వాతావరణం:

టమాట శీతాకాలపు పంట. కానీ సమశీతోష్ణ మండలాలలో బాగా పండుతుంది. మంచును అసలు తట్టుకోలేదు. విత్తనం 18.500C నుండి 240C లో బాగా మొలకెత్తుతుంది. కాయ 150C నుండి 320C వరకు బాగా పండుతుంది. టమాట ఎక్కువ ఉష్ణోగ్రతను గానీ, ఎక్కువ వర్షపాతమును గానీ తట్టుకోలేదు.

నేలలు:

టమాటను యిసుకతో  కూడిన గరప నేలల నుండి బరువైన బంక నేలల వరకు వివిధ రకాలైన నేలల్లో సాగుచేయవచ్చు. అధిక దిగుబడికి నీరు బాగా ఇంకే బరువైన గరప నేలలు శ్రేష్ఠం. వర్షాకాల ప్రారంభంలో తెలంగాణలోని తేలిక పాటి నేలలలో వర్షాధార పంటగా కూడా సాగుచేయవచ్చు. ఉదజని సూచిక 6.0 నుండి 7.0 గల సారవంతమైన నేలలు చాలా అనుకూలం.

టమాటలో మంచి విత్తనాలు

రకం పేరు: అర్క వికాస్‌

పంట కాలం: 105-110 రోజులు (ఖరీఫ్‌)              

దిగుబడి: 140-160 క్వింటాళ్ళు / ఎకరానికి

రకం పేరు: పూసా రుబీ

పంట కాలం: 130-135 రోజులు (ఖరీఫ్‌)              

దిగుబడి: 120-140 క్వింటాళ్ళు / ఎకరానికి

రకం పేరు:  మారుతమ్‌

పంట కాలం: 135-140 రోజులు (ఖరీఫ్‌)              

దిగుబడి:  120-140 క్వింటాళ్ళు / ఎకరానికి

రకం పేరు:  పి.కే.యమ్‌ – 1

పంట కాలం: 135  రోజులు (ఖరీఫ్‌), 140 రోజులు (రబీ)

దిగుబడి: 200 క్వింటాళ్ళు / ఎకరానికి

రకం పేరు:  ఎస్‌-22

పంట కాలం:  105-110 రోజులు (ఖరీఫ్‌),100 రోజులు (రబీ)

దిగుబడి:  200 క్వింటాళ్ళు / ఎకరానికి

రకం పేరు:  అర్కమేఘాలి

రకం పేరు:  పూసా ఎర్లీడ్వార్ఫ్‌ (పిఇడి)

రకం పేరు:  రాములక్కాయ

పంట కాలం: 110 రోజులు(ఖరీఫ్‌)

దిగుబడి: 80 క్వింటాళ్ళు / ఎకరానికి

విత్తన శుద్ధి:

టమాటను విత్తేముందు, ఆ తర్వాత 4 గ్రాముల ట్రైకోడెర్మావిరిడే తో లేదా బీజరక్షతో విత్తనశుద్ధి చేయాలి.

విత్తన మోతాదు:

సూటి రకాలైతే ఎకరాకు 200 గ్రాముల విత్తనం కావాలి. సంకర జాతి రకాలైతే ఎకరాకు 70 నుండి 80 గ్రాముల విత్తనం సరిపోతుంది.

నారుమడి తయారీ:

నేలను శుభ్రంగా 3-4 సార్లు నాగలితో దుక్కి దున్నుకోవాలి. ఆఖరి దుక్కిలో 40 కిలోల మాగిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. 4 మీ. పొడవు, 1 మీ. వెడల్పు, 15 సెం.మీ. ఎత్తు కలిగిన నారు మడులను తయారు చేసుకోవాలి. మురుగునీరు పోవడానికి మడికి మడికి మధ్య 50 సెం.మీ. దూరం ఉంచాలి. ఒక ఎకరాకు 10 నారుమడులు సరిపోతాయి. 25-30 రోజుల వయస్సు గల నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి.

ఎరువుల యాజమాన్యం:

ఆఖరి దుక్కిలో ఎకరాకు దాదాపు 8-12 టన్నుల పశువుల ఎరువు వేసి బాగా కలియదున్నాలి.

జీవ ఎరువులు:

కొన్ని రకాల సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని (78%) స్థిరీకరించి, మొక్కలకు అందించి భూసారాన్ని పెంపొందిస్తాయి. జీవ ఎరువుల వాడకం వల్ల ఉత్పత్తి ఖర్చు తగ్గించడమే కాకుండా వాతావరణ కాలుష్యం తగ్గించవచ్చు.

