కలిగిన రైతులకు అమలు చేస్తున్న ‘రైతు బీమా’ పథకాన్ని, కుటుంబం యూనిట్‌గా గ్రామీణ ప్రజలందరికీ వర్తింప చేయాలి. అందుకవసరమైన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. దాని కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. 
  8. కేంద్రం సహాయంతో రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే నిర్వహించడం, రాష్ట్ర స్థాయిలో వాస్తవ సాగుదారులగా వున్న కౌలు, మహిళా రైతులను గుర్తించడం, శాస్త్రీయ పద్ధతిలో పంటల ూత్పత్తి ఖర్చులను లెక్కించడం, రైతులలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన ప్రచారం, శిక్షణలు నిర్వహించడం – పెద్దగా రాష్ట్ర బడ్జెట్‌తో సంబంధం లేకుండా చేయగలిగిన పనులు. కానీ అవసరమైన పనులు.

ఈ కార్యక్రమాలు ఎక్కువ మంది గ్రామీణ ప్రజలకు భరోసా ఇస్తాయి. వారి ఆదాయాలు పెంచుతాయి. ఆత్మహత్యలను ఆపుతాయి.

జీవామృతం

జీవామృతం తయారీకి అవసరమైన ముడి సరుకులు:

ఆవు పేడ                10 కిలోలు

ఆవు మూత్రం        10 లీటర్లు              

నల్ల బెల్లం               2 కిలోలు

శనగ పిండి             2 కిలోలు

ప్లాస్టిక్‌ డ్రమ్ము       200 లీటర్లది

తయారు చేసే విధానం:

పెద్దపాత్రలో 200 లీటర్ల నీరు తీసుకోవాలి. దానికి 10 కిలోల పేడ కలపాలి. కట్టెతో దాన్ని బాగా కలియబెట్టాలి. దానికి మెత్తగా పొడి చేసిన బెల్లం (2 కిలోలు), శనగపిండి (2 కిలోలు) కలపాలి. దానికి 10 లీటర్ల పశువుల మూత్రాన్ని పిడికెడు మట్టిని కలిపి బాగా కలియబెట్టాలి. పాత్రపై గోనెసంచి కప్పిఉంచి, వారం రోజులు పులియబెట్టాలి. రెండు మూడు రోజులకొకసారి కట్టెతో కలియబెడుతుండాలి.

జీవామృతాన్ని తయారు చేసిన 2-3 రోజుల్లో కూడా వాడుకోవచ్చు.

వారంలో జీవామృతంలో సూక్ష్మజీవులు పూర్తిస్థాయికి వృద్ధి చెంది ఉంటాయి. దీనిని సన్నని ధారగా పొలానికి వెళ్ళే నీటితో కలిసేట్టు చూడాలి. దీనిని వడగట్టి స్ప్రింక్లర్‌ లేదా డ్రిప్‌ లో కూడా నీటికి కలుపవచ్చు.

పెద్దపాత్ర అందుబాటులో లేకుంటే చిన్నగుంత పొలంలో తవ్వుకొని, దాని లోపలభాగం చదునుచేసి, పేడతో అలికి, పేడనీటిలో 24 గంటల పాటు నాననిచ్చి, ఒకరోజు ఆరబెట్టాలి. మరుసటి రోజు జీవామృతం దానిలో చేసుకోవచ్చు.

మోతాదు:

ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని సాగు నీరు ద్వారా అందించవచ్చు. లేదా సాగు భూమి పైన జల్లవచ్చు.

అక్టోబర్ చివరి వారంలో కురిసిన వర్షాల వలన బోరు బావులలో నీటి మట్టం పెరిగింది. చెరువులలో నీరు వచ్చి చేరింది. ఫలితంగా ఇంతకు ముందు సంవత్సరం కన్నా ‘రబీ’ పంటల సాగు ఆశాజనకంగా ఉంది. పత్తి మరియు కంది లాంటి దీర్ఘకాలిక పంటలు దాదాపుగా పూర్తి అయినవి. రాష్ట్రంలో రబీలో మొక్కజొన్న, మినుము, వేరుశనగ, సూర్యపువ్వు, కూరగాయలు మొదలగు పంటలు విత్తుకున్నారు. కోస్తా ప్రాంతంలో వరి తరువాత మినుము చల్లుకున్నారు. చాలా వరకు రబీ పంటలు 30-45 రోజులు (శాఖీయ) దశలో ఉన్నవి. మినుము, పెసర పూత దశలో, శనగలు కోతదశలో ఉన్నాయి. ప్రస్తుతం వాతావరణం పొడిగా ఉన్నప్పటికీి, రాత్రి ఉష్ణోగ్రతలు (13-22 డిగ్రీల సెల్సియస్) చాలా తక్కువగా ఉన్నాయి. దీని ప్రభావం విత్తనం మొలకెత్తడం, మొక్క పెరుగుదలపై ఉంటుంది. కావున ఫిబ్రవరి చివరి వారం వరకు విత్తుకోవడానికి అనుకూలమైన ఉష్ణోగ్రత లేదు. ప్రస్తుత వాతావరణం రసం పీల్చే పురుగుల   ఉధృతి పెరగడానికి మరియు తెగుళ్ళు సోకడానికి అనుకూలంగా ఉంది. కావున రైతులు రసం పీల్చే పురుగుల యాజమాన్యం చేపట్టాలి.

వేరుశనగ:

ఆకు ముడత పురుగు:

ఆకు ముడత పురుగు ఉనికిని ఆలస్యంగా విత్తిన రబీ వేరుశనగ పంటలో గమనించాం. లేత ఆకుపచ్చగా వుండే చిన్న ముడత పురుగులు మొదట ఆకుల పై పొరలోనికి తొలుచుకుపోయి హరిత పదార్థాన్ని తినివేస్తాయి. తరువాత ప్రక్కనే ఉన్న ఆకులను మడచి వేస్తాయి.

నివారణ:

ఎకరానికి 20 చొప్పున లింగాకర్షక బుట్టలను (డెల్టా ట్రాప్స్) పొలంలో అమర్చాలి. ఒక చిన్న రేగు కంపను వుపయోగించి ఆకు ముడత పురుగు గూళ్ళను విడగొట్టాలి.

పొలంలో ఎకరానికి 10 చొప్పున పక్షి స్థావరాలను  అమర్చాలి.తొలి దశలో పురుగుల నివారణకు 5 శాతం వేప కషాయం (లేదా) నీమాస్త్రం పంటపై పిచికారీ చేయాలి. (అవసరాన్ని బట్టి వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పంటపై పిచికారీ చేసుకోవచ్చు.)

5 శాతం వావిలాకు కషాయం వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయటం వల్ల మంచి ఫలితాలను సాధించవచ్చు. (రైతుల అనుభవం)

వేరుశనగ తొలి పూతదశలో ఎకరాకు 200 కిలోల జిప్సమ్ను మొక్కలకు దగ్గరగా వేసి మట్టిలో కలియునట్లు చేసి ఎగదోయాలి. జిప్సమ్ వేయునపుడు తగినంత తేమ భూమిలో ఉండటం అవసరం. జిప్సమ్ వేసిన పొలాలలో ఆకు ముడత పురుగు ఉధృతి తక్కువగా వుండటం గమనించాం. (రచయిత అనుభవం)

ఆకుమచ్చ తెగులు:

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఆకుమచ్చ తెగులు మరియు కాండం కుళ్ళు వైరస్ తెగులు సోకుటకు అనుకూలం. నివారణ:  

ఆకుమచ్చ తెగులుకు పశువుల పేడ + మూత్రం + ఇంగువ కషాయాన్ని పిచికారీ చేయాలి.

కాండం కుళ్ళు వైరస్ తెగులు:

తెగుళ్ళ నివారణకు ముందు జాగ్రత్తగా పంట పొలం మరియు గట్లపై ఉన్న వయ్యారిభామ కలుపు మొక్కలను పీకి పొలానికి దూరంగా వేసి తగులబెట్టాలి.

నివారణ:  

నివారణకు తెల్ల జిగురు పూసిన డబ్బాలు లేదా రేకులు ఎకరానికి 5 నుండి 6 డబ్బాలు అమర్చడం వల్ల నివారించవచ్చు.

పొగాకు లద్దె పురుగు గమనించినట్లైతే ఎకరానికి 15-20 పక్షి స్థావరాలను ఏర్పరచాలి. మరియు ఎకరానికి 4 చొప్పున లింగాకర్షక బుట్టలను అమర్చాలి. లద్దె పురుగులు ఉన్న జల్లెడ ఆకులను ఏరి వేసి నాశనం చేయాలి.

మిరప:

ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు బూడిద తెగులు సోకుటకు అనుకూలం.

ఆకు ముడత పురుగు లేక తామర పురుగు (త్రిప్స్)

చిన్న పురుగులు (ఢింబకాలు) మరియు పెద్ద పురుగులు లేత ఆకుల కణజాలాన్ని చీల్చి ఆకులలోని రసాన్ని పీల్చడం వలన ఆకులు వంకరలు తిరిగి పైకి ముడుచుకొని పోతాయి. ఇవి ఎక్కువగా ఆశించిన మొక్కలు బూడిద వర్ణమునకు మారతాయి. మొక్కలు గిడసబారి, పూత సరిగ్గా నిలువక పైరుకు ఎక్కువగా  నష్టాన్ని కలిగించి పంట దిగుబడిని తగ్గిస్తాయి. ఆకులపైన వెండి పూత లాంటి పదార్థాన్ని బట్టి పురుగు లక్షణాలను గమనించవచ్చు. ఆకు ముడత పురుగు మిరప పంటను అన్ని దశలలోనూ ఆశిస్తుంది. ఒక్కొక్కసారి ముదురు నారుమడిలో కూడా ఈ పురుగు ఉధృతిని గమనించవచ్చు.

