చట్టబద్ధంగా లేబుళ్లపైనా, కరపత్రాల్లోనూ క్రిమి సంహారక మందులకు సంబంధించి ఈ దిగువ సమాచారాన్ని ఇవ్వాలి. మీరు తీసుకున్న క్రిమి సంహారక మందుతోపాటు ఈ సమాచారం ఇవ్వకపోతే దాని తయారీదారు లేదా మీరు కొన్న దుకాణాదారు మిమ్మల్ని మోసం చేసినట్లుగా పరిగణించాలి. ఇలా సమాచారం ఇవ్వకపోవడం, నైతికంగా చట్టపరంగా రెండు విధాలా కూడా సరైనది కాదు. దీనిని అందరూ ప్రతిఘటించాలి. 

ప్రభుత్వం రూపొందించిన కీటక సంహారకాల నియమాలు (1971) ఇలా వున్నాయి. 

క్రిమి సంహారకం ప్యాకింగ్‌, లేబులింగ్‌ల సమాచారం: 

ఈ నియమాల ప్రకారం క్రిమి సంహారకాల్ని లేబుల్‌ చేయకుండా, ప్యాక్‌ చేయకుండా అమ్మరాదు. 

క్రింది సమాచారాన్ని లేబుల్‌ మీద ముద్రించి గాని, చెరిగిపోని సిరాతోరాసి కానీ ఆ లేబుల్‌ను మందు డబ్బా లేదా సీసా మీద అంటించాలి. అదేవిధంగా మందు పాత్ర వున్న ప్యాకింగ్‌ కవరుపై కూడా సమాచారం ఇవ్వాలి. ఇవ్వవలసిన సమాచారం. 

  సబ్‌ రూల్‌ 3 ప్రకారం, చతురస్రం (డైమండ్‌)లోని పై త్రిభుజంలో కింది గుర్తులు, వాటికి సంబంధించిన స్టేట్‌ మెంట్‌లు వుండాలి. 

కరపత్రంపై వుండవలసిన సమాచారం: 

పట్టిక

గుర్తు రంగువిషతీవ్రతLD50 oral mg/kgLD50 Dermal mg/kg
ముదురు ఎరుపుఅత్యధికం (Extreme)1-501-200
ముదురు పసుపుపచ్చఅధికం (High)51-500201-2000
ముదురు నీలంసాధారణం (Moderate)501-50002001-20000
ముదురు ఆకుపచ్చఅల్పం (Slight)5000 పైన20000 పైన

LD50 ఎంత తక్కువైతే ఆ క్రిమి సంహారక మందు అంత ఎక్కువ విషపూరితమన్న మాట.