మంచి విత్తనాలే మంచి దిగుబడులిస్తాయి – డా॥ జి.రాజశేఖర్‌, సుస్థిర వ్యవసాయ కేంద్రం

అధిక దిగుబడులు సాధించడానికి అవసరమైన వుత్పాదకాన్నింటిలోకీ విత్తనం అతి ముఖ్యమైనది. వ్యాస మహర్షి తండ్రి ఋషి పరాశరుడు ‘‘అత్యధిక దిగుబడులకు మూలం విత్తనం’’ అని అన్నారు. విత్తన స్వచ్ఛత కొనసాగించాలంటే విత్తనాలను మూడు సంవత్సరాలకు ఒకసారి నాణ్యమైన, జన్యు శుద్ధి కలిగిన విత్తనంతో మార్పిడి చేయాలి. నాణ్యమైన విత్తనం పైరు ఉత్పాదకతపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. గత నలభై సంవత్సరాలుగా అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తనాలను రూపొందించి మరియు వాటిని రైతులకు అందుబాటు ధరలలో అందించడంలో వ్యవసాయ విశ్వవిద్యాయాలు, వ్యవసాయశాఖ, ఇతర ప్రభుత్వ సంస్థలు కృషి చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రస్తుత విత్తన మార్పిడి రేటు 40 శాతం మాత్రమే. మిగతా 60 శాతం విత్తనాలను రైతు తమ స్వంత పొలాల నుండి పండిరచిన విత్తనాలే వాడుతున్నారు. 

విత్తనోత్పత్తి – ప్రమాణాలు 

పంట అధిక దిగుబడికి మంచి రకం వాడటం మొదటి చర్య. మంచి విత్తనం వాడటం రెండో చర్య. విత్తనం మంచిది కాకపోతే ఆధునిక యాజమాన్య పద్ధతులను పాటించినా, హెచ్చు దిగుబడిని సాధించలేం. మంచి విత్తనాలు కొన్ని ప్రమాణాలు కలిగి వుంటాయి. 

1. జన్యు శుద్ధత (జెనెటిక్‌ ప్యూరిటీ)

ఒక్కొక్క రకం విత్తనాలకు, ఆ విత్తనాల నుంచి పుట్టిన మొక్కలకు ప్రత్యేకమైన స్వరూపాత్మక లక్షణాలు, స్వాభావిక క్షణాలు వుంటాయి. ఉదాహరణకు స్వర్ణ రకం విత్తనాలు ఎరుపు రంగులో వుంటాయి. మొక్క మొలిచింది మొదలు కోత వరకు ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో వుండి మన కండ్లను ఆకర్షిస్తాయి. అవి స్వరూపాత్మక క్షణాలు. స్వర్ణ వరి మొక్కలు  నేలలో లభించే నత్రజనిని ఎక్కువగా తీసుకుంటాయి. నీటి ఎద్దడిని, నీటి ముంపును తట్టుకుంటాయి. ఇవి స్వాభావిక క్షణాలు. ప్రతి రకపు విత్తనం ఆ రకపు స్వరూపాత్మక, స్వాభావిక క్షణాలను తప్పనిసరిగా కలిగి వుండాలి. ఒక రకం విత్తనం నాటి, ఆ పంట కోసినప్పుడు అదే రకం పంట రావాలి. ఒక స్వచ్ఛమైన రకం నుంచి అదే రకం విత్తనాన్ని పొందటమే స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. దీనినే జన్యు శుద్ధత లేక జన్యు స్వచ్ఛత అంటారు. 

2. భౌతిక శుద్ధత

విత్తనం రంగు తగ్గకూడదు. పొల్లు (తాలు), సగం నిండిన విత్తనాలు  వుండకూడదు. విత్తనాలలో మట్టి బెడ్డలు, ఇసుక, దుమ్ము, దూగర మొదలైన జడ పదార్థాలు, కలుపు విత్తనాలు, వేరే పంట విత్తనాలు వుండకూడదు. జడ పదార్థాలు, కలుపు విత్తనాలు, ఇతర పంట విత్తనాలు ఎంత శాతంలో వున్నాయో తెలియజేసినప్పుడు భౌతిక శుద్ధత స్థాయి తెలుస్తుంది. అవేవీ లేకపోతే విత్తనం పూర్తి భౌతిక శుద్ధత కలిగి వుందని అంటారు.

3. తేమ శాతం

విత్తనంలో తేమ శాతం 14 కంటే ఎక్కువగా వుంటే నిల్వ చేయటానికి పనికి రాదు. తేమశాతం 11 కంటే తక్కువగా వుంటే మొలకెత్తదు. 13 శాతం తేమ కలిగిన విత్తనం మంచిది. 

4. మొలక శాతం

విత్తనం కనీసం 80 మొలక శాతం కలిగి వుండాలి. నూటికి కనీసం 80 గింజలు మొలకెత్తాలి. 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ మొలక శాతం కలిగివున్న విత్తనం మంచిది. మొలక శాతం పరీక్షించినప్పుడు 80 శాతం వుండవచ్చు. కానీ 8 నెలల తరువాత నుంచి మొలక శాతం తగ్గుతూ వుంటుంది. అందుచేత మొలక శాతం, పరీక్షించిన తేదీ, లేదా నెల విత్తనం సంచి మీద రాసి వుంటుంది. దానిని చూసి విత్తనం కొనాలి. ప్యాకింగ్‌ చేశాక 8 నెలలు మించితే ఆ విత్తనం కొనకూడదు.
జన్యు