నివారణ:

మిరప పంటకు తరుచుగా అంతర కృషి అవసరం. అంతరకృషి చేయడంతో పాటు ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను పెరికి వేయాలి. కలుపు మొక్కలలో ముఖ్యంగా వయ్యారిభామ, నానబాలు వంటి మొక్కలను పొలం గట్లపైన మరియు పొలంలో లేకుండా చూడాలి. ఈ మొక్కల పువ్వులలో తామరపురుగులు అభివృద్ధి చెందుతాయి.

పొలంలో ఎకరానికి 10-15 తెల్లని బోర్డులను, గ్రీసు లేదా ఆముదం పూసి పెట్టాలి. ఈ బోర్డులకు తామర పురుగులు అతుక్కుని పంటకు నష్టం కలగకుండా కాపాడుకోవచ్చు. ఈ బోర్డులను ఎప్పటికప్పుడు రైతులు గమనిస్తూ, పురుగు ఉధృతిని అంచనా వేసుకుంటూ, బోర్డులను గుడ్డతో తుడిచి, మరలా గ్రీసు లేదా ఆముదం పూయాలి. బోర్డులను పంట ప్రధాన పొలంలో నాటిన నాటి నుండి పంట చివరి వరకు ఉంచాలి. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి.

వీటి నివారణకు 5 శాతం వేప కషాయం లేదా నీమాస్త్రం లేదా 1 శాతం వేప నూనెను పంటపై వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి.

పశువుల పేడ + మూత్రం ద్రావణం లేదా జీవామృతాన్ని ప్రతి నెలా ఒకసారి మిరప పంటపై పిచికారీ చేయాలి.

ముడత తీవ్రత పొలంలో ఎక్కువగా ఉంటే ఒక సారి పొగాకు కషాయం లేదా అగ్ని అస్త్రం పిచికారీ చేసుకోవాలి.

సూచన:

అగ్నిఅస్త్రం లేదా పొగాకు కషాయం పంటపై పిచికారీ చేసిన 5 రోజుల వ్యవధిలో జీవామృతంగానీ, పశువుల పేడ + మూత్రం ద్రావణం గానీ పంటపై పిచికారీ చేస్తే పంట ఆరోగ్య వంతంగా ఉంటుంది. ఈ ద్రావణాలు పంటలకు రోగ నిరోధక శక్తిని కలిగించుటలో సహాయ పడతాయి. తెగుళ్ళ తీవ్రత నుంచి కూడా పంటలను కాపాడతాయి.

కౌలు రైతులకు రైతు భరోసా రావటంలో ఉన్న సమస్యల గురించి, వీలైనంత త్వరగా కౌలు రైతు గుర్తింపు కార్డు స్థానంలో వచ్చిన సి.సి.ఆర్‌.సి. (క్రాప్‌ కల్టివేటర్స్‌ రైట్స్‌ కార్డ్‌) ఇవ్వాలని, ప్రతి వాస్తవ సాగు దారునికి రైతు భరోసా అందే విధంగా చూడాలని, రైతు ఆత్మహత్య కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూశాఖ మంత్రి గారైన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ గారిని, అలాగే గిద్దలూరు శాసన సభ్యులు అన్నా రాంబాబు గారిని కలిసి వివరించాము. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి కన్న బాబు గారు ఈ రోజు సచివాలయంలో రాత్రి దాదాపు 8 గంటల సమయంలో మా టీమ్‌కు ఇచ్చిన సమయం, సమస్యలు విన్న విధానం కొంత సంతృప్తినిచ్చింది. కౌలు రైతుల సమస్యల గురించి, రైతు ఆత్మహత్య కుటుంబాల గురించి ఒక్కొక్క విషయం ఓపికగా వింటూ, ఏ మార్పులు తీసుకువస్తే ఎక్కువ మందికి మేలు జరుగుతుందని చెప్పిన ప్రతి విషయాన్ని నోట్‌ చేసుకుంటూ దానికి వారి వైపు నుండి వచ్చే సమస్యలు చెబుతూ వీలైనంత ఎక్కువ మందికి రైతు భరోసా వచ్చే విధంగా చూస్తామని చెప్పారు. పథకం అమలులో ఏ సమస్య వచ్చినా మీరు మా దృష్టికి తీసుకు రావచ్చని చెప్పారు. ఇక 2014 నుండి 2019 వరకు జరిగిన రైతు ఆత్మహత్య కుటుంబాల (గత ప్రభుత్వం) విచారణలో జరుగుతున్న తీవ్ర జాప్యం గురించి మంత్రి గారి దృష్టికి తీసుకువచ్చాము. వీలైనంత త్వరగా అన్ని రైతు ఆత్మహత్య కుటుంబాలకు న్యాయం చేస్తామని, దాని మీద ప్రత్యేకంగా ఒక రోజు వివరంగా చర్చిద్దామని చెప్పారు.

మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రుకునే మునక్కాడల రుచే. కానీ ఆఫ్రికన్‌ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం.

భూగోళం మీదున్న సమస్త పోషకాహార లోపాల్నీ సకల రోగాల్నీ నివారించడానికి మునగను మించినది లేదని రకరకాల అధ్యయనాల ద్వారా తెలుసుకున్న ఆఫ్రికా దేశాలు పోషకాహార లోపంతో బాధపడే తల్లులూ పిల్లలకు మందులతోబాటు మునగాకు పొడినీ బోనస్‌గా ఇస్తున్నాయి. అందుకే మునగాకు టీ తాగడం వల్ల మధుమేహం తగ్గిందనీ పొడి తినడం వల్ల పాలు బాగా పడ్డాయనీ చెప్పే ఆఫ్రికన్ల సంఖ్య కోకొల్లలు.

ఆనోటా ఈనోటా ఇది మనవరకూ వచ్చింది. ‘పెరటి చెట్టు వైద్యానికి పనికిరాద’న్నట్లు నిన్నమొన్నటివరకూ మనం మునగ చెట్టుని పెద్దగా పట్టించుకోలేదు. తలపైకెత్తి దానివైపే చూడలేదు- సాంబారులోకి నాలుగు కాయలు అవసరమైనప్పుడు తప్ప. కానీ అమెరికాకి చెందిన ‘ద ట్రీస్‌ ఫర్‌ లైఫ్‌’ స్వచ్ఛంద సంస్థ మునగ చెట్టులోని అణువణువూ ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. దానికి పలు అంతర్జాతీయ సంస్థలూ శృతి కలిపాయి. ప్రపంచ దేశాలకు ఆ సంజీవని గురించి కథలుగా చెప్పడం ప్రారంభించాయి.

ఐక్యరాజ్యసమితి కూడా మునగ ప్రాధాన్యతను గుర్తించి ఆ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. దాంతో మన దృష్టీ అటు మళ్లింది. న్యూట్రిషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ సి.గోపాలన్‌, డాక్టర్‌ కమలా కృష్ణస్వామిలు మునగాకు లోగుట్టుని విప్పారు. వారికి ఆయుర్వేద వైద్యులూ తోడయ్యారు. అంతా కలిసి మరీ ‘మునగ’ మహత్యాన్ని కొనియాడుతున్నారు.

ఏముంది మునగాకులో..?

‘బతికుంటే బలుసాకు తినొచ్చు’… ఓ పాత నానుడి. ఆ బలుసాకు ఏమోగానీ, ‘రోజూ కాస్త మునగాకు తింటే చాలు, వందేళ్లు బతకొచ్చు అన్నది కొత్త సామెత. ఎందుకంటే…

వంద గ్రా. తాజా మునగాకుల్లో… నారింజల్లోకన్నా ఏడు రెట్లు సి-విటమిన్‌, క్యారెట్లలోకన్నా నాలుగింతల కాల్షియం, అరటిపండ్లలోకన్నా మూడు రెట్లు పొటాషియం, పాలకూరలోకన్నా మూడింతల ఐరన్‌, బాదంలోకన్నా మూడు రెట్లు విటమిన్‌- ఇ, పెరుగులోకన్నా రెండింతల ప్రొటీన్లూ ఉంటాయి.

అంటే ఇరవై గ్రా.మునగాకు నుంచి మనిషికి నిత్యం అవసరమయ్యే ఎ,సి-విటమిన్లూ, వంద గ్రా.ఆకు నుంచి కాల్షియం, మూడొంతుల ఐరన్‌, సగం ప్రొటీన్లూ దొరుకుతాయి.

అందుకే పోషకాహార లోపాన్ని నివారించడానికి దీన్ని మించినది లేదు. అంతెందుకు… ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు లక్షల మంది విటమిన్‌-ఎ లోపం కారణంగానే అంధులవుతున్నారు. దీనికి మునగాకే మహత్తరమైన పరిష్కారం అంటున్నారు పోషక నిపుణులు.
ఆ కారణంతోనే క్యూబా అధ్యక్షుడు ఫిడేల్‌ క్యాస్ట్రో మునగ చెట్లను పెంచి, ఆ కాయల్ని రోజూ తినేవాడట. ‘ఒమేగా-3, 6, 9 ఫ్యాటీఆమ్లాలూ, సకల విటమిన్లూ, అన్ని రకాల అమైనో ఆమ్లాలు… మొత్తంగా 96 పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగ…పేదవాడి ఆహారం’ అంటూ దాని గొప్పతనం గురించి పత్రికల్లో వ్యాసాలూ రాశాడు క్యాస్ట్రో. ఇప్పుడు క్యూబా వాసులు మునగాకుని పండించి, పొడి చేసి విక్రయిస్తున్నారు. భారత్‌ కూడా మునగ ఆకుల పొడిని ఎగుమతి చేయడం ప్రారంభించింది. కానీ ఆకుని తినడం పట్ల ఇప్పటికీ మనదగ్గర అలసత్వమే.