ఎకరాకు 2 కిలోల అజటోబాక్టర్‌ను 50 కిలోల పశువుల ఎరువులో కలిపి, నీళ్ళు చల్లుతూ 7-10 రోజులు మాగనిచ్చి తర్వాత ఆఖరి దుక్కిలో వేయాలి. దీనితో పాటు ఎకరాకు 2 కిలోలు ఫాస్ఫో బాక్టీరియా (పిఎస్‌బి)ను పొలం అంతా సమంగా చల్లాలి.

నాటేకాలం:

టమాటను మన రాష్ట్రంలో అన్ని కాలాలలోనూ పండిస్తున్నారు. కానీ రబీ పంటకాలం ముఖ్యమైనది. ఖరీఫ్‌ పంటను జూన్‌-జూలై (వర్షాధారపు పంట) మాసాలలోనూ, రబీ పంటను అక్టోబర్‌ – నవంబర్‌ మాసాలలోనూ, వేసవి పంటను జనవరి – ఫిబ్రవరి మాసాలలోనూ విత్తుకుని పండిస్తే అధిక దిగుబడులు వస్తాయి. వేసవి కాలంలో ఆలస్యంగా విత్తినపుడు శంఖు మరియు ముడత రోగాలు ఆశించి పంట దిగుబడి చాలా తగ్గిపోతుంది.

ప్రధాన పొలం తయారీ:

భూమిని నాగలితో 3 -4 సార్లు బాగా దుక్కి దున్ని చదును చేయాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8-10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును వేసి కలియ దున్నాలి. నేలలో ఎకరానికి 200 కిలోల వేపపిండిని కలపడం ద్వారా నులిపురుగులను, వేరుపురుగును నివారించవచ్చు.

నాటే దూరం:

టమాట పంటను వరుసలలో కానీ లేదా బోదెలలో కానీ నాటుకోవాలి. వరుసకు వరుసకు మధ్య 60 సెం.మీ దూరం వుండేలాగా మరియు మొక్కకు మొక్కకు మధ్య 40 సెం.మీ. 45 సెం. మీ దూరం  ఉండేలాగా నాటుకోవాలి. వేసవిలో 45 x 30 సెం.మీ. దూరంలో నాటుకోవాలి.

అంతరకృషి:

నీటి యాజమాన్యం:

టమాట సాగులో చేయవలసిన పనులు:

సస్యరక్షణ

పురుగులు:

కాయతొలుచు పురుగు, పచ్చదోమ, పొగాకు లద్దె పురుగు, తెల్ల దోమ,

తెగుళ్ళు:

నారుకుళ్ళు తెగులు, వడలిపోవు తెగులు, ఆకుమాడు తెగులు, వెర్రికుళ్ళు వైరస్‌ తెగులు, టమాట మచ్చలు మాడు వైరస్‌ తెగులు

పురుగుల నివారణ:

కాయతొలుచు పురుగు నివారణ:

తెగుళ్ళ నివారణ:

పంటకోత:

పంటకోత అనంతరం జాగ్రత్తలు:

గ్రేడింగ్‌: కాయలు కోసిన తరువాత సాధారణంగా రైతులు గంపలలో కానీ, బుట్టలలో కానీ గ్రేడింగ్‌ చేయకుండా అమ్మడం వల్ల తక్కువ ధర పలికి నష్టం వస్తుంది. టమాట కాయలు కాసిన వెంటనే, కాయ పరిమాణాన్ని బట్టి వివిధ గ్రేడులుగా చేయాలి. భారతదేశములో టమాటాను ఈ క్రింది నాలుగు గ్రేడులుగా విభజించారు.

1) సూపర్‌ ఎ 2) సూపర్‌  3) ఫ్యాన్సి 4) వ్యాపార గ్రేడు

ప్యాకింగ్‌ :

టమాట కాయలను గ్రేడింగు చేసిన తరువాత బుట్టలకు బదులుగా ప్లాస్టిక్‌ క్రేట్‌లలోగానీ, ప్లాస్టిక్‌ సంచులలోగానీ ప్యాక్‌ చేయాలి. టమాటాలను ప్లాస్టిక్‌ క్రేట్స్‌లలో ప్యాక్‌ చేసినట్లయితే దూర ప్రాంతాలకు రవాణా చేయుటకు అనుకూలంగా ఉంటుంది.

నిల్వ వుంచడం:

టమాట పండ్లను 130 సెంటీ గ్రేడ్‌లో 90% తేమతో ఎక్కువ రోజులు నిల్వ వుంచవచ్చు.