మామిడి రకాలు 

నీలం  : 

ఆలస్యంగా కోతకు వచ్చే ఈ రకం దక్షిణ ఆంధ్రలోనూ, తమిళనాడులోనూ ఎక్కువగా పెంచబడుతోంది. చెట్టు మధ్యస్థం, పండు మధ్యమం. తోు మరీ మంద ముండదు. కండ నార లేదు. పసుపు పచ్చ రంగు. నాణ్యత ఎక్కువ, ఏటేటా దట్టంగా ఆలస్యంగా నమ్మకంగా కాస్తుంది. కాయ బాగా నిలువ ఉంటుంది. టెంక పురుగు బెడద ఎక్కువ. వేసవిలో ఎక్కువ వేడిని తట్టుకోలేదు. మెట్ట ప్రాంతాల్లో కాయ సరిగ్గా పెరగక గిడసబారి పోతుంది.

దశేరి : 

ఉత్తర భారతదేశంలో ముఖ్యమైన రకం. తెలంగాణా జిల్లాల్లో పెంచి, ఉత్తరాదికి ఎగుమతి చేయతగినది. చెట్టు మధ్యస్థం, కాయ పరిమాణం స్వల్పం నుండి సాధారణం. తోలు మరీ మందముండదు. పసుపు రంగు. కండ గట్టిగా వుంటుంది. నార తక్కువ. నాణ్యత అత్యుత్తమం. తేనె మంచు పురుగులకు గురి అవుతుంది. కాయ బాగా నిలువ ఉంటుంది. మన రాష్ట్రంలో సుమారు 1-1.5 నెలలు ముందుగా కోతకు వస్తుంది కాబట్టి దీనికి మంచి ధర పలుకుతుంది. 

చిన్న రసం: 

చెట్టు మధ్యస్థం నుండి పెద్దది. పండు మధ్యమం, రసభరితం, రుచి ఘాటు, నాణ్యత హెచ్చు. ఏటేటా దట్టంగా మధ్యకాలం నుండి ఆలస్యంగా కాస్తుంది. నిలువకు అంతగా పనికిరాదు. నార అధికం. ఒక మాదిరిగా నిలువ చేయవచ్చు. ఆవకాయకు కూడా అనువైనది.

పెద్ద రసం: 

రసం రకం. ప్రతి ఏటా బాగా కాస్తుంది. చాలా రసంతో కూడి ఉంటుంది. నార అధికంగా ఉంటుంది. పండు పరిమాణం పెద్దదిగా ఉంటుంది. మధ్యకాలంలో కోతకు వస్తుంది.

హిమాయత్‌ : 

మంచి నాణ్యత గల కోతరకం. కాయ పెద్దది. శ్రేష్టమైన మామిడి రకాలలో ఇది ఒకటి. ఈ రకం కోస్తా మరియు తెలంగాణ ప్రాంతాలకు అనుకూలమైనది. కాయలు జూన్‌ నెలలో వస్తాయి. కాపు తక్కువ 

మహమూదా వికారాబాద్‌: 

దగ్గరగా నాటుటకు అనువైన పొట్టి రకం. హెక్టారుకు 200 నుంచి 300 చెట్ల వరకు నాటవచ్చు. పండు మధ్యమం, తోలు పలుచన లేత పసుపు రంగు, కండ కొంత గట్టిగా ఉండి నార ఉండదు. నాణ్యత చాలా హెచ్చు. ప్రతి ఏటా దట్టంగా మధ్యకాలం నుండి ఆలస్యంగా కాస్తుంది. తేనె మంచు పురుగులను తట్టుకోలేదు. పెను గాలులను తట్టుకొంటుంది. నిలువ ఉంచుటకు చాలా అనువైనది. కోత మరియు రసం రకంగా కూడా పనికివస్తుంది. 

చిరుతపూడి గోవ (రాయల్‌ స్పెషల్‌)

నీలం రకం కాయని ప్రాంతాలలో కూడా రెండవ పంటగా సెప్టెంబరు – అక్టోబర్‌లో పునాస కాపు కాస్తుంది. చెట్టు మధ్యస్థం, పండు మధ్యమంగా ఉండి రసంతో నిండి ఉంటుంది.  పీచు ఎక్కువ, నాణ్యత ఎక్కువ, ఏటేటా మధ్య కాలం నుండి ఆలస్యంగా మొదటి పంట కాస్తుంది. తేనె మంచు పురుగులను ఒక మాదిరిగా తట్టుకోగలదు. గాలులను కొంత తట్టుకొంటుంది.

నాణ్యమైన బెండసాగుకు సూచనలు 

మన రాష్ట్రంలో సాగుచేస్తున్న కూరగాయల పంటల్లో టమాట, వంగతో పాటు బెండ కూడా ప్రధానమైన పంట. ఈ పంటను పట్టణాలు, నగర పరిసరాల్లో సాగు చేసుకుంటే లాభదాయకం. బెండలో మనకు కావలసిన పోషకాలే కాకుండా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణసంబంధిత వ్యాధులకు, మూత్ర సంబంధిత వ్యాధులకు ఔషధంగా బెండను వాడవచ్చు. అంతే కాకుండా బెండలో అయోడిన్‌ ఎక్కువగా ఉండటం వల న ‘గాయిటర్‌’ అనే వ్యాధిని నివారిస్తుంది. 