నిజానికి ప్రాచీన కాలం నుంచీ ఆఫ్రికా దేశాల్లోనూ భారత్‌లోనూ తాజా మునగాకుల్ని తినే అలవాటు ఉంది. మధ్యలో మాయమై, మళ్లీ తెరమీదకొచ్చింది. టైమ్‌ మ్యాగజైన్‌ ‘ద నెక్స్ట్‌ క్వినోవా’గా అభివర్ణించింది. దాంతో పాశ్చాత్య దేశాల్లో ఎండిన ఆకుల పొడిని స్మూతీలూ సలాడ్ల మీద చల్లుకోవడం, టీ, సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకున్నారు.
ఎందుకంటే…

100 గ్రా. ఎండిన ఆకుల్లో… పాలల్లో కన్నా 17 రెట్లు కాల్షియం, అరటిపండ్లలోకన్నా 15 రెట్లు పొటాషియం, క్యారెట్లలోకన్నా 10 రెట్లు విటమిన్‌-ఎ, పాలకూరలోకన్నా 25 రెట్లు ఐరన్‌… ఇలా చాలా లభిస్తాయి.
మునగాకుని ఎండబెట్టి పొడి చేసుకునే తినాల్సిన అవసరం మనకి లేదు. తాజా మునగాకు పుష్కలం. ఒకప్పుడు శుభసూచకం కాదన్న కారణంతో పెరట్లో మునగ పెంచేవారు కాదు. కాలం మారింది. పట్టింపూ పోయింది. దాంతో కాయలకోసం చాలామందే పెంచుతున్నారు. కాబట్టి ఇతర ఆకుకూరల్లానే మునగాకుతో పప్పూ కూరలూ పచ్చళ్లూ పొడులూ రైస్‌ వెరైటీలూ కోఫ్తాలూ… అన్ని రకాలూ వండుకోవచ్చు. దోసెల్లో రొట్టెల్లో దట్టించినా రుచే. పొడిని టీ రూపంలో తాగొచ్చు, సూపుల్లో అన్నంలో కూరల్లో… ఎలా కావాలంటే అలా తినొచ్చు. అయితే ముదిరిన ఆకుల్లో పీచెక్కువ. కాబట్టి కుక్కర్‌లో ఉడికించాలన్నది నిపుణుల సలహా.

ఔషధగుణాలెన్నో…
మరే చెట్టు ఆకులకీ లేనంత మహత్తు మునగాకుకి ఉంది. ఇది 300 వ్యాధుల్ని నివారించగలదు. మునగాకులో రోగనిరోధకశక్తిని పెంచే 46 యాంటీఆక్సిడెంట్లూ అనేకానేక బయోయాక్టివ్‌ పదార్థాలూ ఉండటంతో శాస్త్రవేత్తలు దీనిమీద పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇందులోని ఓషధుల ప్రభావానికి శరీరంలోని బ్యాక్టీరియా, ఫంగస్‌లన్నీ పలాయన మంత్రం పఠిస్తాయి. క్యాన్సర్లూ అల్సర్లూ కనుచూపుమేర కనిపించవు. ఆల్జీమర్స్‌ ఎగిరిపోతుంది. బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్‌ దరి చేరడానికి భయపడతాయి. గాయాలన్నీ మునగాకు పేస్టుతో గాయబ్‌.

అంతేనా… రక్తహీనతతో బాధపడుతుంటే కాస్త వండిన మునగాకునో లేదా టీస్పూను పొడినో రోజూ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఐరన్‌ వృద్ధి, రక్తం సమృద్ధి. ఈరోజుల్లో పసివయసు దాటకుండానే కంటిజబ్బులనేకం. రేచీకటి బాధితులూ ఎక్కువే. వాటన్నింటినీ మునగాకులోని బీటాకెరోటిన్‌ నివారిస్తుందని ఇంటర్నేషనల్‌ ఐ ఫౌండేషన్‌ అంటోంది.

ఇంటాబయటా అంతటా ధూళిమేఘాలే… కాలుష్యకాసారాలే. మరి ఆస్తమా, బ్రాంకైటిస్‌, ట్యుబర్‌క్యులోసిస్‌ పిలవకుండానే పలుకుతున్నాయి. ఊపిరితిత్తుల్లో తిష్ట వేస్తున్నాయి. అందుకే ఆకుల్ని సూపులా చేసుకుని రోజుకి రెండుసార్లు తీసుకుంటే లంగ్సులోని టాక్సిన్లు తొలగి, ఆ వ్యాధులన్నీ పారిపోతాయి.
రజస్వలానంతరం అమ్మాయిలకి ఎన్ని కష్టాలో… కొందరిలో నెలసరి సమయంలో గడ్డలు పడుతుంటాయి. అప్పుడు ఆకులతో చేసిన సూపుని 21 రోజులపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే సరి. మునగాకు రసం తాగితే గర్భసంచి సాగకుండా ప్రసవం సులభంగా అవుతుంది. పాలుపడని బాలింతలకి కాసిని నీళ్లలో ఉప్పు, మునగాకులు వేసి కాసేపాగి ఆ నీటిని వంపేసి ఆకుల్ని నేతితో తినిపిస్తే ఫలితం ఉంటుంది. పొడి రూపంలో ఇచ్చినా పాలు పుష్కలమే.
డయేరియా, కామెర్లూ, కలరా బాధితుల బాధ కాదు. ఒకటే దాహం. నీరసం. అప్పుడు రోజుకి రెండుమూడుసార్లు గ్లాసు కొబ్బరినీళ్లలో టీస్పూను మునగాకు రసం, కొద్దిగా తేనె కలిపి తాగితే సరి. మూత్ర సమస్యలకీ మునగ బెస్ట్‌ మెడిసినే. ఆకుల్ని ముద్దలా చేసి క్యారెట్‌ రసంలో కలిపి పదిగంటలకోసారి తీసుకుంటే హానికర బాక్టీరియా, వైరస్‌లన్నీ తొలగిపోతాయి.

ఆకుల్ని కణతలకి రుద్దితే తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ ఆకుల రసాన్ని నిమ్మరసంతో కలిపి మొటిమలమచ్చలు, బ్లాక్‌హెడ్స్‌ మీద రాస్తే అవి మాయమై చర్మం మెరుస్తుంది. స్కర్వీ, చర్మవ్యాధులు, ఆందోళనలకి
మునగాకు టీ రుచికరమైన పరిష్కారం.

వహ్వా… మునక్కాడ!
సీజన్‌లో చిటారుకొమ్మ వరకూ చిగురు కనబడకుండా కాసిన కాయలు చూసేవాళ్లకి కన్నులపండగ అయితే, ఆ కాయల రుచి తెలిసినవాళ్లకి విందుభోజనమే. దక్షిణాదిన సాంబారు, పులుసు, అవియల్‌ వంటల్లో మునక్కాడ కనిపించాల్సిందే. ఇక, బియ్యప్పిండి, బెల్లం లేదా అల్లంవెల్లుల్లి వేసి వండే మునగగుజ్జు కూర ఎవరికైనా నోరూరాల్సిందే. మునక్కాడలతో పట్టే నిల్వ పచ్చడి మహారుచి. మటన్‌లో మునక్కాడ పడితే నాన్‌వెజ్‌ ప్రియులకి పండగే. ఆకులతో పోలిస్తే కాయల్లో పోషకాల శాతం తక్కువే. కానీ మిగిలిన కూరగాయలతో పోలిస్తే ఎక్కువే.
‘ఈ ఒక్క మునక్కాడ తినవూ బోలెడు బలం’ అంటూ బామ్మలు బతిమిలాడి తినిపించడం చాలామందికి అనుభవమే. తెలిసి చెప్పినా తెలియక చెప్పినా అది నిజమే. మునక్కాడల్లోని యాంటీబయోటిక్‌ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తే; కాల్షియం, ఐరన్‌లు ఎముకబలాన్నీ బరువునీ పెంచుతాయి. రక్తంలో చక్కెర శాతాన్నీ తగ్గిస్తాయి. పిత్తాశయం యమా జోష్‌గా పనిచేస్తుంది.

శస్త్రచికిత్సానంతరం మునగాకునీ, మునక్కాడలనీ తింటే త్వరగా కోలుకుంటారని చెప్పడం తెలిసిందే. దానిక్కారణం మరేంటో కాదు, మునక్కాడల్లోని ఐరన్‌వల్ల హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుందట. మునక్కాడల్ని మరిగించిన నీళ్లతో ఆవిరిపట్టడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలూ తగ్గుతాయి. వీటిని ఉడికించిన నీరు తాగితే చర్మం మెరుస్తుందట.

‘తరచూ జలుబు చేస్తోందా… జ్వరమొస్తోందా… అయితే రోజూ మునక్కాడలు తినండొహో’ అంటూ చాటింపు వేస్తున్నారు ఆధునిక వైద్యులు. వాటిల్లోని విటమిన్‌-సి జలుబూ ఫ్లూ జ్వరాలకి ట్యాబ్లెట్‌లా పనిచేస్తుందట. వీటిని ఎక్కువగా తినేవాళ్లకి పొట్టలో నులిపురుగుల బాధ ఉండదు. ఈ ముక్కలను ఉడికించిన సూప్‌ డయేరియాకి చక్కని నివారణోపాయం. కీళ్లనొప్పులయితే పరారే. కాలేయం, ప్లీహ సంబంధిత వ్యాధులన్నీ హాయ్‌ చెప్పడానికే సందేహిస్తాయి.
‘ఏమోయ్‌… ఇంకా పిల్లల్లేరా… అమ్మాయిని మునక్కాయ కూర వండమనోయ్‌…’ అని ఏ పెద్దాయనో అంటే సరదాగా తీసుకోవద్దు. వీటిల్లోని జింక్‌ స్త్రీ, పురుషుల్లో వంధ్యత్వాన్ని తగ్గిస్తుంది. వీర్యం చిక్కబడుతుంది.

