వంగ

భారతదేశంలో ప్రాచీనకాలం నుండి పండించబడే కూరగాయలలో వంగ ప్రధానమైంది. ఈ పంటను అన్ని ఋతువులలోనూ పండించవచ్చు. పర్వత ప్రాంతాలలో వంగ పంటను వేసవిలో మాత్రమే పండిస్తారు.

మన దేశంలో రంగు, పరిమాణం, ఆకారాన్ని బట్టి వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఎన్నో విధాలైన వంగ రకాలు ఆయా ప్రాంతాలలో పండించ బడుతున్నాయి. మనదేశంలో ఒరిస్సా, బీహార్‌, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో వంగ విస్తారంగా పండించబడుతున్నది.

వాతావరణం:

వంగ ఉష్ణ మండలపు పంట, అధిక ఉష్ణోగ్రతలనూ, నీటి ఎద్దడినీ చాలా వరకు తట్టుకోగలదు. కొండప్రాంతాల్లో, చల్లటి వాతావరణంలో మొక్క పెరుగుదల తగ్గుతుంది. అధిక చలినీ, మంచునూ తట్టుకోలేదు.

నేలలు:

వంగ సాగుకు లోతైన, సారవంతమైన, మురుగు నీరు పోయే సౌకర్యంగల అన్ని రకాల నేలలూ అనుకూలమే. నేల ఉదజని సూచిక 5.5-6.5 ఉండే నేలలు అనుకూలం. బెట్టను మరియు చౌడును కొంత వరకు తట్టుకోగలదు.

వంగలో మంచి రకాలు

రకం పేరు:  గులాబి

పంట కాలం:  140-160  రోజులు(ఖరీఫ్‌), 130 రోజులు (రబీ)

దిగుబడి: 130-140 క్వింటాళ్ళు / ఎకరానికి

రకం పేరు:  పూసా పర్పుల్‌లాంగ్‌

పంట కాలం:  135-140  రోజులు(ఖరీఫ్‌)

దిగుబడి:120-160 క్వింటాళ్ళు / ఎకరానికి

రకం పేరు:  భాగ్యమతి

పంట కాలం:  150-165  రోజులు (ఖరీఫ్‌), 140 రోజులు (రబీ)

దిగుబడి:120-140 క్వింటాళ్ళు / ఎకరానికి

రకం పేరు:  గ్రీన్‌ లాంగ్‌

పంట కాలం: 150  రోజులు (ఖరీఫ్‌), 130 రోజులు (రబీ)

దిగుబడి: ఎకరానికి 10 క్వింటాళ్ళు వరకు దిగుబడి వస్తుంది.

రకం పేరు:  చమడపాలెం

పంట కాలం:  130  రోజులు (ఖరీఫ్‌), 120 రోజులు (రబీ)

దిగుబడి:  120 క్వింటాళ్ళు / ఎకరానికి

రకం పేరు:  శ్యామల

రకం పేరు:  గ్రీన్‌ రౌండ్‌

పంట కాలం: 120  రోజులు (ఖరీఫ్‌), 110 రోజులు (రబీ)

దిగుబడి:  10 క్వింటాళ్ళు / ఎకరానికి

విత్తన శుద్ధి:

వంగను విత్తేముందు, ఆ తర్వాత 4 గ్రాముల ట్రైకోడెర్మావిరిడే తో లేదా బీజరక్షతో విత్తనశుద్ధి చేయాలి.

నారుమడి తయారీ:

4 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 15 సెం.మీ. ఎత్తు కలిగిన నారుమడులను తయారు చేసుకోవాలి. ఒక ఎకరాకు సరిపడా నారును పెంచడానికి ఇలాంటివి 10 నారుమడులు అవసరమవుతాయి. మురుగునీరు పోయేందుకు నారుమడికీి నారుమడికీ మధ్య 50 సెం.మీ. వెడల్పుతో కాలువలు ఏర్పాటు చేయాలి. నారుమడిలో 40 కిలోల పశువుల ఎరువు వేయాలి.