ప్రస్తుతం బెండసాగులో ఉన్న సమస్యలను పరిశీలించి నట్లైతే మొట్టమొదటి సమస్య మరియు అధిక నష్టం కలిగించే సమస్య పల్లాకు తెగులు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ తెగులును తట్టుకునే రకాలు లేదా హైబ్రీడ్‌ను మాత్రమే సాగు చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఈ తెగులు ఆశించితే దీని నివారణ చాలా కష్టం. తెగు ఆశించిన మొక్కలన్నీ పొలం నుండి పీకి కాల్చివేయాలి. కాబట్టి ముందు నుండే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.  ఇక రెండో సమస్య విత్తన లభ్యత. సాగుకు అనువైన విత్తనాలు సరైన సమయంలో లభించకపోవటం, ఒక వేళ విత్తనాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి ధర (ముఖ్యంగా  హైబ్రీడ్‌ విత్తనాలు) అందుబాటులో ఉండదు. రైతు ఈ సమస్య నుండి బయట పడాలంటే రకాలు లేదా హైబ్రీడ్‌ విత్తనాలను మీ పొలంలో మీరే స్వయంగా ఉత్పత్తి చేసుకోవాలి.  బెండ సాగు విషయానికొస్తే ఇది ఉష్ణ మండలపు పంట ఎత్తైన కొండ ప్రాంతాలల్లో, చల్లటి వాతావరణంలో సరిగా పెరగదు. చలిని, మంచును అస్సులు తట్టుకోలేదు. పగటి ఉష్ణోగ్రత్త 25 డిగ్రీ సెంటీగ్రేడ్‌ నుండి 40 డిగ్రీ సెంటీగ్రేడ్‌, అలాగే రాత్రి ఉష్ణోగ్రత 22 డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఉంటే మొక్క పెరుగుదల బాగా ఉండి అధిక దిగుబడినిస్తుంది.  బెండ సాగుకు సారవంతమైన ఇసుక నేల, మురుగు నీరు పోయే సౌకర్యం కలిగిన నల్లరేగడి నేల అనుకూలంగా ఉంటాయి. గుల్లగా, సారవంతమైన ఒండ్రునేలల్లో అధిక దిగుబడి ఇస్తుంది. బెండ సాగుకు విత్తన రకాల ఎంపిక చాలా ముఖ్యం. మిగతా కూరగాయ పంటలతో పోల్చిచూస్తే బెండలో హైబ్రీడ్‌ రకాలకు ధీటుగా సాధారణ రకాలు కూడా అధిక దిగుబడినిస్తాయి. రైతు హైబ్రీడ్‌ విత్తనాలపై ఖర్చు ఎక్కువ పెట్టకుండా వాటికి ధీటుగా దిగుబడినిచ్చే సూటి రకాలను ఎంపిక చేసుకోవాలి. అధిక దిగుబడినిచ్చే సూటి రకాలు అర్కా అనామిక, పర్భానిక్రాంతి, పంజాబ్‌ పద్మిని, అర్కా అభయ మొదలైన రకాున్నాయి. ఈ రకాలు అధిక దిగుబడిని ఇవ్వడమే కాకుండా పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకుంటాయి.  హైబ్రీడ్‌ రకాలల్లో వర్ష, విజయ్‌, విశాల్‌, ప్రియ, సుప్రియ మొదలగునవి పల్లాకు తెగులును తట్టుకుంటాయి. 

వాతావరణంలో ఉష్ణోగ్రత 17 డిగ్రీ సెంటీగ్రేడ్‌ కన్నా తక్కువ ఉన్నప్పుడు విత్తనం మొలకెత్తదు. అందుకే చలికాలం కొన్ని ప్రాంతాలల్లో సాగుకు పనికిరాదు. విత్తనం మొలకెత్తటానికి ఉష్ణోగ్రత 20 డిగ్రీ సెంటీగ్రేడ్‌  పైనే ఉండాలి. కాబట్టి బెండను ముఖ్యంగా వర్షాకాంలోనూ, వేసవిలోను సాగు చేసుకోవచ్చు. వర్షాకాలపు పంటగా సాగు చేస్తే జూన్‌- జూలై నెలల్లో విత్తుకోవాలి. ఆలస్యం చేస్తే (ఆగస్టు 15 తరువాత విత్తుకుంటే) మొక్కలు సరిగా పెరగవు. అంతే కాకుండా బూడిద తెగు ఎక్కువగా ఆశిస్తుంది. వేసవి పంటగా ఫిబ్రవరిలో విత్తుకోవాలి. ఫిబ్రవరి తర్వాత విత్తుకొన్నట్తైతే మొక్క పెరుగుద తగ్గి పల్లాకు తెగులు సమస్య ఎక్కువవుతుంది. కాబట్టి వర్షాకాలంలో జూన్‌ రెండో వారంలో, వేసవి పంటకైతే ఫిబ్రవరి రెండో వారంలో విత్తుకోవటం మంచిది. అధిక ధరపెట్టి విత్తనాన్ని కొంటాం కాబట్టి వృధా చేయకుండా సరైన మోతాదులో విత్తుకోవాలి. వర్షాకాలపు పంటకు ఎకరానికి 4-6 కిలోలు, వేసవి పంటకు 7-8 కిలోలు సరిపోతుంది. విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. చాలా మంది రైతు వర్షంపడిన తర్వాత అప్పటికప్పుడు మార్కెట్లో కొనుక్కొచ్చి విత్తన శుద్ధి చేయకుండా నేరుగా పొలంలో విత్తుకుంటారు. ఎప్పుడైతే విత్తనశుద్ధి చేసుకోలేదో పంటకాలంలో ఆశించే పురుగు, తెగుళ్ళను ఆహ్వానించినట్లే. విత్తనశుద్ధి చేసుకొని విత్తుకున్నట్లైతే మొదట్లోనే మనం సగం సమస్యలను నివారించినవాళ్ళమవుతాం. విత్తనశుద్ధికి గాను బీజామృతం లేదా బీజరక్షతో మరియు ట్రైకోడెర్మా విరిడి (5 గ్రా॥ కిలో విత్తనానికి) పట్టించి విత్తుకోవాలి. 