నియాసిన్‌, రిబోఫ్లేవిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పైరిడాక్సిన్‌ వంటి బి-కాంప్లెక్స్‌ విటమిన్లు మునక్కాడల్లోనూ సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి సంక్లిష్ట పిండిపదార్థాలూ ప్రొటీన్లూ
జీర్ణమయ్యేలా చేస్తాయి.

ఏదేమైనా మునక్కాడలు ఎక్కువగా తినేవాళ్లలో రోగనిరోధకశక్తి ఎక్కువ. శ్వాససంబంధ సమస్యలు తక్కువ. వీటిల్లోని ప్రొటీన్లూ పీచూ కారణంగా పోషకాహార లోపమూ ఉండదు. నాడీవ్యవస్థా భేషుగ్గా పనిచేస్తుంది.

పూలు… తేనెలూరు..!
పచ్చదనంతో కళకళలాడే దీని ఆకులూ కాయలే కాదు, సువాసనభరితమైన తెల్లని పూలూ ఔషధ నిల్వలే. ఆయుర్వేద వైద్యంలో వాడదగ్గవే. పూలతో కాచిన కషాయం లేదా టీ పిల్లతల్లుల్లో పాలు బాగా పడేలా చేస్తుంది. ఇది మూత్రవ్యాధుల నివారణకూ దోహదపడుతుంది. ఈ పూలను మరిగించిన తేనీరు జలుబుకి మంచి మందు. కొన్ని ప్రాంతాల్లో ఈ పూలను సెనగపిండిలో ముంచి పకోడీల్లా వేస్తారు, కూరలూ చేస్తారు. మునగ పూలలో తేనె ఎక్కువ. దాంతో ఇవి తేనెటీగల్ని ఆకర్షించి, తేనె ఉత్పత్తికీ తోడ్పడతాయి.

విత్తనంతో నీటిశుద్ధి..!
విరగ్గాసిన కాయలు ఎండిపోయాయా… ఫరవాలేదు, ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. విటమిన్‌-సి పుష్కలంగా ఉండే వీటిని వేయించి పల్లీల్లా తినొచ్చు. నూనె తీయొచ్చు. దీన్ని వంటనూనెగానూ సౌందర్యసాధనంగానూ ల్యూబ్రికెంట్‌గానూ వాడుతుంటారు.
రక్షిత నీటి పథకాలు కరవైన ప్రాంతాలకు మునగ విత్తనాలే నీటిశుద్ధి పరికరాలు. కఠిన జలాల్ని సైతం ఈ గింజలు ఉప్పు లేకుండా తేటగా మారుస్తాయి. సూడాన్‌, ఇండొనేషియా వాసులు ఆ కారణంతోనే విత్తనాలను ప్రత్యేకంగా సేకరించి, ఆ గింజల్ని పొడిలా చేసి, కప్పు నీళ్లలో కలిపి, వడగడతారు. ఇప్పుడు ఈ నీళ్లను బిందెలోని నీళ్లలో కలిపి, ఓ ఐదు నిమిషాలు గరిటెతో కలుపుతారు. తరవాత ఓ గంటసేపు కదపకుండా ఉంచితే మలినాలన్నీ కింద పేరుకుని పైనున్న నీరంతా తేటగా అవుతుంది. వీటిని విడిగా పాత్రలో పోసుకుని తాగుతారు. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ పొడి కలిపిన ద్రవాన్ని నీటిలో కలపగానే అది పాలీ ఎలక్ట్రోలైట్‌గా పనిచేసి నీటిలోని మలినాలను అయాన్లుగా మార్చడం ద్వారా వాటిని ఆకర్షించి కింద పేరుకునేలా చేస్తుంది.ఇంకా… ఇంకా…!
మునగాకు మనుషులకే కాదు, పశువులకీ బలవర్థకమైనదే. పశువుల మేతగానూ పంటలకు ఎరువుగానూ వాడతారు. చెట్టు కాండం నుంచి వచ్చే గుజ్జుని కాగితం తయారీకి వాడతారు. ఆగ్రో ఫారెస్ట్రీకి మునగ చక్కగా సరిపోతుంది. పెద్దగా నీడ ఉండని ఈ చెట్ల మధ్యలో ఇతర పంటల్నీ వేసుకోవచ్చు. ఈ మొక్కల్ని కంచెలానూ పెంచవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీన్ని పెంచుతున్నా మునగ పంటలో మనదేశమే ఫస్ట్‌. ఏటా 13 లక్షల టన్నుల కాయల్ని పండిస్తున్నాం. రాష్ట్రాలకొస్తే ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మునగ ఉత్పత్తుల విలువ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.27వేల కోట్లు. వాటిల్లో 80 శాతం మనవే. కాయలతోబాటు పొడినీ
ఎగుమతి చేస్తున్నాం. కాయల్ని శీతలీకరించి చక్కెరపాకంలో వేసి ఎగుమతి చేస్తారు.
మునగలో రకాలనేకం. కుండీల్లో కాసే హైబ్రిడ్‌ రకాలూ ఉన్నాయి. జాఫ్నా రకం కాయలు 60 నుంచి 120 సెం.మీ. వరకూ కాస్తే, ఆరునెలలకే పూతొచ్చి, కాయలు కాసే కెఎం-1, పీకేఎం-1, పీకెఎం-2, పీఏవీఎం రకాలూ వస్తున్నాయి. నేలతీరు, వాతావరణాన్ని బట్టి ఆయా రకాలని ఎంపికచేసుకుని ఈ చెట్లను పెంచి ఎకరాకి కనీసం లక్ష రూపాయల లాభాన్ని పొందుతున్నారు రైతులు. వ్యవసాయపరంగానే కాదు,
ఇంటి అవసరాలకోసం పెరట్లోనో లేదంటే కుండీల్లోనో మునగను పెంచితే, రోజూ ఓ గుప్పెడు తాజా ఆకుల్ని కూరల్లో వేస్తే మీ ఆహారంలో సూపర్‌ఫుడ్‌ చేరినట్లే, మీకు డాక్టరుతో పనిలేనట్లే..!

మునగ గురించి ఇంతటి సమగ్రమైన సమాచారం అందించిన వారికి కృతజ్ఞతలు.

వ్యవసాయం ఎలా వుండాలి, వ్యవసాయంలో అభివృద్ధి, ఆధునికత అంటే ఏమిటి, ఎలాంటి వ్యవసాయం రైతుల సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది, ఎలాంటి ఆధునిక సాంకేతికత వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతుంది, ఎలాంటి వ్యవసాయం రైతులకు ఆహార భద్రత సమకూర్చుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం చాలా కష్టమైన విషయం. అన్ని రంగాలలో వున్నట్టే ఈ రంగంలోనూ అభివృద్ధి గురించి భిన్నమైన దృక్పధాలు, విభిన్నమైన ఆలోచనలు వున్నాయి. ఈ భిన్న-భిన్న దృక్పధాలనూ, ఆలోచనలనూ ప్రతిబింబిస్తూ అనేక వాదనలు, ప్రతివాదనలు పుట్టుకువస్తున్నాయి. ఇవన్నీ కలిసి సామాన్య రైతును మరింత అయోమయానికి గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితులలో ఎలాంటి వ్యవసాయ పద్ధతులు అవలంభించాలి, తమ పంట పొలాలను, తమ జీవితాలను, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇలాంటి విషయాలపై నిర్ణయాలు తీసుకునేముందు వేటికి ప్రాముఖ్యత ఇవ్వాలి, అలాగే వివిధ విధానాలు, పద్ధతుల మధ్యలో తేడాలు, అలాగే ప్రచారం లో వున్న కొన్ని అపోహలు లాంటి విషయాలపై స్పష్టమైన అవగాహన కలిగించటం ఈ వ్యాసం ముఖ్య వుద్దేశం.

ఆధునిక వ్యవసాయం: ఆధునిక పద్ధతులన్నీ ఏ స్థాయి రైతుకైనా, ఏ ప్రాంత రైతులకైనా, ఏ పరిస్థితులకైనా ఒక్కలాగానే పని చేస్తాయనే భావన అధునిక వ్యవసాయం ప్రధాన లక్షణం. అలాగే ఆధునిక వ్యవసాయం మనం పండించే పంటకు మిగతా జీవాలన్నిటినీ పోటీగా భావిస్తుంది. దాంతో వేరే మొక్కలని (చివరికి అదే పంటకు చెందిన వేరే రకాలైనా) కలుపుగా భావిస్తుంది.  ఒకే పంట ను అధిక విస్తీర్ణంలో, పంటలో కూడా ఒకే రకాన్ని ఎక్కువ విస్తీర్ణంలో పండించటం వలన జీవ వైవిధ్యం దెబ్బ తినటంతో పాటు పురుగుల, తెగుళ్ళ సమస్య పెరుగుతుంది. పంట మీద వుండే పురుగులన్నిటినీ శత్రువులుగా చూడటం వలన వాటిని చంపే ప్రయత్నంలో వాడే రసాయనాలు కలుపును, పురుగులనే కాక అనేక ఉపయోగపడే మొక్కలను, కీటకాలను ఇతర జీవాలను అంతం చేస్తున్నాయి. ఒకప్పుడు పిట్టల కిలకిలారావాలతో కళకళ లాడే ఊర్లు ఇప్పుడు నిశ్శబ్ధమైపోయాయి. కందిరీగలు, తేనెటీగలు, కన్పించటం లేదు. ఇవి పోతే పోయాయి, కనీసం పంటలు బాగున్నాయా అంటే అదీ లేదు.

