కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యం లోని జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం (NCOF), ప్రాంతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం, నాగపూర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం, గ్రామీన్ అకాడమీ, హైదరాబాద్, ల ద్వారా సేంద్రియ వ్యవసాయం పై శిక్షణ ఇవ్వబడుతుంది.
జూలై 7-13 వరకు ఈ శిక్షణ ఏడు రోజుల పాటు వుంటుంది. రోజు ఉదయం 10.00 గంటల నుండి 1.00 వరకు (మూడు గంటల పాటు) జూమ్ లో జరుగుతాయి. ఎంపికైన అభ్యర్ధులు వారి ఇంట్లో నుంచే శిక్షణ లో చేరవచ్చు. తమ మొబైల్ ఫోన్ లో కాని, కంప్యూటర్ లో కాని జూమ్ అప్లికేషను డౌన్లోడ్ చేసుకోవాలి.
అర్హత: ఈ శిక్షణ లో చేరటానికి కనీసం ఇంటర్మీడియట్ లేదా ప్లస్ 2 పాస్ అయి వుండాలి. గ్రామీణ యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 100 మంది అభ్యర్ధులను ఎంపిక చేసుకోవటం జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్లికేషను ApplicationFormForTraining లేదా , online లో వివరాలు నింపవచ్చు.
అధిక సమాచారం కోసం 08500683300 కాని 9000005840 కానీ కాల్ చేయండి లేదా csa@csa-india.org email చేయండి
1 Comment
Sir application fell chesanu application number raledhu sir….only submitted ane vachendi