ప్రస్తుతం వ్యవసాయం రంగం, చిన్న సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక ముఖ్యమైన పరిష్కారం రైతులు సంఘటితం అవటం, ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసుకోవటం. విస్తరణ, ఆర్ధిక, మార్కెట్, లాంటి సేవలు గ్రామ స్థాయి వరకు అందించటం, పంట ఉత్పత్తులను గ్రామ స్థాయిలో సేకరించి అమ్ముకోటం లాంటి ప్రధాన సేవలు ఉత్పత్తిదారుల సంఘలు అందించటం ద్వారా రైతుల కు మంచి ధరలు లభించేలా చేయవచ్చు.
అయితే ‘అముల్’ తర్వాత అంత ‘ముల్కనూరు తర్వాత అంత ప్రాచుర్యం పొందిన సహకార సంఘాలు లేవు. ప్రాధమిక సహకార సంఘాలు మొదట్లో కొంత విజయాలు సాధించినా, క్రమేపి రాజకీయ జోక్యాలతో దెబ్బతిన్నాయి. 1995 పరస్పర సహకార సంఘాల చట్టం తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా ఒక పెద్ద విప్లవమే సృష్టించింది. అ తర్వాత కేంద్ర ప్రభుత్వం డాక్టర్ వై. కె. అలఘ్ కమిటీ సిఫరుసులతో కంపెనీ చట్టం లో మార్పులు చేసి ‘ఉత్పత్తి దారుల కంపెనీలు గా రిజిస్టర్ చేసుకోవటానికి అవకాశం కల్పించారు.
గత కొన్ని సంవత్సరాలుగా NABARD, SFAC, NCDC లు చేసిన ప్రయత్నాలతో దేశ వ్యాప్తం కొన్ని వేల ఉత్పత్తి దారుల సంఘాలు ఏర్పడ్డాయి. వచ్చే ఐదేళ్ళల్లో 10,000ఉత్పత్తి దారుల సంఘాలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయటానికి కేంద్ర ప్రభుత్వం కొత్త పధకం తీసుకు వచ్చింది. అయితే, ఈ సంఘాల నిర్వహణ మరియు యాజమాన్యానికి అవసరమైన మానవ వనరులు గ్రామస్థాయి లో దొరకక పోవటం ఒక వైపు, మార్కెట్ అంతా అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగం వైపు మారటం, చిన్న దుకాణాల స్థానం లో పెద్ద కార్పొరేట్ రిటైల్ సంస్థలు వస్తున్న నేపధ్యంలో కొత్త నైపుణ్యాలు, విజ్ఞానం, దృక్పధం అవసరం. ఈ దిశగా సహకార సంఘాలకు, ఉత్పత్తి దారుల సంఘాలకు సహాయ సహకారాలు అందించటం కోసం, సుస్థిర వ్యవసాయ కేంద్రం ‘FPOhub‘ పేరిట ఒక ప్రయత్నం ప్రారంబించింది. ఉత్పత్తి దారుల సంఘాలకు అందాల్సిన సేవలన్ని ఒకే వేదిక పైనుంచి అందించటమే FPOhub లక్ష్యం. ప్రస్తుతం 200 పైగా సహకార సంఘాలు/ఉత్పత్తిదారుల సంఘాలతో సుస్థిర వ్యవసాయ కేంద్రం పనిచేస్తుంది. ఇందులో 23 పూర్తిగా సేంద్రియ వ్యవసాయం లో వున్నవి. వీటి సమాఖ్య సహజ ఆహారం పేరుతో నేరుగా వినియోగదారులకు సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్ చేస్తుంది. హైదరాబాద్, విశాకపట్నం నగరాల్లో సహజ ఆహారం రిటైల్ షాప్ లు తెరిచింది.
ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేసే దిశ లో అనేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టుతుంది. ఈ శిక్షణ ‘ఉత్పత్తిదారుల సంఘాల నిర్వహణ, యాజమాన్యం లో వున్న అనేక విషయాల పై వుంటుంది. ఇందులో పాల్గొనే వారు దాదాపు 25 గంటలు సొంతంగా చదువు కోవటానికి/నేర్చుకోవటానికి అవసరమైన రిసోర్స్ మెటీరియల్ తో పాటు బిజినెస్ ప్లాన్ చేసుకోవటానికి, రికార్డులు నిర్వహించుకోవటానికి కావాల్సిన ఫోర్మాట్స్/టెంప్లేట్, workbooks, అనేక కేసు స్టడీస్ తో పాటు నిపుణులతో 15 గంటలపాటు (రోజుకు మూడు గంటలు, ఇదు రోజులు) సెప్టెంబర్ 13-18 వరకు జూమ్ లో జరుగుతుంది.
ఉత్పత్తిదారుల సంఘాలతో పనిచేస్తున్న CEO లు, సిబ్బంది, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తూ సహకార సంఘాలు/ఉత్పత్తిదారుల సంఘాలతో పనిచేస్తున్న వాళ్ళు, ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయాలనుకుంటున్న ఔత్సాహికులు ఇందులో పాల్గొన వచ్చు.
Course Features
- Lectures 35
- Quizzes 0
- Duration Lifetime access
- Skill level All levels
- Language English
- Students 13
- Certificate Yes
- Assessments Yes