ప్రకృతిలో సమతుల్యత దెబ్బతినటంతో చీడపీడల సమస్యలు అధికమయ్యాయి. ఈ పోటీ అనేక కొత్త రసాయనాలను మార్కెట్టులోకి తెస్తుంది. అవి వచ్చినంత త్వరగానే నిరుపయోగంగా మారిపోతున్నాయి. ఎంచుకునే ఒత్తిడి (సెలెక్షన్‌ ప్రెషర్‌) పెరిగి అవి తొందరగా తట్టుకునే శక్తిని పెంచుకుంటున్నాయి. ఈ రసాయనాలు, ఇంకా రసాయనిక ఎరువుల వాడకంతో నేలలోని సూక్ష్మజీవులు చనిపోయి, సహజంగా ప్రకృతి నుంచి లభించే పోషకాలు మొక్కలకు అందకుండా పోతున్నాయి. నేలలోని సేంద్రియ పదార్దాల పాలు తగ్గటంతో మట్టిలో తేమను పట్టివుంచే గుణం తగ్గుతోంది. దీనికి తోడు వర్షాలు సరిగ్గా పడక పోవటం, భూగర్భ జలాలు అడుగంటి పోవటం వంటి సమస్యలతో పాటు, ఈ రసాయనాల అవశేషాలు మట్టి భౌతిక, రసాయనిక లక్షణాలను కూడా పాడు చేసి పొలాలను బీడుగా మారుస్తున్నాయి. వీటన్నిటికీ తోడు ఈ రసాయనాల కొనుగోళ్ళతో ఖర్చు అధికంగా పెరిగి రైతులకు అప్పుల భారం ఒక వైపు తోడై, సరైన గిట్టుబాటు ధర లభించక నష్టాల భారం ఇంకొక వైపు తోడై, ఆవేశంలో దాడులు చేయటం లేకపోతే నిరాశలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులకు దారితీస్తున్నాయి.

విదేశాలలో ఇలాంటి వ్యవసాయం బాగా జరుగుతుంది కదా! అలాంటివ్యవసాయ పద్ధతులను అవలంబిస్తేనే  దేశ ఆహార భధ్రత కల్పించగలుగుతమని ప్రభుత్వ, శాస్త్ర వేత్తల వాదన. అయితే అది మనకు ఎంత ఉపయోగం? మన పరిస్థితులకు ఎంత అనుగుణం అని అర్థం చేసుకోవాలంటే…అమెరికా వ్యవసాయ రంగ పరిస్థితిని మనం సమీక్షించుకోవాలి. మనకు లాభసాటి అని చెప్పబడుతున్న అమెరికా వ్యవసాయం…పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో నడుస్తుంది.  ఎకరానికి సుమారుగా రెండు లక్షల రూపాయల సబ్సిడీ అందుతుంది. మన దగ్గర మహా అయితే ఐదు వేల రూపాయలు అదీ ఎరువుల సబ్సిడీ రూపంలో… రసాయనిక ఎరువులు వాడని వారికి అది కూడా దొరకదు. ఖర్చుల విషయం చెప్పకుండా కేవలం సాంకేతిక అభివృద్ధి అనే పేరుతో, దేశ ఆహార భద్రత పేరుతో ఈ పద్ధతులను ప్రోత్సహించటం వలన, వున్న కొద్దిపాటి సబ్సిడీలు ఇటువంటి పద్ధతులకే ఇవ్వటం వలన రైతులంతా రసాయనిక వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు.

సాంప్రదాయ వ్యవసాయం: ఆధునిక వ్యవసాయానికి ఎంత ప్రచారం కల్పించినప్పటికీ వనరులు సమృద్ధిగా వున్న ప్రాంతాలకూ, పొలాలకూ, రైతులకూ పరిమితం అయిపోయింది.  వర్షాధార ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో, చిన్న సన్నకారు రైతులు ఇంకా చాలా మంది పాత పద్ధతులతోనే వ్యవసాయం చేస్తున్నారు. ఆధునిక వ్యవసాయం ఈ పరిస్థితులకు అనుగుణంగా పద్ధతులను అభివృద్ధి చేయటానికి ఉపయోగపడక, విదేశీ విజ్ఞానం పేరుతో ఇక్కడి జీవావరణానికి, రైతుల ఆర్ధిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేని ఆధునిక సాంకేతిక పద్ధతులను ప్రవేశ పెట్టటానికి ప్రయత్నం చేసింది. ఉత్పాదకాల కోసం మార్కెట్‌ మీద ఆధార పడటం ఎక్కువ అవటంతో అధునిక పద్ధతులు అవలంభించిన రైతులు మొదట్లో లాభాలు గడించినా, క్రమేపీ ఎక్కువగానే నష్టపోయారు. అయితే సాంప్రదాయిక పద్ధతులలో దిగుబడులు తక్కువ వుండటం, సాంప్రదాయక పంటలకు మార్కెట్లో డిమాండ్‌ లేకపోవటంతో రైతుల పరిస్థితులు బాగుపడటం లేదు. చాలా ప్రాంతాలలో ఇవి కేవలం అక్కడి స్థానిక ఆహార అవసారాలను కొంత మటుకు తీర్చటానికి పరిమితమై పోయాయి.

ఆధునిక వ్యవసాయ పద్ధతులలోని నష్టాలు, పర్యావరణానికి కలుగుతున్న ముప్పు, ఆరోగ్యానికి కలుగుతున్న హాని గుర్తెరిగి, రసాయనిక పదార్ధాల స్థానంలో సేంద్రీయ పదార్ధాల వినియోగాన్ని పెంచుకునే దిశలో ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు. దీనికి తోడు వినియోగదారులలో ఆహార పదార్ధాలలో ఆధునిక రసాయనాల అవశేషాల పట్ల వ్యక్తమవుతున్న వ్యతిరేకత ఈ పద్ధతులకు ప్రాముఖ్యత కలిగిస్తోంది. అయితే, వినియోగదారులలో వీటి వైపు పెరుగుతున్న ఆదరణ చూసి, ఈ పద్ధతులను నియంత్రించటానికి పశ్చిమ దేశాల్లో ఇప్పటికే ఆధునిక సూపర్‌ మార్కెట్లు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఏ పద్ధతులు అవలంభించవచ్చు, ఏవి అవలంభించకూడదు, అన్న వాటిపై ప్రమాణాల పేరుతో నియంత్రణ సాధించటానికి సర్టిఫికేషన్‌ పేరుతో ప్రయత్నం చేస్తున్నాయి. అయితే సేంద్రియ పద్ధతులలో వున్న ఉపయోగాలు గుర్తించి, ఈ మార్కెట్‌ ప్రమాణాలనుంచి, రైతులు తమ ప్రమాణాలను నిర్దేశించుకునే దిశగా కొన్ని సంఘాలు ప్రయత్నాలు ప్రారంభించాయి.

సహజ వ్యవసాయం: జపాన్‌కు చెందిన ”ముసనోబు ఫుకువోకా” ప్రారంభించిన ఒక ఉద్యమం ఈ సహజ వ్యవసాయం.  ప్రకృతిలోని సహజత్వాన్ని ఎక్కువ మార్పు లేకుండా చేసే పద్ధతులతో చేసే వ్యవసాయం. అయితే ఇది కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైపోయింది.

జీరో బడ్జెట్‌ సహజ వ్యవసాయం: మహారాష్ట్రకు చెందిన సుభాష్‌ పాలేకర్‌గారు ప్రారంభించిన ఈ ఉద్యమం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. మహారాష్ట్ర లో దభోల్కర్‌ ప్రారంభించిన ఉద్యమం లోనుంచి పుట్టిన అనేక ప్రత్యామ్నాయ పద్ధతులలో ఇది ఒకటి. ఆవు పేడ, మూత్రం, వేపాకులు లాంటి స్థానిక వనరులు వాడి చేసుకునే అనేక రకాల ఉత్పత్తులతో పంటలను పండించుకోవటం ఇందులో ప్రధాన విధానం. వీటితో పాటు నేలను కప్పి ఉంచటానికి అచ్చాధం (మల్చింగ్‌), చిన్న మడులలో బహుళ పంటల విధానం ఇందులో ముఖ్య మైన అంశాలు.

పెర్మాకల్చర్‌: పెర్మనెంట్‌-అగ్రికల్చర్‌ అనే రెండు ఆంగ్ల పదాల కలయికతో ఏర్పడిన పదం. పొలాన్ని ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా డిజైన్‌ చేయటం ఇందులోని ప్రత్యేకత.

బయో-డైనమిక్‌ వ్యవసాయం: స్విట్జర్లాండ్‌కు చెందిన రుడోల్ఫ్‌ స్టినేర్‌ గ్రహాల గమనాన్ని బట్టి పంటలు వేసుకునే విధానాల్ని, కొన్ని ప్రకియల ద్వారా వ్యవసాయంలో వాడే నీరు, విత్తనాలలో కాస్మిక్‌ ఎనర్జీ వచ్చేలా చేయటం, పంట వ్యర్దాల్ని, పశు వ్యర్థాల్ని వాడుకొని కంపోస్ట్‌ చేసి వాడుకోవటానికి కొన్ని కొత్త పద్దతులు కనిపెట్టారు.   