విత్తనాన్ని 5 సెం.మీ. దూరం గల వరుసలలో పలుచగా విత్తాలి. విత్తిన వెంటనే శుభ్రమైన ఎండుగడ్డితో నారుమడిని కప్పాలి. మొలక వచ్చిన వెంటనే జాగ్రత్తగా ఎండుగడ్డిని తీసివేయాలి. దీనివల్ల మొలక త్వరగా వచ్చే అవకాశముంది.

30-35 రోజులలో 15 సెం.మీ. ఎత్తులో, 3-4 ఆకులు కలిగిన నారు నాటడానికి వీలుగా తయారవుతుంది.

కలుపు నివారణ:

విత్తేముందు నారుమడులను నల్లని పాలథీన్‌ ఫిల్మ్‌తో మల్చింగ్‌ చేసి చాలా వరకు నారుమడిలో కలుపును నివారించవచ్చు. వేరు పురుగులను, నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళను నివారించవచ్చు.

ఎరువుల యాజమాన్యం:

ఆఖరి దుక్కిలో ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి.

విత్తన మోతాదు:

ఎకరానికి సూటిరకాలైతే 260 గ్రాములు, సంకర రకాలైతే 120 గ్రాముల విత్తనంతో పెంచిన నారు నాటడానికి సరిపోతుంది.

నాటేకాలం:

సాధారణంగా వంగను ఏడాది పొడవునా సాగుచేయవచ్చు. వర్షాకాలం పంటగా జూన్‌-జులై, శీతాకాలం పంటగా అక్టోబరు-నవంబరు, వేసవి పంటగా ఫిబ్రవరి-మార్చిలో విత్తుకొని నాటుకోవాలి.

ప్రధాన పొలం తయారీ:        

పొలాన్ని నాలుగైదు సార్లు దున్ని బాగా చదునుచేయాలి. వర్షాకాలం పంటను బోదెలు, కాలువల పద్దతిలో, వేసవి, శీతాకాలం పంటను చదునైన మళ్ళలో నాటుకోవాలి.

నాటే దూరం:

గుబురుగా పెరిగే రకాలను 75 x 50 సెం.మీ, పొడవుగా నిటారుగా పెరిగే రకాలను 50 x 50 సెం.మీ. ఎడంలో నాటుకోవాలి.

అంతరకృషి:

పైపాటు ఎరువులు వేసే ప్రతిసారీ గొప్పుతవ్వి మొక్కల మొదళ్ళపైకి మట్టిని ఎగదోస్తే పంట బాగా పెరుగుతుంది. 2-3 సార్లు అంతరకృషి చేస్తే మంచి దిగుబడులు పొందవచ్చు.

నీటి యాజమాన్యం:

వంగ నారు నాటేముందు లేదా నాటిన తరువాత నీటి తడి ఇవ్వాలి. నేలలో తేమనుబట్టి 7-10 రోజులకొకసారి, అదే వేసవిలో అయితే 4 రోజుల కొకసారి తడిపెట్టాలి. మంచు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో చలిని తట్టుకోవటానికి ఎక్కువసార్లు తడి ఇవ్వాల్సిన అవసరముంటుంది. పూత, కాపు దశలలో ఎప్పుడూ నేలలో తేమ ఉండేటట్లు చూసుకోవాలి. లేదంటే పూత రాలిపోయే ప్రమాదముంది. బరువైన నల్లరేగడి నేలల్లో తప్పనిసరిగా మురుగునీరు పోయే సౌకర్యం కల్పించాలి. వేసవిలో కాయకోతకు ఒకటి రెండు రోజుల ముందు తప్పనిసరిగా తడినివ్వాలి. లేదంటే కాయలో చేదు ఎక్కువవుతుంది.

వంగ సాగులో చేయాల్సిన పనులు

సస్యరక్షణ

పురుగులు

అక్షింతల పురుగు, మొవ్వు మరియు కాయతొలుచు పురుగు, పిండి పురుగు, రసంపీల్చు పురుగులు (పేనుబంక, పచ్చదోమ, ఎర్రనల్లి), నులి పురుగులు వంగ పంటను ఆశిస్తాయి.

తెగుళ్ళు

ఆకుమాడుతెగులు, వెర్రి తెగులు, మోజాయిక్‌ వైరస్‌ తెగులు

పురుగుల నివారణ:

తెగుళ్ళ నివారణ: