శరీరంలో తడి ఆరిపోకుండా నివారించడం

పారుడు లేదా పుర్రు వచ్చిన జీవాల శరీరం నుంచి నీరు నష్టం కాకుండా చూడడం, శరీరం తడారిపోకుండా చూడడం అవసరం. శరీరం కోల్పోతున్న నీటిని, ఖనిజాలను వెంటనే భర్తీ చేయడం అత్యవసరం. ఎక్కువగా నీటిని, ఇతర ద్రావకాలను తాగించడమే దీనికి మార్గం. శరీరంలోకి తిరిగి నీటిని భర్తీ చేసే కొన్ని ద్రావకాలను క్రింద ఇస్తున్నాము. వాటిలో దేనినైనా చేసి చూడండి.

జబ్బుపేరు – కారణంనివారణ
కాక్సీడియాసిస్‌పరిశుభ్రత పాటించాలి. పిల్లలను మేత తొట్టెల బయట వుంచాలి. వాటి పేడ నీటి తొట్టెలలో పడకుండా ఏర్పాటు చేయాలి, ఏ విధమైన ఒత్తిడి కలగకుండా చూడాలి.
ముర్రుపాల లోపంపుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలి. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. పిల్లలను పొడిగా వుండే, పరిశుభ్రమైన వెచ్చటి సురక్షితమై చోట వుంచాలి.
కోలై బాసిల్లాసిస్‌   పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలి. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. పిల్లలను పొడిగా వుండే, పరిశుభ్రమైన వెచ్చటి సురక్షితమైన చోట వుంచాలి.
చిటుకు రోగం – ఇ.టి.టీకా ఇప్పించాలి
పట్టలు, బొల్లలు, జెనిగలునట్టల మందు ఇవ్వాలి, మంచి పోషక పదార్థాలు గల మేత పెట్టాలి, పరిసరాలు పరిశుభ్రంగా వుంచాలి. మూడు నెలల వరకు బయట మేపటానికి తీసుకెళ్ళకూడదు.

(‘సన్న జీవాలను సక్కంగ సాకుదాం’

ఆంత్ర ప్రచురణ నుండి)