సుస్థిర వ్యవసాయం:  ఆధునిక వ్యవసాయంలోని లోటు పాట్లు, సమస్యలను అధిగమించటానికి, సాంప్రదాయకంగా రైతుల వద్ద వున్న జ్ఞానం అందించిన ఆలోచనలను జోడించి, స్థానిక వనరుల మీద, స్థానిక జీవావరణం మీద ఆధారపడి చేసే వ్యవసాయం ఆర్ధికంగా, పర్యవరణ పరంగా వ్యవసాయాన్ని సుస్థిరత్వం చేస్తుంది. సహజ వనరులైన, గాలి, నీరు, మట్టి లోని జీవరాశులకు నష్టం కలుగకుండా, పొలం స్థాయిలో, పరిస్థితుల కనుగుణంగా  రైతు స్థాయిలో, రైతు బృందాల స్థాయి లో, గ్రామస్థాయిలో… ఈ వనరులను సమీకరించుకోవటం పై కేంద్రీకరించటం ఈ రకమైన విధానాలలో ముఖ్యాంశం.

ప్రస్తుతం మార్కెట్‌ పై ఆధారపడే చాలా వనరులను రైతులు తమ విజ్ఞానం, నైపుణ్యత, శ్రమ, ప్రకృతిలో లభించే వనరులతో, సహజ ప్రక్రియలను పునరిద్ధరించటం ద్వారా వాడుకోవచ్చు.

ఆధునిక వ్యవసాయంలో రైతులు తమ విజ్ఞానం అంతా కోల్పోయి, కేవలం మార్కెట్‌, పత్రికలు, శాస్త్రవేత్తలు అందించే సమాచారంతో మార్కెట్లో దొరికే వస్తువులు కొనుక్కుని వాడుకునే వినియోగదారులుగా మిగిలిపోతున్నారు.  సుస్థిర వ్యవసాయం లో ఈ పద్ధతులకు స్వస్తి చెప్పి, తమ విజ్ఞానాన్ని పెంచుకుని, తమ వనరులపై ఆధారపడి వ్యవసాయం చేసుకునే పరిస్థితులలోకి చేరవచ్చు.

సుస్థిర వ్యవసాయానికి ప్రధాన సూత్రాలు 

పంటలు, విత్తనాలు: తమ పొలాలకి, వనరులకి, ఎలాంటి పంటలు, విత్తనాలు, రకాలు సరిపోతాయి అన్నది అర్ధం చేసుకొని ఎంపిక చేసుకోవడం, మార్కెట్‌ పై ఆధారపడకుండా జన్యు వైవిధ్యం పాటిస్తూ తమ విత్తనాలు తామే సేకరించి వాడుకోవటం. ఉదా: పత్తి పంటలో వర్షాధార ప్రాంతాలలో, లోతు తక్కువున్న ప్రాంతాలలో హైబ్రీడులకు బదులు సూటి రకాలు తక్కువ దూరం తో నాటుకొని (ఎకరానికి ఎక్కువ మొక్కలు వచ్చేలా) తక్కువ కాలం లోనే మంచి పంట సాధించు కోవచ్చు  

భూమిలో పోషకాలు: సుస్థిర వ్యవసాయం కేవలం పంట మీదనే  కాక మట్టి స్వభావాన్ని పెంచటం పై దృష్టి పెడుతుంది. సేంద్రియ ఎరువుల వాడకం, మట్టిలోని సూక్ష్మజీవుల సహకారం, ఆధునిక కంపోస్టింగు ప్రక్రియల వాడకం చేయవచ్చు. అన్ని పద్దతులలోనూ ముఖ్యమైనది నేలలో సేంద్రియ పదార్థాలను పెంచటం. కనీసం ఎకరానికి రెండు నుంచి నాలుగు టన్నుల వరకు జీవ పదార్థాలను ప్రతి సంవత్సరం నేలకు అందించాలి. దీనికోసం పంట వ్యర్ధాలను, పచ్చిరొట్ట ఎరువులను వాడుకోవచ్చు. అలాగే నేలలో వుండే పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తెచ్చేందుకు వివిధ సూక్ష్మ జీవుల సహకారం తీసుకుంటుంది. అయితే పైన చెప్పిన పద్ధతులన్నిటిలోనూ వాడే వుత్పదకాలన్నీ కూడా స్థానికంగా దొరికే మొక్కల భాగాలు వాడుకొని తయారు చేసే కాషాయాలు, పశువుల పేడ-మూత్రం పులియ పెట్టి తయారు చేసే ద్రావనాలుగా వాడుకునేవే.

నీటి యాజమాన్యం: సుస్థిర వ్యవసాయం నేలలో తేమను రక్షించుకోవటానికి వివిధ పద్ధతులు, నేలలో సేంద్రీయ పదార్ధాల పెంపు, భూమి కప్పి వుంచే పంటలు, మల్చింగ్‌, పంటల ఎంపిక, విధానాలలో మార్పు అనుసరిస్తుంది. 

పురుగుల యాజమాన్యం: రసాయనిక పురుగు మందులను పూర్తిగా మానివేయటం, పురుగులు ఎప్పుడు సమస్యగా మారతాయో అర్ధం చేసుకోవటం, పురుగు వివిధ దశలు అర్ధం చేసుకొని, ఏ దశలో ఎలాంటి చర్యలు చేపట్టి పురుగులు సమస్యగా మారకుండా వుంచుకోవచ్చో అర్ధం చేసుకుని పాటించటం, నష్టం కలుగ చేసే స్థాయిలోనే నివారణ చర్యలు చేపట్టటం, ప్రకృతిలో వున్న సమతుల్యాన్ని కాపాడు కోవటం, పురుగు ఉధృతి ఎక్కువైతే స్థానిక వనరులు వుపయోగించి నివారణ చర్యలు చేపట్టటం, సహజ ప్రక్రియలను సమర్ధవంతంగా వినియోగించుకోవటం.

ఖర్చు: స్థానిక వనరులపై ఆధారపడటం వలన ఖర్చు తక్కువ, నష్టం కలుగచేసే స్థాయిలోనే నివారణ చర్యలు వల్ల మార్కెట్‌ ఆటు పోట్లను కొంతవరకూ తట్టుకోగలగటం.

ఈ రకమైన మార్పు నిజమైన ఆధునికత అవుతుంది.  రైతులు తమపై తాము నమ్మకం పెంచుకొని చేసే వ్యవసాయంతో లాభసాటి కావటమే కాక, పర్యావరణానికి కలిగే నష్టాలను తగ్గిస్తుంది.

1. సుస్థిర వ్యవసాయానికి కావలిసిన వనరులున్నాయా?

కేవలం పేడ వాడి పంటలు పండించగలుగుతమా? దేశ అవసరాలు తీరుస్తాయా? అసలు కావలసినంత పేడ వుందా?

ఒక సారి మన దేశం లో వాడ బడుతున్న రసాయనిక ఎరువుల సంగతి చూద్దాం… గత సంవత్సరంలో వినియోగం సుమారు 250 లక్షల టన్నులు.  వీటిల్లో నత్రజని, భాస్వరము, పొటాష్‌ (యన్‌.పి.కె.)లు తీసుకుంటే 170 లక్షల టన్నులు. వీటి వాడక సామర్ధ్యం 50% కంటే తక్కువ. అంటే దీంట్లో కేవలం 90 లక్షల టన్నుల  కంటే తక్కువే మొక్కలకి ఉపయోగ పడతాయి. మిగిలింది అంతా భూగర్భ జలాలను, భూములను నాశనం చేస్తాయి. దీనికి తోడు మనం అడగాల్సిన ఇంకో ప్రశ్న పెట్రోల్‌ ఉత్పత్తుల మీదా, భూగర్భ ఖనిజాల పైనా ఆధార పడిన ఈ రసాయనిక ఎరువులు మనకి ఇంకా ఎంత కాలం అందుబాటు లో వుంటాయి?  ఇప్పుడు వాడుతున్నట్టు గానే వాడితే పెట్రోలియం నిలువలు ఇంకో యాభై అరవై సంవత్సరాలలో, పొటాష్‌ నిలువలు ఇంకో ముప్పై నలభై సంవత్సరాలలో అయిపోతాయి..ఆ తర్వాత అయినా మనం మారాల్సిందే!

2. దేశీ ఆవు లేకపోతే సేంద్రియ వ్యవసాయం చేయలేమా?

మనం తరచూ వినే మాట, దేశీ ఆవు పేడ మాత్రమే వాడాలని దానితో మిగతా జీవాలు వున్నా వుపయోగపడవేమో అని చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయానికి మారటానికి భయపడుతున్నారు. నిజానికి ఆవు అయినా, గేదె అయినా.. గడ్డి, పచ్చి రొట్టల మీద ఎక్కువగా ఆధార పడినవైతే వాటి పేడని రైతులు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. కాకపోతే కష్టమైన వాతావరణంలో కూడా దేశీ ఆవు తట్టుకుంటుంది కాబట్టి కొత్తగా పశువులు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు దేశీ అవును కొనుక్కుంటే మంచిది.

3. సేంద్రియ వ్యవసాయం రసాయనిక వ్యవసాయం కంటే ప్రమాదకరమా?

ఈ మధ్య కొంత మంది సహజ వ్యవసాయ ఉద్యమం లో వున్న వాళ్ళు.. ముఖ్యం గా సుభాష్‌ పాలేకర్‌ గారి శిష్యులు సేంద్రియ వ్యవసాయం రసాయనిక వ్యవసాయం కంటే ప్రమాదకరం అని ప్రచారం చేస్తున్నారు. ఇది శుద్ధ తప్పు. వారి భయాలకు, అపోహలకు రెండు ప్రధాన కారణాలు. వారు చెప్పేది… సేంద్రియ వ్యవసాయం పేరుతో కంపెనీ లు తమ జీవ ఉత్పత్తులను అమ్ముకుంటున్నాయి అని. ఇది కొంత వరకు నిజమే కానీ దేశంలో తొంబై తొమ్మిది శాతం సేంద్రియ రైతులు తమ సొంత ఉత్పాదకాలే చేసుకుంటున్నారు.

