పొలం బడి హరిత విప్లవం తర్వాత రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం పెరగటం తో పాటు అనేక విత్తన రకాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. స్థానిక పరిస్థితులకు, అనేక అవసరాలకి ఉపయోగపడేలా వున్న విత్తన రకాలు, అన్ని ప్రదేశాలకి ఒకే రకం అన్నట్టుగా అధిక దిగుబడి వంగడాల పేరుతో ప్రవేశ పెట్టిన రకాల వలన రైతులకు బాగా నష్టం కలిగింది. అనేక సాంప్రదాయ రకాలు కనుమరుగయ్యాయి. వరి పంటకి భారతదేశం పుట్టినిల్లు. ఒకప్పుడు కొన్ని వేలరకాల వరి రకాలు సాగులో వున్న దేశం మనది. ఇవి పురుగులు/తెగులు, నీటి ఎద్దడిని, నేలలో/నీటిలో వుండే ఉప్పు ఇతర సమస్యలు తట్టుకోగలిగినవి, లోతైన నీటిలో పెరుగుతాయి. అలాగే అధిక దిగుబడి వంగాడాలతో పోలిస్తే అనేక పోషకాలు అదనంగా కలిగి వున్నవి.
వరిలో అనేక జీవ వైవిధ్యాన్ని ప్రోత్శాహిస్తూ జనగామ జిల్లా జీడికల్లు గ్రామం, లింగాల గణపురం మండలం లో ఈ విత్తనాల ఉత్పత్తి చేస్తున్న రైతు/వైద్యుడు డా. వెంకన్న గారి పొలం లో సాంప్రదాయ వరి రకాల సాగు మరియు విత్తనోత్పత్తి పై పొలం సందర్శన, శిక్షణ వుంటుంది.
శనివారం 21 నవంబర్, 2020
ఉదయం 11:00 నుండి 4:00 వరకుస్థలం– వెంకన్న గారి పొలం, జీడికల్ గ్రామం, జనగాం నుండి 18 కి.మీ.
రిజిస్ట్రేషన్ ఫీజు – ఒక్కొక్కరికి Rs. 1000 (అదనపు ఛార్జీతో, అవసరమైతే ప్రయాణ ఏర్పాట్లు)
ఈ శిక్షణలో పాల్గొన్న వారికి ప్రత్యేకంగా ఇవి ఇవ్వబడును.
Rice Biodiversity Box
- దీనిలో 200 గ్రాముల చొప్పున 5 రకాల విత్తనాలు, వాటి వివరాలు, సాగు పద్దతులు ఉన్నాయి.
- ఈ విత్తనాలను తమ పొలంలో పరీక్షించుకొని, విత్తన సేకరణ చేసి రైతులు మరల వాడుకోవచ్చు
వన్నెల వరి పుస్తకం
వరి పంటలోని, పంట సాగు పద్దతులలోని వైవిద్యాలని, ఉపయోగాలని, సమస్యలని, సాగు పద్దతులని వివరిస్తూ భారతదేశం లో అందుబాటులో వున్న వరి రకాల తో వివరంగా రాసిన పుస్తకం
రచయితలు డా. రామాంజనేయులు జి.వి.డా. రాజశేఖర్. జి.
నిర్వాహకులు... వెంకన్న (రైతు), డా. రాజశేఖర్ (సి ఎస్ ఎ)అధిక సమాచారం కోసం 8500 683300, 9869451919 కాల్ చేయండి. లేదా vinyasa@csa-india.org email చేయండి