ఎరువుల యాజమాన్యం: 

బెండను రసాయన ఎరువు వాడకుండా సేంద్రియ ఎరువుతో పండించుకోవాలి. సేంద్రియ ఎరువు వలన నేల సారం పెరగడమే కాకుండా పురుగు, తెగుళ్ళ సమస్య చాలా వరకు తగ్గుతుంది. బెండ కాయలు కోసిన తర్వాత ఎక్కువ రోజు నిలువ ఉంటాయి. అంతే కాకుండా ఆరోగ్యానికి మంచిది. ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్ను పశువు ఎరువు లేదా 4 టన్ను వర్మీ కంపోస్టును వేసుకోవాలి. దీనితో పాటు 100 కిలో వేపపిండి వేసుకుంటే నేలలో ఉండే పురుగులను నివారించడమే కాకుండా మొక్కకు కావసిన నత్రజనిని అందిస్తుంది. రైతు తమ పంట అవశేషాలతో వానపాము ఎరువు (వర్మీ కంపోస్టు)ను స్వంతగా తయారు చేసుకొని వాడుకోవాలి. దీని తయారీకి ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుంది. కాబట్టి రైతులందరూ ఆ అవకాశాన్ని వినియోగించుకొని తమ పంటకు కావలసిన ఎరువులను తయారు చేసుకొన్నట్లైతే లాభదాయకంగా ఉంటుంది. వర్మీ కంపోస్టు వేసుకోవటం వల్ల మొక్కలకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాష్‌ వంటి మూ పోషకాలే కాకుండా సూక్ష్మపోషకాలైన జింక్‌, మాంగనీసు, ఐరన్‌, బోరాన్‌లు కూడా అందుతాయి. కాబట్టి మొక్కలు బాగా ధృడంగా పెరిగి పురుగులు, తెగుళ్ళు ఆశించకుండా తట్టుకోగలుగుతుంది. ఈ సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులైన అజిటోబాక్టర్‌ (2 కిలోలు) 50 కిలో పశువు ఎరువుతో కలిపి నీళ్ళు చల్లుతూ 7-10 రోజులు మాగనిచ్చి ఎకరాకు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. దీనితో పాటు 2 కిలో ఫాస్పోబాక్టీరియాను కూడా పొలం అంతా సమంగా చల్లుకోవాలి. వీటి వాడకం వలన పంట పెట్టుబడిని తగ్గించడమే కాకుండా వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు.

నీటి యాజమాన్యం: 

విత్తిన వెంటనే నీరు పెట్టాలి. ఆ తర్వాత 4-5 రోజుకు రెండవసారి నీరు పారించాలి. వర్షాకాలంలో వర్షాలు కురవకపోతే నేలలో తేమనుబట్టి నీరు పెట్టాలి. వేసవిలో 4-5 రోజులకు ఒకసారి నీటి తడులివ్వాలి. బెండను తక్కువ నీటితో డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్దతిలో కూడా సాగు చేసుకోవచ్చు. దీనికి కూడా ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. 

బెండలో విత్తనోత్పత్తి: 

రైతు విత్తన సమస్యను అధిగమించాలంటే తమ విత్తనాన్ని తామే ఉత్పత్తి చేసుకోవాలి. విత్తన ఉత్పత్తికి మామూలు పంట యాజమాన్య పద్దతులతోపాటు నాణ్యతా ప్రమాణాలు కోసం కొన్ని మెలకుల పాటిస్తే సరిపోతుంది.

విత్తన ఎంపిక: 

మనం ఉత్పత్తి చేసే విత్తనం స్వచ్చత దాని తయారీకి మనం ఎంపిక చేసిన విత్తనంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదైనా రకం విత్తనోత్పత్తికి అధికారులు ధృవీకరించిన బ్రీడర్‌ / ఫౌండేషన్‌ విత్తనాన్ని నమ్మకమైన సంస్థ నుండి తెచ్చుకోవాలి.

వేర్పాటు దూరం: 

ఒక రకం విత్తనాన్ని ఉత్పత్తి చేసినపుడు దాని పరిసర ప్రాంతాలల్లో ఇంకో బెండరకం ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ రెండు రకాల మధ్య పరపరాగ సంపర్కం జరిగి విత్తనం స్వచ్ఛత కోల్పోతుంది. కాబట్టి రకానికీ, రకానికీ మధ్య వేర్పాటు దూరం కనీసం 200 మీటర్లు ఉండాలి. అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో అడవిబెండ మొక్కులు లేకుండా చూసుకోవాలి. 

పంట పరీశీనలకు గాను ప్రతి 10 వరుసల తర్వాత ఒక మీటరు దూరం ఉంచాలి. దీని వన పంటను ఎప్పటికప్పుడు అన్ని దశలో పరిశీలించడానికి, కేళీను ఏరి వేయడానికి, సస్యరక్షణ చర్యలు చేయట్టడానికి వీలుగా ఉంటుంది.

కేళీను ఏరివేయటం:

బెండ విత్తనోత్పత్తిలో ఇది ముఖ్యమైన అంశం. విత్తన నాణ్యత కోసం కేళీలను ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. దీనిని పంటకాంలో 3 దశలో చేపట్టాలి. మొదటి సారి పూతకు ముందు మొక్క పెరుగుదలను బట్టి, ఆకు ఆకారాన్ని బట్టి, మొక్కలపై నూగును బట్టి, కాండంపై రంగును బట్టి విరుద్ధమైన మొక్కలను తీసివేయాలి. రెండవ సారి పూత సమయంలో ఆకర్షక పత్రాల రంగు, పుప్పొడి రంగులను బట్టి కేళీలను ఏరి వేయాలి. చివరిగా మూడవసారి కాయపెరుగుదల దశలో కాయ ఆకారం, కణుపు, రంగును బట్టి కేళీలను తీసివేయాలి. అలాగే పల్లాకు తెగులు, ఇతర తెగుళ్ళు ఆశించిన మొక్కలను, అడవి బెండ మొక్కలను ఏరివేయాలి. 

విత్తన సేకరణ: 

కాయలు బాగా పండి, ముదిరి ఎండిన తర్వాత కోసుకోవాలి. పూత దశ నుండి 35 రోజులల్లో కాయలు ముదిరిపోయి ఎండిపోతాయి. ఎండిన కాయలను ఎప్పటికప్పుడు కోసుకోవాలి. లేకపోతే కాయలు పగిలి విత్తనం రాలిపోతుంది. ఎండిన కాయలనుండి విత్తనాలను సేకరించి 10 శాతం తేమ ఉండేటట్లు ఆరబెట్టాలి. తర్వాత నాశిరకం విత్తనాలను వేరుచేసి నాణ్యమైన విత్తనాన్ని నిల్వ చేసుకోవాలి. 

సస్యరక్షణ:

మెట్టభూముల్లో పండ్ల తోటల సాగు

మన రాష్ట్రంలో అధికశాతం వ్యవసాయ పొలాలు, వర్షాధారంపై ఆధారపడి ఉన్నాయి. అందువల్ల ఆహారోత్పత్తి ఒక నిర్ణీతస్థాయిలో ఉండటం లేదు. అంతేకాకుండా చాలా వరకు మెట్ట ప్రాంతాల్లో పై పొర కొట్టుకుపోయి నేల నిస్సారమవుతుంది. దానికితోడు గత కొద్ది కాలంగా మన రాష్ట్రంలో ఏర్పడే వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతు ఎక్కువగా పండ్లతోటల సాగు వైపు దృష్టిపెడుతున్నారు. ఎందుకంటే మిగతా పంటల  కంటే పండ్ల తోటల సాగు తక్కువ నీటితో చేసుకోవచ్చు. అయితే ఈ వర్షాభావ పరిస్థితుల్లోనూ, మెట్టభూముల్లో పండ్లతోటలసాగు లాభదాయకమైనప్పటికీ అనువైన పండ్లజాతులను ఎంపిక చేసుకోవాలి. నేల మరియు నీటి సంరక్షణ పద్ధతులను అవంభించాలి. ఆధునిక మెట్ట వ్యవసాయ సాగు పద్దతులను తప్పనిసరిగా చేపట్టాలి.

మెట్టభూముల్లో పండ్లజాతుల ఎంపిక :

మెట్టప్రాంతాల్లో ముఖ్యంగా రేగు, ఉసిరి, సీతాఫలం, జామ పండ్లజాతులను, కొద్దిపాటి సాగునీటి సౌకర్యం ఉంటే దానిమ్మ మరియు సపోటను సమర్ధవంతంగా సాగుచేసుకోవచ్చు.

రేగు తోట సాగు వివరాలు : 

రేగులో ముఖ్యంగా గోల, సెబ్‌, కైథిలి, ఉమ్రాన్‌, మండియ వంటి రకాలను సాగుచేసుకోవచ్చు. వీటిని 6 x 6 మీ. దూరంలో అంటుమొక్కలను నాటుకోవాలి. నాటుకున్న తర్వాత వేరు మూలంపై వచ్చే చిగుళ్ళను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. కాండం ఒక మీటరు ఎత్తు పెరిగే వరకు దానిపై వచ్చే కొమ్మలను తీసివేస్తూ ఒక మీటరు ఎత్తుపెరిగిన తర్వాత 4-5 కొమ్మలను నాలుగువైపులా పెరిగేటట్లు చూడాలి. ఇలా పెరిగిన చెట్లను ప్రతి సంవత్సరం మార్చి – ఏప్రిల్‌ నెలల్లో కత్తిరింపులు చేయాలి. కత్తిరింపు చేయకపోతే చెట్టు అడ్డదిడ్డంగా పెరగడమే కాకుండా దిగుబడి కూడా తగ్గుతుంది.

అలాగే నాటిన తర్వాత 2-3 సం॥ వరకు కుండపద్ధతి (పిచ్ఛర్‌ పద్ధతి)లో నీరు పెట్టాలి. వేరుశనగ, లేదా వరి పొట్టును 8 సెం.మీ. మందంతో చెట్టు పాదుల్లో వేయాలి. ఇలా చేయడం వలన ఆరు సంవత్సరాల వయస్సున్న చెట్టునుండి దాదాపు 40-50 కిలో పండ్ల దిగుబడిని పొందవచ్చు. పండ్లన్ని ఒకేసారి పక్వానికి రావు కాబట్టి 3-4 సార్లు కోయవలసి ఉంటుంది.

ఉసిరిలో మనకు అనుకూలమైన రకాలు ఏమిటి? : 

ఉసిరిలో నరేంద్ర-7, నరేంద్ర-6, 10, చకియా, క్రిష్ణయ్య, కాంచన్‌ మొదలగు రకాలున్నాయి. ఉసిరిని నేల స్వభావాన్ని బట్టి 8 x 10 మీ. దూరంలో నాటుకోవాలి. ఉసిరిలో ఔషధగుణాలు  సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఉసిరి సాగు చాలా లాభదాయకం. దానికి తోడు ఉసిరిని ఎలాంటి నేలల్లోనైనా (చౌడు నేలల్లో) సాగు చేసుకోవచ్చు. ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న ఉసిరి చెట్టు నుండి 40-50 కిలోలు, 10 సంవత్సరాల వయస్సున్న చెట్టు 150-180 కిలోల పండ్ల దిగుబడినిస్తుంది.

సీతాఫలంలో మంచి రకాలు  : 

సీతాఫంలో బాలానగర్‌, ఐలాండ్‌జమ్‌, వాషింగ్‌టన్‌, అటిమో వంటి రకాలను 5 మీ. దూరంతో నాటుకోవాలి. దిగుబడి చెట్టుకు 70-80 కాయలను పొందవచ్చు.

జామలో మన రాష్ట్రానికి అనుకూమైన రకాలు : 

జామలో అనువైన రకాలు లక్నో-49, అలహాబాద్‌ సఫేద, సఫేద్‌జామ, కోహెర్‌సఫేద. వీటిని 6 x 7 మీ. దూరంలో నాటుకోవాలి. ప్రతి చెట్టు 1000-1200 కాయల  దిగుబడినిస్తుంది.

దానిమ్మలో మన రాష్ట్రానికి అనుకూమైన రకాలు : 

దానిమ్మలో మృదుల, భగువ, గణేష్‌, జోధ్‌పూర్‌రెడ్‌, జోలోర్‌సీడ్‌లెస్‌ వంటి రకాలను 5 మీ. దూరంలో నాటుకోవాలి. కాపు సమయంలో క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. నీటి ఎద్దడి ఏర్పడితే కాయలు పగులుతుంది. దానిమ్మలో ప్రతి సంవత్సరం ప్రతి చెట్టునుండి దాదాపు 100-150 కాయలను పొందవచ్చు.

సపోటలో అనుకూమైన రకాలు : 

సపోటలో కాలిపత్తి, కీర్తిబర్తి, ఛత్రి, ద్వారపుడి, క్రికెట్‌బాల్‌ వంటి రకాలను 10 మీ. దూరంలో నాటుకోవచ్చు. సపోట తోటలో చీడపీడల సమస్య మిగతా వాటికంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిపాటి నీటి సౌకర్యం ఉన్నపుడు సపోటను సాగుచేసుకొంటే లాభదాయకం. 10 సంవత్సరాల వయస్సున్న చెట్టు సుమారు 1500-2000 కాయలనిస్తుంది. 

పండ్లతోట సస్యరక్షణలో ఎరువుల వాడకం: 

ఈ పండ్ల జాతులన్నింటికీ సేంద్రియ ఎరువులను వాడుకోవాలి. చీడ పీడలు ఆశిస్తే జీవసంబంధిత లేదా వృక్ష సంబంధిత మందులను వాడి నివారించుకోవాలి. ఇలా చేయడం వలన నీటి ఎద్దడిని తట్టుకోవడమే కాకుండా పండ్ల నాణ్యత బాగుండి పండ్లు త్వరగా చెడిపోకుండా ఉంటాయి. అంతేకాకుండా రసాయన అవశేషాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యరిత్యా చాలా మంచిది. ఎగుమతి అవకాశాలు కూడా చాలా బాగుంటాయి.

పండ్ల తోటలు నాటుకోవటానికి అవసరమైన విత్తనాలు : 

పండ్ల జాతుల్లో అంటు మొక్కలు నాటుకోవడం మంచిది. ఎందుకంటే తొందరగా కాపుకు రావడమే కాకుండా మనకు కావలసిన రకం లక్షణాలను కలిగి వుంటాయి. ఈ అంటుమొక్కలను పండ్ల పరిశోధనా స్థానం, సంగారెడ్డి, మెదక్‌ నుండి పొందవచ్చు. ఇవి కాకుండా సాంప్రదాయకంగా మెట్టప్రాంతాల్లో లభించే నేరేడు, ఫాల్సా, బిలుసు, అంజూర వంటి పండ్ల జాతులను కూడా వేసుకోవచ్చు. వీటికి మార్కెట్‌లో పెద్దగా ధర భించకపోయినప్పటికీ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి కుటుంబస్థాయిలోనూ, గ్రామస్థాయిలోనూ పోషక ఆహార భద్రతను పొందవచ్చు.

పండ్ల తోటలకు అవసరమైన నేలలు  : 

మెట్ట భూముల్లో నీరు ప్రధాన సమస్య కాబట్టి నీటి పరిరక్షణా చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. సాధారణంగా ఈ భూములకు వాలు ఎక్కువగా ఉండి వర్షాకాలంలో పడే వానతాకిడికి నేల పైపొర కొట్టుకొనిపోయి సారవిహీనంగా ఉంటాయి. అందుచేత మెట్టభూముల్లోని భూసారం, నీటివనరులను కాపాడుకోవసిన బాధ్యత ఎంతో ఉంది. దీని కోసం వర్షాకాలంలో వచ్చే వాన నీటిని సాధ్యమైనంత వరకు నేలలో ఇంకేటట్లు చేయాలి. మట్టి, పోషక పదార్థాలు కొట్టుకొని పోకుండా కొన్ని మెలకువలు పాటించాలి. ముఖ్యంగా వాలుకు అడ్డంగా దున్నడం, స్థిరమైన వాలుగట్లు ఏర్పాటు చేయడం, వర్షపు నీటిని నిల్వ చేయుటకు పొలంలో 5 శాతం విస్తీర్ణంలో అక్కడక్కడ గుంతలు తీయటం చేయాలి. ఇలా తీసిన గుంతల్లో చేరిన నీటిని మనం అవసరమైనపుడు తోటకు పెట్టుకోవచ్చు.

పోషకాల యాజమాన్యం : 

రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి పశువు ఎరువు, వర్మీకంపోస్టు మొదలగు సేంద్రియ ఎరువు వాడకం పెంచడం వలన నేల భౌతిక స్థితి మెరుగుపడి వర్షపునీటిని గ్రహించి నిలుపుకునే శక్తి పెరుగుతుంది. అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువుగా తోటమధ్య ఖాళీ ప్రదేశంలో జీలుగ, జనుము, పిల్లిపెసర, మినుము, గోరుచిక్కుడు, ఉలవ, అలసంద వంటి పంటలను వర్షాకాలంలో వేసి దున్నడం వలన భూసారం పెరగడమే కాకుండా కొన్ని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పెరిగి నేలకు పోషకాలు గ్రహించే శక్తి పెరుగుతుంది. అలాగే ఇసుకతో కూడిన నేలలైతే కొంచెం బంకమన్నును చెట్లపాదల్లల్లో వేయడం వలన వేసవిలో నీటిఎద్దడిని కొంత వరకు తట్టుకుంటాయి.

వేసవిలో నీటిఎద్దడి సమస్యలు – జాగ్రత్తలు :

ప్రత్యేకించి వేసవిలో నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా మరిన్ని జాగ్రత్తలు, మెలకులు పాటించాలి. అవి

కుండలతో డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతి (పిచ్ఛర్‌ పద్ధతి): 

చెట్టుపాదలులో నలువైపులా మొదలుకు దూరంగా పీచువేర్లు ఉండే ప్రాంతంలో 20 లీటర్ల కెపాసిటీగల మట్టి కుండకు చిన్న రంధ్రం చేసి నేలలో పాతిపెట్టాలి. ఈ రంధ్రం ద్వారా భూమిలోకి నీరు కారి పీచువేర్లకు అందుతుంది. ఇలా చేయడం వన తక్కువ నీటితో చెట్లను పెంచుకోవచ్చు.

మల్చింగ్‌: 

వయస్సును బట్టి చెట్టుకు 30-40 కిలో వేరుశనగ పొట్టుగానీ, వరిపొట్టుగానీ పాదులలో సమంగా పరచడం వలన నీరు త్వరగా ఆవిరికాదు కలుపు మొక్కలు రావు. నేల ఉష్ణోగ్రత కూడ అదుపులో ఉంటుంది. అంతేకాకుండా ఈ పొట్టు కొంత కాలానికి క్రుంగిపోయి మట్టిలో కలిసి అల్యూమినియంగా మారి నేలకు నీటిని ప్పీల్చుకునే శక్తిని, పోషకాలను గ్రహించే శక్తిని పెంచుతుంది. తేమను నిలుపుకొనే గుణం కూడా పెరుగుతుంది. మేలుచేసే సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. ఈ విధంగా మల్చింగు చేయడం వలన 10 రోజులకు పెట్టవసిన నీటిని 20 రోజులకు పెట్టవచ్చు.

పాదుల్లో పైపొర మట్టిని గుల్ల చేయడం : 

పారతో లేదా గుంటకతో చెట్టుపాదులో పై పొర మట్టిని క్రింది మట్టిని విడదీసినపుడు నేలలో నేటి నాళాలు తెగి వాటిపై పలుచగా మట్టి కప్పబడడం వలన నీరు ఆవిరియ్యే ఆస్కారం అంతగా ఉండదు. నీటితడి ఇచ్చిన రెండు రోజుల తర్వాత పాదుల్లో పైపొరమట్టిని ఒక అంగుళం వరకు తెంపితే తెగిన మట్టిపొర నాళాలకు మూతలాగా పనిచేసి పాదులో తేమ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

డబుల్‌ రింగుపద్ధతిలో నీరు పెడ్డడం : 

చెట్టు మొదలు చుట్టూ 60 సెం.మీ. దూరంలో మొదటి గట్టును, చెట్టు కొమ్మ నీడ చివరి ప్రాంతంలో రెండవ గట్టును వేయాలి. నీరు చెట్టు మొదలుకు పోనివ్వకుండా ఈ రెండు గట్ల మధ్యలో పారించాలి. ఈ ప్రాంతంలో పీచువేర్లు ఎక్కువగా ఉండి నీటిని పీల్చుకుంటాయి. ఈ పద్దతిలో ఒక తడికి సుమారు 60 లీటర్ల నీటిని ఆదాచేసుకోవచ్చు. అంతేకాకుండా పారే నీటి ద్వారా సంక్రమించే వేరుకుళ్ళు, పుట్టగొడుగు తెగులు, బంక తెగులు వంటి ప్రమాదకరమైన తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు.

ఖరీఫ్‌లో కూరగాయల సాగు

ఇప్పుడిప్పుడే వర్షాలు  మొదలవడంతో రైతులు తమ పంటలను వేసుకోవడానికి సిద్ధమౌతున్నారు. కూరగాయల పంటను పండించే రైతులు సరైన పద్ధతులు పాటిస్తే మంచి ఫలితాలు పొందగరు. ఖరీఫ్‌లో వేసుకోవడానికి టమాట, వంగ, మిరప, బెండ, చిక్కుడు, గోరుచిక్కుడు, ఆకుకూరలు, తీగజాతి కూరగాయలు దాదాపు అన్ని కూరగాయలూ  అనువైనవే. 

తీగజాతి కూరగాయలు, చిక్కుడు, గోరుచిక్కుడు, బెండ వంటి కూరగాయల  విత్తన పరిమాణం పెద్దదిగా ఉంటుంది. కనుక వీటిని నేరుగా ప్రధాన పొలంలో విత్తుకోవచ్చు. కానీ విత్తన పరిమాణం చిన్నగా ఉన్న టమాట, వంగ, మిరప వంటి పంటల్లో ముందుగా చిన్న చిన్న నారుమళ్ళలో నారు పెంచుకొని ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. నారుమడి యాజమాన్యంలో సరైన జాగ్రత్తలు తీసుకొంటే నాటిన తర్వాత పంటకాలంలో వచ్చే చీడపీడల బెడద చాలా వరకు తగ్గుతుంది. దీనివలన పెట్టుబడులు తగ్గి కూరగాయల పంట సాగు లాభదాయకంగా ఉంటుంది.

నారుమళ్ళు పెంచడం వల్ల లాభాలు :

రైతులు ఎక్కువగా హైబ్రిడ్‌ విత్తనాలు వేసుకోవడానికే ఇష్టపడతారు. ఈ విత్తనాల ధర చాలా ఎక్కువ కాబట్టి వీటిని చాలా తక్కువ స్థలంలో పెంచడం వల్ల ఆ విత్తనం వృధా కాకుండా ఉపయోగపడేలా జాగ్రత్తలు  తీసుకోవచ్చు. చిన్న మొక్క దశ నుండే చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. నారుమడి తక్కువ స్థలంలో ఉంటుంది కాబట్టి పురుగులు, తెగుళ్ళను చాలా సులభంగా నియంత్రించవచ్చు. నారుమడి ద్వారా కూరగాయల పంటలను సాగుచేయడం వలన పంట గ్యారంటీగా చేతికి వస్తుంది. అవసరాన్ని బట్టి సస్యరక్షణ చేయడం సులభం. 

నారుమడి:

నారుమడి వేసుకునే ముందు నారుమడికి కావాల్సిన స్థలాన్ని ఎంపిక చేసుకోవడం ముఖ్యం. నారుమడి స్థలం ప్రధాన పొలానికి దగ్గరగా ఒక పక్కగా ఉంటే మంచిది. నారు మడి వేయాల్సిన స్థలం నీటి వసతికి దగ్గరగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎంపిక చేసిన స్థలం ఇసుకతో కూడిన గరప నేలలైతే మంచిది. అలాగే మురుగు నీటి పారుదల సౌకర్యం బాగా ఉండి కొద్దిగా ఎత్తైన ప్రదేశంగా ఉండాలి. స్థలం ఎంపిక చేసిన తర్వాత నారుమడి తయారు చేసుకోవటంలో జాగ్రత్తలు  తీసుకోవాలి.

సాధారణంగా రైతులు ఎత్తైన నారు మడులు తయారు చేసుకోకుండా అప్పటి కప్పుడు పొలంలో ఒక మూలకు విత్తనాలు విత్తుకొని నారుమడి పెంచుతారు. అలా చేయడం వల్ల వర్షం బాగా పడినపుడు ఆ మడుల్లో నీరు నిలబడి మొక్కలు కుళ్ళిపోతాయి. కాబట్టి ఎత్తైన నారుమడులు  (కనీసం 15 సెం.మీ. ఎత్తుతో) తయారు చేసుకోవాలి. నారుమడి తయారీకి ముందు ఎంపిక చేసిన స్థలాన్ని బాగా దున్ని ఎండకు ఎండేలా చేయాలి. దీనివల్ల నిద్రావస్థలో ఉన్న పురుగులు, వేరుపురుగు వంటివి బయటపడి నశిస్తాయి. నేలలో ఎటువంటి కలుపు మొక్కలు వేర్లు లేకుండా తీసివేసి కాల్చేయాలి. నారుమడిలో కలుపు మొక్కలు  తీయడానికి, ఇతర సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి అనుకూలంగా ఒక మీటరు వెడల్పు, 4 మీటర్ల పొడవు, 15 సెం.మీ. ఎత్తుతో నారుమడులను తయారు చేసుకోవాలి. 

వరిలో ఆకు చుట్టు పురుగు

పురుగు ఆశించు కాలం: మార్చి – నవంబర్‌

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నివారణ : 

వరిలో గొట్టాల పురుగు

పురుగు ఆశించు కాలం: మార్చి – నవంబర్‌

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నివారణ: 

జొన్నలో రసం పీల్చు పురుగు

పురుగు ఆశించు కాలం: సెప్టెంబర్‌ – జనవరి

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నివారణ :

వివిధ పంటలలో ‘పేనుబంక’

పురుగు ఆశించు కాలం: జులై – అక్టోబర్‌

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నివారణ :

వివిధ పంటలలో ‘పచ్చదోమ’

పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నివారణ :