రెండవది.. వర్మి కంపోస్ట్‌ (వాన పాముల ఎరువు) భూమిలో భార లోహాలు పెంచుతుంది అనీ, వీటి కోసం వాడే విదేశీ వానపాములు అత్యంత ప్రమాదకరం అనీ. ఇది కూడా పూర్తిగా అపోహే… వానపాములలో భూమి పైన పాకేవి, భూమి లోపలికి తొలుచుకొని వెళ్ళేవి – రెండు రకాలవి వుంటాయి. భూమిలోకి తొలుచుకు వెళ్ళే వాటిని వాడితే కంపోస్ట్‌ గుంత లోనుంచి భూమి లోకి వెళ్లి పోతాయి కాబట్టి పైన పాకే వాటిని వాడతారు. మన దేశంలో సుమారు మూడు వందల రకాల వాన పాములు వున్నాయి…అందులో కొన్ని పైన పాకేవి, ఇంకొన్ని భూమి లోకి తొలుచుకు వెళ్ళేవి. ఈ వానపాములు భార లోహాలు పెంచుతాయి అన్నది కూడా పెద్ద అపోహే. పంట వ్యర్థాలలోని భార లోహాలే కంపోస్ట్‌ లోకి వస్తాయి. కానీ వానపాములు కొత్తగా తయారు చేయవు. పంట వ్యర్ధాలు కంపోస్ట్‌ గా మరే క్రమం లో మొత్తం పరిమాణం బాగా తగ్గుతుంది కాబట్టి భార లోహాల మోతాదు కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది అంతే. కంపోస్ట్‌ చేయకుండా మల్చింగ్‌ చేసినా లేక భూమిలో కలిపినా ఇదే జరుగుతుంది. 

సేంద్రీయ పద్ధతులలో పేడను కేవలం నత్రజని, భాస్వరము, పొటాష్‌ అందించే రసాయన పదార్ధంగా చూడకుండా, గాలి నుంచీ నత్రజని మొదలైన వాయువులను నైట్రేట్ల రూపంలో స్థిరీకరించే సూక్ష్మ జీవులను అందించే వనరుగా చూస్తాం. ఈ సూక్ష్మ జీవులు పశువుల కడుపులో వుంటూ అవి తినే ఆకులూ, కొమ్మలను జీర్ణం చేసుకోవటంలో సహాయం చేస్తాయి.  వీటిని వాడినప్పుడు భూమిలో కూడా అటువంటి పనే చేస్తాయి.. దానికితోడు భూమిలో వుండి అందుబాటులో లేని భాస్వరం లాంటి పోషకాలను అందుబాటులోకి తెస్తాయి. అయినా కేవలం నత్రజని, భాస్వరము, పొటాష్‌ల గురించి ఆలోచించినా, దేశం లో పంట మిగులు, పశువుల పేడ రూపంలో చాలానే దొరుకుతాయి.

అయితే ఇవి సేకరించటంలో సమస్యలు-ఖర్చులు-శ్రమ వున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం రసాయనిక ఎరువుల మీద పెడుతున్న 60 వేల కోట్ల సబ్సిడీలో (2009 లో అది 120 వేల కోట్లు వున్నది. అప్పటినుంచి భారాన్ని రైతుల మీదకు మార్చారు)లో కొంత భాగాన్ని రైతులకు నేరుగా సబ్సిడీల రూపం లో అందించవచ్చు.

వనరులు పరిమాణం (సంవత్సరానికి)యన్‌.పి.కె రూపంలో
రసాయనిక ఎరువులు240 లక్షల టన్నులు170 లక్షల టన్నులు
పంట మిగులు3000 లక్షల టన్నులు62.0 లక్షల టన్నులు
పశువుల పేడ3200 లక్షల టన్నులు112.0 లక్షల టన్నులు
పట్టణాల వ్యర్దం5161 (గ్రామాలూ/పట్టణాలు) నుండి 400 లక్షల టన్నులు ఇందులో 40 శాతం సేంద్రీయ పదార్థం వుంటుంది6.0  లక్షల టన్నులు

పచ్చి బొప్పాయి కాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి పొలం గట్లపై చల్లాలి. ఎకరానికి నాలుగు పచ్చి బొప్పాయి కాయలు సరిపోతాయి. వీటిలోని ఒక రసాయనం ఎలుక నోటి కండరాలకు హాని కలిగిస్తుంది.

 ఎలుక వికర్షకాలైన జిల్లేడు, పసుపు, ఆముదం మొక్కలను పొలం గట్లపై నాటితే వాటి బాధ నివారణ అవుతుంది.

 పొలం గట్లపై ఇంగ్లీషు తుమ్మ లేదా స్క్రూ పైన్‌ వంటి ముళ్ళ కంపను పరిస్తే వాటిపై సంచరించిన ఎలుకల ఉదర భాగాలు చీరుకుపోతాయి. అవి వాటికి సంచార నిరోధకంగా ఉపయోగపడతాయి.

 సిమెంట్‌ను, మైదా పిండిని సమభాగాల్లో కలిపి పొట్లాలు కట్టి కలుగుల వద్ద ఉంచితే అవి తిన్న ఎలుకల నోటి భాగాలు పిడచగట్టుకపోయి నశిస్తాయి.

 కొబ్బరి లేదా తాటి గెలల జవటలను పాము ఆకారంలో మలిచి గట్లపై అమరిస్తే ఎలుకల బాధ నివారణ అవుతుంది.

తూటాకు కాడలు రెండు మూడు కిలోలు సేకరించి మూడు లీటర్ల నీటిలో 30 నిమిషాలు మరిగించి వడపోయాలి. ఆ ద్రావణంలో రెండు మూడు కిలోల జొన్నలు కలిపి మరో 30 నిమిషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత ఆ జొన్న విత్తనాలను ఎలుకల బొరియల్లో వేయాలి. జొన్న గింజలను తిన్న ఎలుకలు మరణిస్తాయి.

ఎండు మిర్చిని కలుగుల్లో వేసి అగ్గిపుల్ల వెలిగించి మూసి ఊదరబెట్టాలి.

మట్టికుండను ఎండుగడ్డితో నింపి నీరు చిలకరించాలి. కుండ అడుగు భాగాన రంధ్రం చేసి కలుగుపై కుండను బోర్లించి పై రంధ్రం ద్వారా కుండలోని గడ్డిని నిప్పుతో రగిలించాలి. సదరు రంధ్రాన్ని తడి మట్టితో కప్పి కుండనుంచి పొగ బయటకు పోకుండా ఎలుక బొరియల్లోకి పోయేలా ఊదరబెట్టాలి. కుండనుంచి వచ్చే పొగ బొరియ అంతటా వ్యాపించి ఎలుకలకు ఊపిరాడకుండా చేస్తుంది. అత్యవసరమార్గం ద్వారా బొరియ నుంచి ఎలుక బయటకు వచ్చి గిల గిలా కొట్టుకొని చనిపోవడం ఒక్కోసారి జరుగుతుంది.

పురుగు మందులా?…. పురుగు విషాలా ?

పేరులో ఏముంది… పురుగు మందులా ?  విషాలా ?

‘పురుగు మందులు’ చాలా ఘాటైన, తీవ్రత కలిగిన రసాయనాలు. అవి చాలా విషపూరితమైనవి. అనేక రకాలైన ప్రాణులను చంపగలిగే శక్తి ఉంటుంది. పంటపై వచ్చే పురుగులనే కాక చాలా పెద్ద జీవాలైన మనుషులను, గొడ్లను, పక్షులను చంపే శక్తి కలవి. ఇటువంటి విషాలను ‘మందులు’గా పిలుస్తుండటం వల్ల చాలా మంది వీటిని అభ్యంతరం లేకుండా విస్తారంగా వాడుతున్నారు. 

పురుగు విషాల వాడకంతో సమస్యలు :

మొదటిగా పురుగు విషాలు చల్లేవారు వీటి యొక్క ప్రభావానికి ఎక్కువ గురవుతుంటారు. చల్లిన పురుగు మందు చెదురుతూ చర్మం ద్వారా శరీరంలోకి చేరుతుంది. లేదా నోటి ద్వారా, పీల్చిన గాలి ద్వారా ఊపిరితిత్తులలోకి వెళ్ళి రక్తంలో కలుస్తుంది. వీటి ప్రభావం వెంటనే నాడి వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఫలితంగా కళ్ళు తిరగటం, మూర్చపోవటం, చమట పోయడం సంభవిస్తుంది. చాలాసార్లు వెంటనే చనిపోతారుకూడా. ఒకవేళ వెంటనే చనిపోకపోయినా ఒంట్లో చేరిన విషం జీవితాంతం ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ విషాలు శరీరంలోని క్రొవ్వులలో కరిగి పేరుకుని ఉంటాయి. ఇంక శరీరం నుండి బయటకు వెళ్ళే ప్రసక్తే లేదు.

మహిళల మీద ప్రభావం : మహిళలు చాలా సందర్భాలలో పురుగువిషాలు చల్లకపోయినా వీటి ప్రభావానికి గురవుతూనే ఉంటారు. వీరు పురుగు విషాలను చల్లే ముందు నీళ్ళలో కలిపే పని, స్ప్రేయర్‌ ఖాళీ అవగానే వెంటనే ద్రావణాన్ని పోసేందుకు వీలుగా దాన్ని కుండల్లో పోసుకుని నెత్తిమీద పెట్టుకుని స్ప్రేయర్‌ వెంట వెళ్తుంటారు. అలాంటి సందర్భాలలో కూడా ఆ విష ద్రావణం శరీరంమీద పడుతుంది. గాలిద్వారా లోనికి ప్రవేశిస్తుంది. ఇలాంటి పనుల్లో నిమగ్నమయ్యే మహిళలు విష ప్రభావానికి వెంటనే చనిపోకపోయినా వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. వీరిలో ముఖ్యంగా కనిపించేది పునరుత్పత్తి శక్తి దెబ్బతినటం. గర్భకోశాలకు సమస్యలు వచ్చి తీసివేయవలసి వస్తుంది. గర్భం ధరించలేకపోవచ్చు. ధరించినా నిలువలేకపోవచ్చు. నిలిచినా ఆరోగ్యకరమైన పిల్లలను కనలేకపోవచ్చు. 

