Skip to content

Agroecology School Language Telugu

యూరియా రైతులకు వరమా…

Srikanth Adira July 20, 2020 2 min read

కాంప్లెక్స్ ఎరువులకు యూరియా ప్రత్యామ్నాయం కాదు

రోజు రోజుకూ పెరిగిపోతున్న ఎరువుల ధరలతో కుదేలవుతున్న రైతులకు కాంప్లెక్స్ ఎరువుల కన్నా తక్కువ ధరలకే లభ్యమవుతున్న యూరియా ఓ ప్రక్క, యూరియా వేసిన వెంటనే పైరు పచ్చగా కన్నుల పండుగగా అగుపడడం మరో ప్రక్క వెరసి అధిక మోతాదులో యూరియాను వాడుటకు రైతులు మొగ్గు చూపుతున్నారు! ఫలితం… అధిక ఖర్చు… చీడపీడల తాకిడి అధికమవడం.. మరలా సస్యరక్షణకు అధిక వ్యయం.. చివరగా రైతు నష్టాల పాలవడం!

అసలు యూరియాలో ఏముంది? ఎలా పనిచేస్తుంది?

యూరియా 46శాతం నత్రజని కలిగిన అత్యంత శక్తివంతమైన ఎరువు. తెల్లని గుళికల రూపంలో వున్న ఈ ఎరువు వెదజల్లుటకు అనుకూలంగా వుంటుంది. తేలికగా నీటిలో కరిగి మొక్కకు అందుబాటులోకి మారుతుంది.

విచక్షణా రహితంగా యూరియా వాడితే ఏమవుతుంది?

  • యూరియా తేలికగా నీటిలో కరుగుతుంది. గాలిలో కలిసిపోతుంది. కనుక గాలి, నీరు కాలుష్యం… చివరకు తల్లి పాలు కాలుష్యం!
  • ధాన్యపు పైర్లు విపరీతంగా పెరిగి పడిపోవడం, పూత ఆలస్యంగా వచ్చి పంట కాలం పొడిగించడం, తాలు గింజలు ఏర్పడటం జరుగుతుంది.
  • బెల్లం దగ్గరకు చీమలు చేరినట్లుగా అధికంగా యూరియా వాడిన చేల దరికి చీడపీడలు సులభంగా చేరుతాయి.
  • వెరసి అధిక పెట్టుబడులు… దిగుబడి తగ్గిపోవడం!
  • యూరియాలో ఎలా లాభం పొందాలి?
  • భూసార పరీక్షను అనసరించి ఎరువులు వాడాలి.
  • పైరుకు నత్రజని అవసరం మొదటి నుండి చివరి వరకూ వుంటుంది. కాబట్టి 3-4 దఫాలుగా యూరియా వేయాలి.
  • యూరియా వేసేటప్పుడు తేమ ఉండేలా చూడాలి.
  • వరిలో నాట్లు వేసేటప్పుడు, పిలక దశలో, చిరుపొట్ట దశలో వేయాలి. అంతే కాదు, నీరు తీసివేసి బురద పదును మీద చల్లి 24-48 గంటల తర్వాత నీరు పెట్టాలి.
  • యూరియా, వేపపిండి కలిపి వేసుకుంటే నత్రజని సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాదు చీడపీడలను అరికడుతుంది. (50 కిలోల యూరియాకు 5 కిలోల వేపపిండి కలపాలి)
  • భూమిలో తగిన తేమ లేనప్పుడు, ఎరువును వేసిన తరువాత నీరు పెట్టడానికి వసతి లేనప్పుడు, సమస్యాత్మక భూములలో నత్రజని అందించడానికి సాధారణంగా అన్ని పంటల మీద, ఫలవృక్షముల మీద 2-3 శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
  • మెట్టపైర్లలో యూరియా వెదజల్లుట కన్నా మొక్క ప్రక్క గుంతలో వేసి మట్టి కప్పడం వలన యూరియా వృధాని అరికట్టవచ్చు.
  • ఎరువును సకాలంలో, సరియైన మోతాదులో, సరియైన పద్ధతిలో వినియోగించాలి.
  • యూరియాకు బదులుగా పచ్చిరొట్ట ఎరువులను, పశువుల ఎరువులను మరియు వాన పాముల ఎరువులను వాడుకోవాలి. వీటితో పాటుగా రైజోబియం, అజోస్పైరిల్లమ్, అజటోబాక్టర్ వంటి జీవన ఎరువులను వాడుకోవాలి.

Questions and answers

Ask a question

Questions are checked by our team before they appear. Your email is not shown.