పిల్లల మీద ప్రభావం : ఈ విషాల ప్రభావానికి పిల్లలు కూడా గురవుతారు. ఇంట్లోని ఈ విషాలను అందుకోవటం, ఖాళీ అయిన విషాల డబ్బాలతో ఆటలాడటం మొదలైనవి. చుట్టూ వాతావరణంలో ఉండే పురుగు మందుల అవశేషాలతో వీరి మానసిక, శారీరక పెరుగుదల దెబ్బతింటుంది. చురుకుగా ఉండలేరు. 

సమగ్ర సస్యరక్షణలో వృక్ష రసాయనాల ప్రాధాన్యత

క్ర.సం వృక్షం పేరువృక్షం భాగంమూల పదార్థంచర్య / లక్షణం
1.దిరిసినవిత్తనం, ఆకు, వేరుకేఫిక్‌ ఆసిడ్‌, ఆల్కలాయిడ్స్‌కీటక నాశిని
2.జీడి మామిడిజీడిపిక్క నూనెఫినాలిక్‌ పదార్థాలుకీటక నాశిని
3.సీతాఫలంఆకు, విత్తనంఆల్కలాయిడ్స్‌కీటక నాశిని
4.విప్పగింజల నూనెనూనెలు, సాపోనిన్స్‌కీటక నాశిని
5.చిన్న వేపగింజలుమెలియసిన్‌కీటక నాశిని
6.మోదుగపువ్వుల కషాయంచాల్‌కోన్స్‌, మోపనాల్‌చెదల నివారిణి
7.నిమ్మగడ్డిఆకులుసుగంధ నూనెలుచీమల నివారణకు
8.తులసిసుగంధ నూనెలు, యూజినాల్కీటక నాశిని
9.బిళ్ళ గన్నేరుఆకులు, వేరుఆల్కలాయిడ్స్‌కీటక నాశిని
10.చామంతిపువ్వులుపైరిత్రమ్స్‌(ఆల్కలాయిడ్స్‌)కీటక నాశిని
11.బిల్వం(మారేడు)ఆకులు ఆల్కలాయిడ్స్‌బీటా-సిటోస్టిరాల్‌, శిలీంధ్ర నాశినికీటక నాశిని,
12.ఆవాలుఆకులు, విత్తనాలునిన్‌ హైడ్రిన్‌, విటమిన్‌-ఎకీటక నాశిని
13.మిరియాలువిత్తనాలుఆల్కలాయిడ్స్‌(పైపరిన్‌)కీటక నాశిని, శిలీంధ్ర నాశిని
14.ఆముదంవిత్తనాలురిసినోలిక్‌ ఆసిడ్‌కీటక నాశిని
15.చాల్మూగ్రావిత్తనాలుచాల్లూగ్రిక్‌ ఆసిడ్‌బ్యాక్టీరియా నాశినికీటక నాశిని
16.చంపపూలు, విత్తనాలుసుగంధ తైలంకీటక నాశిని (దోమల నివారణకు)
17.తేయాకుఆకులుకాఫిన్‌, టానిన్స్‌, షికినిక్‌ ఆసిడ్‌కీటక నాశిని
18.కొబ్బరిఆకులుఅమినో ఆసిడ్స్‌, విటమిన్‌-బిశిలీంధ్ర నాశిని, వైరస్‌, తెగుళ్ళనివారణకు
19.నిమ్మపండుటెర్‌ఫైన్స్‌, ఎస్టర్స్‌కీటకనాశిని   (దోమల నివారణకు)
20.ూమ్మెత్తఆకులుఆల్కలాయిడ్స్‌, హయోసైన్‌, (ఎట్రాపైన్‌)కీటక నాశిని
21.మునగఆకులు, వేరుమొరింగిన్‌, బెంజలైమిన్‌బ్యాక్టీరియా నాశిని
22.వెల్లుల్లిఆకులు, గడ్డలుఅమైనో ఆమ్లాలు, అల్లెనిన్‌కీటక నాశిని
23.ూల్లిగడ్డలుఫినోలిక్‌ ఆమ్లాలుశిలీంధ్ర నాశిని
24.మెంతులుఆకులుఫ్లావనాయిడ్స్‌, సాపోనిన్స్‌, ఫెనికులారిన్‌కీటక నాశిని
25.వేపఆకులు, గింజలుఅజాడిరిక్టిన్‌, లిమొనాయిడ్స్‌కీటక నాశిని, శిలీంద్ర నాశిని
26.నీలగిరి (యూకలిప్టస్‌)ఆకులుసుగంధ నూనెలుశిలీంద్ర నాశిని
27.ద్రాక్షవిత్తనాలుఅమైనో ఆమ్లాలు, విటమిన్లుశిలీంద్ర నాశిని, కీటక నాశిని
28.వేరుశనగఆకులునత్రజనిశిలీంద్ర నాశిని
29.జామఆకులుబీటా-సిటో స్టిరాల్‌, మాస్‌లినిక్‌ ఆమ్లంశిలీంద్ర నాశిని
30.చిలకడ దుంపఆకులుఖనిజాలు, విటమిన్లు(ఎ,బి,సి)శిలీంద్ర నాశిని
31.జన్నఆకులుఖనిజాలు, విటమిన్లుశిలీంద్ర నాశిని
32.జనుముఆకులు, విత్తనాలుసాపోనిన్స్‌, విటమిన్‌-ఎకీటక నాశిని, శిలీంద్ర నాశిని
33.తంగేడుఆకులు, విత్తనాలుఎమోడిన్‌, క్వినాన్స్‌,టానిన్స్‌శిలీంద్ర నాశిని, వేరుకుళ్ళు నివారణకు
34.తోటకూర ఆకులుప్రోటీన్స్‌, ఖనిజాలుశిలీంద్ర నాశిని
35.గంగరావిఆకులు, విత్తనాలుథివిటిన్‌, గ్లైకోసైడ్స్‌శిలీంద్ర నాశిని/ కీటక నాశిని
36.ఎర్ర గన్నేరుఆకులుఓలెన్‌డ్రిన్‌, నిర్యోడిన్‌శిలీంద్ర నాశిని / కీటక న ాశిని
37.బెండఆకులు, కాయలుమ్యూసిలేజ్‌, పెక్టిన్‌శిలీంద్ర నాశిని
38.యూఫోర్బియాఆకులు, పూలుయూఫోర్బిన్‌, ట్రైటర్‌ఫినాయిడ్స్‌శిలీంద్ర నాశిని
39.లాంటానాఆకులుఆల్కలాయిడ్స్‌శిలీంద్ర నాశిని / కీటక నాశిని
40.బంతిపూలుఆల్కలాయిడ్స్‌శిలీంద్ర నాశిని
41.వావిలాకుఆకులుఆల్కలాయిడ్స్‌, నిషిండిన్‌కీటక నాశిని
42.బప్పాయిఆకులుకార్పైన్‌కీటక నాశిని
43.కానుగవిత్తనాలుకరంజిన్‌, గ్లాబ్రిన్‌కీటక నాశిని / శిలీంద్ర నాశిని
44.పుదీనాఆకులుపిప్పర్‌మింట్‌ తైలంశిలీంద్ర నాశిని
45.పొగాకుఆకులునికోటిన్‌కీటక నాశిని
46.పసుపుదుంపకుర్కుమిన్‌, ఆల్కలాయిడ్స్‌శిలీంద్ర నాశిని
47.పోక (వక్క)వక్కలుఅరికోలిన్‌, ఆల్కలాయిడ్స్‌శిలీంద్ర నాశిని / కీటక నాశిని
48.వసదుంపసుగంధ తైలాలుకీటక నాశిని
49.అల్లందుంపసుగంధ తైలాలుకీటక నాశిని
50.కొడిశపాలఆకులుఆల్కలాయిడ్స్‌కీటక నాశిని
51.కుంకుడుకాయలురెజిన్స్‌  (నురగనిచ్చే పదార్థాలు)కషాయాలలో ూపయోగించడానికి

పశువుల పేడ, మూత్రం ద్రావణం మొక్కలకు తక్షణ శక్తి ఇస్తుంది. కాబట్టి వర్షాభావ పరిస్థితులలో తెగుళ్లు / పురుగుల సమస్య నుంచి తేరుకుంటున్నప్పుడు దీనిని వాడుకోవచ్చు. పశువుల పేడ, పశువుల మూత్రంలో చాలా రకాల పంటలకు ఉపయోగపడే  సూక్ష్మజీవులున్నాయి. ఇవి పంటకు హానిచేసే తెగుళ్ళను నివారించడంలో ఉపయోగ పడతాయి. ఈ ద్రావణంలో ఉన్న పోషకాల (నత్రజని, భాస్వరం, పొటాష్‌ మరియు సూక్ష్మ పోషకాలు) వల్ల పంటలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ఈ ద్రావణాన్ని పంటకాలంలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవచ్చు.

 కావలసిన పదార్థాలు:

 పశువుల పేడ    5 కిలోలు

 పశువుల మూత్రం       5 లీటర్లు

 సున్నం  150 గ్రా||

 తయారు చేసే విధానం: 

 జాగ్రత్తలు:

ఉపయోగాలు: